ప్రకాశం

జిల్లాలో పార్టీని బలోపేతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 8 : జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అద్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షునిగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు బి యల్లారెడ్డి ని నియమిస్తూ శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందించి మాట్లాడారు. జిల్లాలో పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అదే స్పూర్తితో జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ఆదేశాల మేరకు యల్లారెడ్డిని జిల్లా పార్టీ ఉపాధ్యక్షునిగా నియమించడం జరిగిందన్నారు. కొత్తపట్నం మండలం వజ్జిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన యల్లారెడ్డి పార్టీకి గత 40 సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారని, ఆయన చేసిన సేవలను గుర్తించి పార్టీ సముచిత స్థానాన్ని కల్పించిందన్నారు. జిల్లాలో, కొత్తపట్నం మండలంలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో పని చేయాలని ఆదేశించారు. నాయకులందరూ ఎల్లారెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మాట్లాడుతూ తనకు పదవి రావడానికి సహకరించిన పిసిసి అద్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈదా సుధాకర్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పనబాక లక్ష్మీ, జెడి శీలం , జిల్లా ఇన్‌చార్జులు సిహెచ్ దేవకుమార్ రెడ్డి, ఈశ్వర్ రావులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పార్టీ అద్యక్షులు శ్రీపతి ప్రకాశం, పిసిసి కార్యదర్శులు వేమా శ్రీనివాసరావు, గుర్రాల రాజ్ విమల్, యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి , జిల్లా జె కెసి చైర్మన్ పి వెంకటేశ్వర్లు , జిల్లా బిసి సెల్ అద్యక్షులు కె తిరుపతయ్య, నాయకులు ఉద్దండి మల్లికార్జున్ , ఎన్ కోటిరెడ్డి, ఎన్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
చెన్నైలోని మాగుంట కంపెనీలపై ఐటీ దాడులు
*షాక్‌లో తెలుగుతమ్ముళ్లు *రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు : మాగుంట

ఒంగోలు,డిసెంబర్ 8: మాగుంట కుటుంబానికి జాతీయ,రాష్టర్రాజకీయాల్లో ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది. మాగుంట కుటుంబం ఏ రాజకీయపార్టీలో ఉన్నా ఆ రాజకీయపార్టీకి వనె్న తెస్తూనే ఉంటుందనేది జగమెరిగిన సత్యమే. అలాంటి నేపధ్యం ఉన్న తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, ప్రకాశం జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి చెందిన చెన్నైలోని పలుకంపెనీలపై ఆదాయపుపన్ను శాఖాధికారులు శనివారం దాడులు చేయటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. మాగుంట కంపెనీలపై ఐటీ దాడులు జరగటంపై ఇటు రాష్ట్ర, జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు, మాగుంట అభిమానులు షాక్‌కు గురైనారు. మాగుంట కంపెనీల్లో ఐటీదాడులంటా అంటూ మాగుంట అభిమానులు ఆందోళనకు గురై ఇది రాజకీయ కక్షతో కూడిన దాడులంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా తనపై రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ మాగుంట శ్రీనివాసులరెడ్డి చెన్నైనుండి ఆంధ్రభూమి ప్రతినిధికి ఫోన్‌ద్వారా తెలిపారు. దీంతో రాజకీయంగాను, సామాన్య ప్రజల్లోనూ చర్చనీయాంశమైంది.
కాగా చెన్నైనగరంలోని మాగుంట బాలాజీ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లోను, టీనగర్‌లోని కార్యాలయం, పూందమల్లిలోని ఫ్యాక్టరీల్లో ఐటీ దాడులు ముమ్మరంగా జరిగినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఈ ఐటీదాడుల్లో ఏ మేరకు కీలకమైన పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారో తెలియలేదు.
తెలుగుదేశంపార్టీలో జిల్లాలో కీలకపాత్రపోషిస్తున్న మాగుంట కార్యాలయాలు, ఫ్యాక్టరీల్లో దాడులు నిర్వహించటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి సుజనాచౌదరి, సిఎం రమేష్, జిల్లాకు చెందిన ఎమ్మెల్యే పోతుల రామారావు కార్యాలయాలపై ఐటిదాడులు జరిగాయి. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. సీబీఐ వ్యవహర శైలిని సైతం చంద్రబాబు తీవ్రస్థాయిలో ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. తాజాగా పారిశ్రామిక వేత్త, జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయాలపై దాడులు చేయటంపై తెలుగుతమ్ముళ్లల్లో ఆగ్రహావేశాలు వ్యక్తవౌతున్నాయి. తెలుగుతమ్ముళ్లపై కేంద్రప్రభుత్వం కక్షకట్టి ఐటీ, సీబీఐ దాడులు చేయస్తుందని ప్రచారం జోరుగా సాగుతుంది. మొత్తంమీద మాగుంట కార్యాలయాలపై ఐటీదాడులు జరగటంపై సర్వత్రా రాజకీయంగా చర్చనీయాంశమైంది
కాగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి మాగుంట శ్రీనివాసులరెడ్డి పోటీచేయనున్నారు. ఆమేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు విచ్చేసి మాగుంట అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేసి రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని పార్టీశ్రేణులను ఆదేశించటం జరిగింది. ఈనేపధ్యంలో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, దర్శి, కొండెపి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ముఖ్యనేతలతో చంద్రబాబు విడివిడిగా సమావేశమై అసమ్మతి నేతలతోమాట్లాడి మాగుంటను గెలిపించే బాధ్యత మీది అంటూ హితబోధ చేయటం జరిగింది. ఇటీవల తన అన్న దివంగత మాగుంట సుబ్బరామరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని సైతం ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి కార్యక్రమానికి తెలుగుతమ్ముళ్లతోపాటు, వివిధ రాజకీయపక్షాలకు చెందిన ముఖ్యనేతలు హాజరుకావటం జరిగింది. మాగుంట ట్రస్టు ద్వారా కోట్లాదిరూపాయలు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సౌకర్యాన్ని ప్రజలకు కల్పిస్తున్నారు. జిల్లాలోని పలుప్రదేశాల్లో విద్యాసంస్ధలను నెలకొల్పటం జరిగింది. అలాంటి మాగుంట కార్యాలయాలపై ఐటీదాడులు నిర్వహించటంపై అన్ని వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి.
జ్ఞానభేరిని విజయవంతం చేయాలి
- కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశం

ఒంగోలు,డిసెంబర్ 8: ఒంగోలులో ఈనెల 12వతేదీన నిర్వహించే జ్ఞానభేరి కార్యక్రమంలో వివిధ కాలేజిల నుండి వందశాతం విద్యార్థిని, విద్యార్థులు సమీకరణ చేసే విధంగా అధికారులు, కళాశాలల యాజమాన్యాలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ వి వినయ్‌చంద్ సూచించారు. శనివారం సాయంత్రం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో జ్ఞానభేరి కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా అధికారులు, వివిధ కాలేజిల యాజమాన్యాలతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వందశాతం విద్యార్థులను రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టి జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కలిగిన విద్యార్థులను మాత్రమే జ్ఞానభేరి కార్యక్రమానికి అనుమతిస్తామన్నారు. జిల్లాలోని 12నియోజకవర్గాలనుండి వివిధ కాలేజిల విద్యార్ధులు జ్ఞానభేరి కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా కాలేజిల యాజమాన్యాలదేనని తెలిపారు. కాలేజిలు పూర్తిస్ధాయిలో తమ వాహనాలను జ్ఞానభేరి కార్యక్రమానికి ఉపయోగించాలని సూచించారు. జ్ఞానభేరి కార్యక్రమానికి పాల్పడే విద్యార్ధులకు అవసరమైన చోట వాహన సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ప్రతి కాలేజినుండి హెచ్‌ఒడి ద్వారా విద్యార్థులతే కొత్త ఆలోచనలతో కూడిన ప్రాజెక్టులను, స్టాల్స్‌ను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమానికి హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8.45గంటల సమయానికి సభాస్ధలానికి తీసుకువచ్చేలా మేనేజ్‌మెంట్ ప్రణాళికలు సిద్దం చేసుకోవాలన్నారు. జ్ఞానభేరి కార్యక్రమం ఉదయం పదిగంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించి సాయంత్రం 5.30గంటల వరకు కొనసాగుతుందన్నారు. జ్ఞానభేరిక కార్యక్రమానికి సంబంధించి జిల్లా అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో నిర్వర్తించాల్సిఉందన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా భద్రతా ఏర్పాట్లు, పూర్తిస్ధాయి బందోబస్తు చూడాలన్నారు. నగరంలో సానిటేషన్‌పై ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ ఒంగోలు నగరపాలక సంస్ధ కమీషనర్‌ను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ వద్ద ఏలాంటి సమస్యలు లేకుండా చూడాలని కలెక్టర్ పోలీసు అధికారులకు సూచించారు. తొలుత జిల్లాకలెక్టర్, సంయుక్తకలెక్టర్‌లు సౌత్ బైపాస్‌రోడ్డులోని సిరి హాస్పటల్ పక్కన ఉన్న ఖాళీస్ధలంలో నిర్వహించనున్న జ్ఞాన భేరి కార్యక్రమం ఏర్పాట్లను పరిశీలించారు. ఈసమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

చీరాల వైకాపా అభ్యర్థిగా యడం బాలాజీ
- బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి స్పష్టం
- పార్టీ బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషిచేయాలి
- బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు మోపిదేవి స్పష్టం
చీరాల, డిసెంబర్ 8: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల శాసనసభకు వైఎస్సార్‌సిపి అభ్యర్థిగా యడం బాలాజీని బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. నియోజకవర్గ బాధ్యుడుగా యడం బాలాజీ గత నాలుగున్నర సంవత్సారాల కాలంనుంచి పార్టీ బలోపేతానికి చేసిన కృషిని గుర్తించి అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా బాలాజీని ప్రకటించిన వెంటనే నాయకులు, కార్యకర్తలు ఆయన్ని అభినందించారు. పార్టీనాయకులందరూ సమన్వయంతో పనిచేసి పార్టీబలోపేతానికి కృషిచేయాలని బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శనివారం వాడరేవు రోడ్డులోని బాలాజీ ఫంక్షన్ హాలులో వై ఎస్ ఆర్‌సీపీ నియోజకవర్గస్ధాయి కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటరమణ, బాపట్ల పార్లమెంటరీ పరిశీలకులు నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ చీరాల నియోజకవర్గ సమన్వయకర్త యడం బాలాజీ అధ్యక్షత వహించారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల స్ధితిగతులను తెలుసుకునేందుకు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్రను ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కొనసాగిస్తున్నారని గుర్తుచేశారు. పార్టీ అధిష్టానం ఆదేశాలమేరకు ఎవరిని అభ్యర్ధిగా నియమించినా ప్రతి ఒక్కరూ అభ్యర్థి విజయం కోసం కృషి చేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. గత ఎన్నికలలో కేవలం 4లక్షల 75వేల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోవలసి వచ్చిందని, ఈ సారి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచూసుకోవాలన్నారు. బూత్‌కమిటీ కన్వీనర్లు, సభ్యులు ఎటువంటి ప్రలోభాలకు లోనుకాకుండా అభ్యర్ధిని గెలిపించుకునేందుకు పనిచేయాలన్నారు. బూత్ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుని వాటిని నియోజకవర్గ ఇన్‌చార్జి దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీనాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పలు రకాల సమస్యలు వస్తున్నాయన్నారు. అదేవిధంగా గ్రామాల్లో పార్టీ బలోపేతానికి కృషిచేయాలన్నారు. రామ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ..బాపట్ల పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్ధానాలను గెలిపించాల్సిన బాధ్యత వై ఎస్ జగన్మోహన్‌రెడ్డి తనపై ఉంచారన్నారు. పార్టీ పరంగా ఉన్న సమస్యలు చాలా చిన్నవని,వాటిని పరిష్కంచేందుకు కృషిచేస్తానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ బాలాజీకి మద్దతుగా నిలవాలన్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి యడం బాలాజీ మాట్లాడుతూ.. గత నాలుగున్నర సంవత్సరాలుగా నియోజకవర్గంలోని తనను ఆదరిస్తూ అభిమానిస్తున్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అభినందనలు తెలిపారు. కార్యకర్తల, ప్రజల రుణం తీర్చుకునేందకు తనకు మరోసారి అవకాశం కల్పించారన్నారు. అయితే తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని, కొంతమంది కొత్తవాళ్ళు వాస్తున్నారని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాని కార్యకర్తల నమ్మకాన్ని మాత్రం కదల్చలేకపోయారన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అందరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వి అమృతపాణి మాట్లాడుతూ..పార్టీ ఆదేశాలననుసారం అందరూ పార్టీ విజయానికి కృషిచేయాలన్నారు. పార్టీలో వర్గబేధాలు లేవని అందరం కలిసి పార్టీ విజయానికి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వాడరేవుగ్రామానికి చెందిన 30 మంది వైసిపిలో చేరారు. వీరికి నాయకులు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపి చిమటా సాంబు, పట్టణ అధ్యక్షులు బొనిగల జైసన్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి అవ్వారు ముసలయ్య, నాయకులు బీరక సురేంద్ర, నీలం శామ్యూల్ మోజెస్, కర్నేటి వెంకటప్రసాద్, కొండ్రు బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడంతో
కక్షిదారులు ఇద్దరూ గెలిచినట్లే
- జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని
ఒంగోలు, డిసెంబర్ 8: రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా కక్షిదారులు ఇరువురు గెలుపొందినట్లుగానే భావింపపడతారని జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి యంజి ప్రియదర్శిని పేర్కొన్నారు. శనివారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం ద్వారా మానసికంగా ఎంతో ఆనందం పొందటం తోపాటు న్యాయస్థానాల్లో చెల్లించిన ఫీజు కూడా వాపస్ వస్తుందని న్యాయమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు జిల్లా న్యాయమూర్తి విశ్వనాధం, సీనియర్ సివిల్ న్యాయమూర్తులు బి సోభాకుమారి, శరత్‌బాబు, టి రాజా వెంకటాద్రి, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు వి పల్లవి, ఎం సుధా తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వంతో చర్చలు విఫలం
- వెలుగు ఉద్యోగల సమ్మె తీవ్రతరం -
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 8 : వెలుగు ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో గత నాలుగు రోజుల నుండి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం చర్చల పేరుతో సెర్ఫ్ సిఈవో జెఏసి నాయకులను అమరావతికి పిలిపించి సమ్మెను విరమింప చేస్తే డిమాండ్లను పరిశీలిస్తామని, వెంటనే సమ్మె విరమింప చేయాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని, ఉద్యమాన్ని తీత్రరం చేస్తామని జెఏసి నాయకులు ప్రకటించారు. గత 18 సంవత్సరాలుగా వెలుగు సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులర్ చేయాలనే డిమాండ్‌తో సమ్మె కొనసాగుతుంది. శనివారం జిల్లా కలెక్టరేట్ వద్ద రెండో రోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఎఐటియుసి జిల్లా నాయకులు మస్తాన్‌రావు, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ జిల్లా నాయకులు ఆర్ ఉదయ్ కుమార్ దీక్షలు ప్రారంభించి మాట్లాడారు. కాంట్రాక్టు పద్దతిన పనిచేస్తున్న వెలుగు సిబ్బందికి అన్నీ అర్హతలు ఉన్నాయని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళుతున్నారని, అలాంటి సిబ్బందికి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. కాంట్రాక్టు ఉద్యోగుల శ్రమను దోచుకుంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. చర్చలు విఫలం కావడంతో ఆదివారం కలెక్టరేట్ వద్ద భిక్షాటన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో ఉన్న ఉద్యోగులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జె ఏసి నాయకులు నరేంద్ర కుమార్, వెంకట్రావు, వెంకట స్వామి, శౌరీ , గోపి, లాజర్, డేవిడ్, సాల్మన్ తదితరులు పాల్గొన్నారు.