ప్రకాశం

టిడిపి మేయర్ అభ్యర్థిగా డాక్టర్ నీరద ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 23:తెలుగుదేశంపార్టీ మేయర్ అభ్యర్థిగా వైద్య ఆరోగ్యశాఖలో రాష్టస్థ్రాయిలో పనిచేస్తున్న డాక్టర్ నీరద పేరును దాదాపు అధిష్టానవర్గం ఖరారుచేసినట్లు పార్టీవర్గాల సమాచారం. నీరద గతంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిగా పనిచేశారు. ఆమె పదవీవిరమణ కావటంతో ప్రస్తుతం నేషనల్ హెల్త్‌మిషన్ కన్సల్‌టెన్సీగా పనిచేస్తున్నారు. ఈసంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణతోపాటు, రాష్టమ్రంత్రి గంటా శ్రీనివాసరావు రాష్టవ్య్రాప్తంగా ఖాళీగా ఉన్న నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని ప్రకటించిన నేపధ్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల హడావుడి త్వరలోప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈపాటికే ఎన్నికలకు సంబంధించిన ఓటర్ల జాబితాను రూపొందించేపనిలో నగరపాలక సంస్థ అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉన్న నేపధ్యంలో ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్‌ను సునాయసంగా సాధించుకుంటామని తెలుగుతమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఒంగోలు నగర పాలక సంస్థ అధికారులతో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సమావేశం నిర్వహించి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశాలు జారీచేశారు. రిజర్వేషన్లప్రకారం ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పదవి ఎస్‌సి మహిళకు కేటాయించారు. దీంతో నీరదను తెలుగుదేశంపార్టీ రంగంలోకి దించుతుండగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ నేతలు మాత్రం అభ్యర్థిని వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో శాసనసభ్యుడు సుమారు వందలకోట్లరూపాయల వ్యయంతో నగరాన్ని అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇదిఇలాఉండగా తెలుగుతమ్ముళ్లు ఐక్యంగా ముందుకుసాగుతూ ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలే లక్ష్యంగా ఉన్నారు. కాని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలోని నాయకులకు మాత్రం నగరపాలక సంస్థ ఎన్నికలు శిరోభారంగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తరువాత మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరానికి చుట్టపుచూపులా వచ్చిపోతున్నారు తప్ప నగరపార్టీ అభివృద్ధితోపాటు, కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై మాత్రం ఎలాంటి ఆందోళనబాట పట్టని పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో తాను ఒంగోలు నియోజకవర్గంలోక్రియశీలక పాత్రపోషిస్తానని చెప్పిన బాలినేని హైదరాబాదుకే పరిమితమై ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రత్యేక హోదా ఆందోళన కార్యక్రమానికి సైతం బాలినేని దూరంగా ఉన్నారు. మొత్తంమీద నగర పాలక సంస్థ ఎన్నికలు వైకాపాకు ఛాలెంజ్‌గా నిలవనున్నాయి. ఇదిఇలాఉండగా ఇటీవల ఎంఎల్‌సి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ తరపున పారిశ్రామిక వేత్త,మాజీ పార్లమెంటుసభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డిని చంద్రబాబు రంగంలోకి దించగా వైకాపా మాత్రం సంతమాగులూరుకు చెందిన ఆట్ల చినవెంకటరెడ్డిని రంగంలోకి దించింది. శాసనమండలి ఎన్నికల నడిమధ్యలోనే తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటున్నట్లు వైకాపా జిల్లా నాయకులు ప్రకటించారు. దీంతో మాగుంట భారీ మెజార్టీతో గెలుపొంది వైకాపాకు సవాల్‌గా నిలిచారు. కాగా త్వరలో జరిగే ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికలను వైకాపా శ్రేణులు సవాల్‌గా తీసుకుంటారా లేక నడిమధ్యనే ఎంఎల్‌సి ఎన్నికల మాదిరిగా చేస్తారా అన్న ప్రశ్న వైకాపా తమ్ముళ్లల్లో వినిపిస్తోంది.

ఖరీఫ్ రుణ లక్ష్యం రూ 440 కోట్లు
* పిడిసిసి బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ స్పష్టం
మార్కాపురం, మే 23: రానున్న ఖరీఫ్ సీజన్‌లో రైతులకు 440కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జిల్లా పిడిసిసి బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్ అన్నారు. స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో సోమవారం జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు రుణాలు సరిపోకుంటే మరో 40కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. అలాగే దీర్ఘకాలిక రుణాల కింద 90కోట్ల రూపాయలు రైతులకు రుణాలుగా ఇవ్వాలని నిర్దేశించినట్లు తెలిపారు. కర్షక రుణవికాస్ పథకం ద్వారా మరో 30కోట్ల రూపాయలు రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. జిల్లాలో వ్యవసాయ పరపతి సంఘాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు, 70 సంఘాలకు 14కోట్ల రూపాయలు వెచ్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో ఐదు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రెండు కంది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేసేందుకు 42కోట్ల రూపాయలు విడుదల చేశామని తెలిపారు. పిడిసిసి బ్యాంకు గత ఏడాది వరకు 24కోట్ల రూపాయల నష్టాల్లో ఉండగా, గత ఏడాది 27కోట్ల రూపాయలు లాభాలు వచ్చి ప్రస్తుతం 3కోట్ల రూపాయల లాభాల్లో ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సిఇఓ బి అంజయ్య, ఓఎస్‌డి బి మోహన్‌రావు, ఓఎస్‌డి లీగల్ డి సీతారామయ్య, ఎజిఎం రాధాకృష్ణమూర్తి, వైపాలెం, మార్కాపురం బ్యాంకు మేనేజర్లు జి శంకర్‌రెడ్డి, వి శంకర్ పాల్గొన్నారు.

వివాదాలకు స్వస్తి పలుకుదాం
- డిఎస్పీ ఎదుట చేతులు కలిపిన
పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామస్థులు
వేటపాలెం, మే 23: చీరాల డిఎస్పీగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రేమ్‌కాజల్ పొట్టి సుబ్బయ్యపాలెం వివాదాలపై ప్రత్యేక దృష్టి సారించి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చారు. ఏడాది కాలంగా గ్రామంలోని ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయారు. విబేధాలకు రాజకీయాలు ఆజ్యం పోయడంతో మెజారిటీ వర్గం కొన్ని కుటుంబాలను గ్రామం నుంచి బహిష్కరించే వరకు వివాదం ముదిరింది. ఈ నేపధ్యంలో పలు మార్లు రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్‌లు గ్రామాన్ని సందర్శించి వివాదాలకు తెరదించే ప్రయత్నాలు చేసినప్పటికీ సఫలం కాలేదు. ఇటీవల మెజారిటీగా ఉన్న వర్గం కొన్ని కుటుంబాలను వివాహాలకు హాజరు కాకుండా అడ్డుకోవడం, మంచినీటి సరఫరాకు అడ్డంకులు కల్పించడం వంటి చర్యలకు పాల్పడడంతో గ్రామంలోని సమస్యలు తిరిగి అధికారుల దృష్టికి వచ్చాయి. స్పందించిన డి ఎస్పీ ఇరువర్గాల పెద్దలను తన కార్యాలయానికి పిలిచి సమస్యలను తెలుసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకోవడం తప్పదని, సామరస్యంగా ఉంటే తమ సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో ఇరు వర్గాల పెద్దలు సయోధ్యకు అంగీకరించారు. వేటపాలెం తహశీల్దార్ కె లింగమహేశ్వరరావు, చీరాల రూరల్ సి ఐ ఎం బి కె అల్త్ఫా హుస్సేన్, వేటపాలెం ఎస్సై సయ్యద్ మస్తాన్ ఫరీఫ్‌లతో కలిసి డిఎస్పీ సోమవారం గ్రామాన్ని సందర్శించి గ్రామస్థులను సమావేశపర్చి గ్రామపెద్దలతో పాటు యువకులు, మహిళలు కూడా వివాదాలకు స్వస్తి పలకాలని చెప్పారు. ఈ సందర్భంగా రెండు వర్గాల పెద్దలు మహిళలు, యువకులతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయించి రెండువర్గాల వారితో చేతులు కలిపించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామంలో శాంతియుత వాతావరణం కొనసాగితే మూడు నెలల తరువాత గతంలో ఉన్న కేసులను తొలగించేందుకు సహకరిస్తామని, ఘర్షణలు పునరావృతం అయితే రౌడీషీట్లు తెరిచేందుకు వెనకాడేది లేదని హెచ్చరించారు.

శ్రీవారి కల్యాణం కమనీయం
మద్దిపాడు, మే 23 : మండలంలోని మల్లవరం కొండపై వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం వెంకటేశ్వరస్వామి, దేవేరుల కల్యాణం వేదపండితులు వేద మంత్రోచ్ఛరణల మధ్య కమనీయంగా జరిగింది. ఆలయానికి తూర్పు వైపున గల కల్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై మేళతాళాలతో అర్చక స్వాములు ఉత్సవమూర్తులను ఏర్పాటు చేశారు. వివిధ పూలతో ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు నారాయణం వెంకటాచార్యులు, రాజగోపాలచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య తాళిబొట్టు, తలంబ్రాలను భక్తుల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఉభయ దాతలుగా పల్లకి సుబ్బరామిరెడ్డి, నాగమ్మ దంపతులు కల్యాణ వేడుకల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కల్యాణోత్సవానికి ముందుగా బొమ్మనంపాడు వికాస్ తరంగణి సభ్యులు విష్ణు సహస్త్ర నామ పారాయణం, లక్ష్మీ సహస్త్ర నామ పారాయణాన్ని పఠించారు. కళ్యాణానంతరం వివిధ కుల వర్గాల వారి ఆధ్వర్యంలో భక్తులకు, వచ్చిన యాత్రికులకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎం నాగయ్య, గ్రామ పెద్దలు , అర్చకులు , మోత కాపులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.