ప్రకాశం

మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 6: ఒంగోలు మున్సిపల్ కార్యాయలం వద్ద గురువారం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సుమారు 13 మంది మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు సిఐటియు నాయకులను ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు అనుబంధం) ఆధ్వర్యంలో గత ఏడు రోజులుగా ఒంగోలు మున్సిపల్ కాంట్రాక్ట్ పారుశుద్ధ్య కార్మికులు జిఓ నెంబరు 279ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు జిఓ నెంబర్ 279ని రద్దు చేయాలని, స్కాన్ మిషన్ కార్మికుల మెడలో వేసుకొని పారిశుద్ధ్య కార్మిక్రమాలు చేపట్టే విధానాన్ని నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ధర్నా చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం జేసీ- 2 మార్కండేయులు తమ విధులలో భాగంగా పనిమీద మున్సిపల్ కార్యాలయం వద్దకు వచ్చారు. ఈ క్రమంలో జేసీ2 మార్కండేయులును మున్సిపల్ కార్మికులు కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి న్యాయం చేయాలని కోరేందుకు ప్రయత్నించారు. కార్మికులు మాట్లాడుతూ తమ కాంట్రాక్టర్ జిఓ నెంబరు 279ని రద్దు చేస్తూ కోర్టు నుంచి స్టే తీసుకొచ్చినప్పటికి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటకృష్ణ ఒంగోలు మున్సిపాలిటీలో జిఓ నెంబర్ 279ని అమలు చేయడంతోపాటు స్కాన్ మిషన్ విధానాన్ని పెట్టి, ఆర్‌టీఎంఎస్ విధానాన్ని అమలు చేస్తూ మైక్రో ప్యాకెట్ విధానాన్ని పెట్టి కార్మికులను ఇబ్బందులు పెడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఇద్దరు కార్మికులకు ఒక ప్రాంతాన్ని ఇచ్చి ఆ ప్రాంతంలో ఆ ఇద్దరు కార్మికులు సుమారు 350 ఇళ్లు పరిశీలించి ఆ ఇళ్ల నుంచి చెత్త సేకరించి తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి తరలించాలని కమిషనర్ తమను ఇబ్బందులు పెడుతున్నట్లు జేసీకి తెలిపారు. ఈ విధానం జిల్లాలోని మిగిలిన అద్దంకి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీలలో లేదని ఒక్క ఒంగోలులోనే అమలుచేయాలని కమిషనర్ వెంకటకృష్ణ చూడటం వలన తాము తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు జేసీ2 దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు కలుగజేసుకొని ప్రభుత్వం ఇచ్చిన జీవోను తాము అమలు చేయక తప్పదని కమిషనర్, అధికారులు చెప్పడంతో మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ అధికారుల మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో తమకు న్యాయం జరిగే వరకు జేసీ2ని బయటకు వెళ్లనివ్వబోమని కార్మికులు మొండికేసి కూర్చోవడంతో ఒంగోలు మున్సిపల్ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు అక్కడకు చేరుకొని జేసీ2ను కార్యాలయం నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నించారు. దీంతో మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయం ప్రధాన గేటు మూసివేసి జేసీ2ను బయటకు వెళ్లకుండా ఆందోళన చేపట్టారు. అయితే పోలీసులు గేటు తీసి జేసీ2ను బయటకు పంపేందుకు ప్రయత్నించగా, మున్సిపల్ కార్మికులు గేటు తెరవనీయకుండా అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరగడంతోపాటు గేటు ఇద్దరూ పట్టుకొని నెట్టుకునే సందర్భంలో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ తోపులాటలో ఒక మహిళా మున్సిపల్ కార్మికురాలు శ్వాస అందక కింద పడిపోవడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో ఆమెను ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం తరలించారు. ఈ తోపులాటలో మహిళా పోలీసులకు కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు సిఐటియు యూనియన్ నాయకులైన శ్రీరాం శ్రీనివాసరావు, అదేవిధంగా నాయకులు పి శ్రీనివాసరావులను బలవంతంగా అరెస్ట్‌చేసి ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. దీంతో కార్మికులు తమ నాయకులను విడుదల చేయాలని రోడ్డుపై నిరసనకు దిగడంతో పోలీసులు మరో 13 మంది కార్మికులను అదుపులోకి తీసుకొని వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌కి తరలించారు. దీంతో సిఐటియు జిల్లా నాయకులు చీకటి శ్రీనివాసరావు, దామా శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ఒంగోలు వన్‌టౌన్ పోలీస్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసిన తమ నాయకులతోపాటు కార్మికులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులను, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. తొలుత పోలీసు చర్యలను నిరసిస్తూ కార్మికులు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టారు.