ప్రకాశం

నాడు పోతుల, నేడు మాగుంట, రేపు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 9: వరుస ఆదాయపన్ను శాఖాధికారుల దాడులతో జిల్లాలోని అన్నివర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి. నాడు కందుకూరు శాసససభ్యులు పోతుల రామారావు కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయగా తాజాగా తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. దీంతో రానున్న రోజుల్లో ఎవరిపై ఐటీ అధికారుల పంజా విసురుతారో అన్న చర్చ జిల్లావ్యాప్తంగా జోరుగా సాగుతుంది. ఇటీవల కాలంలో రాష్టవ్య్రాప్తంగా ప్రముఖంగా ఉన్న రాజకీయ నాయకుల కార్యాలయాలు, ఇళ్లపై ఐటీ శాఖాధికారులు దాడులు నిర్వహిస్తున్న నేపధ్యంలో జిల్లాలోని ప్రముఖ రాజకీయ నాయకులు, గ్రానైట్, ఆక్వారంగానికి చెందిన కొంతమంది పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
త్వరలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో రాజకీయానికి చెందిన ప్రముఖులపై ఐటీ అధికారులు పంజా విసురుతుండటంతో జిల్లాలోని మరికొంతమందిపైనా దాడులు జరుగుతాయా? అన్నచర్చ అన్నివర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
జిల్లావ్యాప్తంగా గ్రానైట్, ఆక్వారంగానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారిలో ఎవరిపై ఐటీ దాడులు జరుగుతాయో అన్న చర్చ జిల్లావ్యాప్తంగా సాగుతుంది.
అధికార,ప్రతిపక్ష పార్టీలకు చెందిన రాజకీయ ప్రముఖులకు బడాకంపెనీలు అన్నిరంగాల్లో ఉన్నాయి. దీంతో ఇప్పటినుండే కొంతమంది ఐటీ దాడులు జరిగినా ఎలాంటి రికార్డులు దొరకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రధానంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమపై దాడులు చేస్తుందని కొంతమంది రాజకీయ నాయకులు ఆరోపించటం జరుగుతోంది. కేవలం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు త్వరలో జరగనున్న నేపధ్యంలో ఈ ఐటీదాడులు జరుగుతుండటంపై అన్నివర్గాల్లో చర్చనీయాంశమైంది.
రాష్ట్రంలో రానున్న రోజుల్లో జరిగే అసెంబ్లీ,పార్లమెంటు ఎన్నికలు అన్నిపార్టీలకు కీలకం కానున్న నేపధ్యంలో ఆర్థికంగా బలోపేతమైన నాయకులకే ప్రధానరాజకీయపక్షాలు టిక్కెట్లు కేటాయించనున్నాయి. ఈనేపధ్యంలో ఆర్థికంగా బలమైన రాజకీయప్రముఖులు, ఆక్వా, గ్రానైట్ రంగాలకు చెందిన ప్రముఖుల కార్యాలయాలు, ఇళ్లపై దాడులు జరిగే అవకాశాలు లేకపోలేదన్న వాదన అన్నివర్గాలనుండి వినిపిస్తోంది. ఈపాటికే ఐటీశాఖాధికారుల వద్ద జిల్లాకు చెందిన కొంతమంది రాజకీయప్రముఖులు, గ్రానైట్, ఆక్వారంగాలకు చెందిన ప్రముఖుల జాబితా ఉన్నట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఆయావర్గాలకు చెందిన కొంతమంది ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. కాగా జిల్లాలో ఇప్పటివరకు తెలుగుదేశంపార్టీకి చెందిన కందుకూరు శాసనసభ్యులు పోతుల రామారావు, జిల్లా శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి కార్యాలయాలపై ఐటీ దాడులు జరగటం గమనార్హం. మొత్తంమీద ఐటీ అధికారులు దాడులతో ప్రధానంగా కొంతమంది రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయనే

జ్ఞానభేరి కార్యక్రమ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలి
* జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్

ఒంగోలు, డిసెంబర్ 9 : ఈ నెల 12వ తేదిన ఒంగోలులో నిర్వహిస్తున్న జ్ఞాన భేరి కార్యక్రమాల ఏర్పాట్ల ను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం స్థానిక సిరి హాస్పటల్ ప్రక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో నిర్వహించనున్న జ్ఞానభేరి కార్యక్రమ ఏర్పాట్ల ను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞానభేరికి సంబంధించిన బహిరంగ సభ, స్టాల్స్, భోజన వసతులు , విద్యార్థినీ విద్యార్థులకు రిజిస్ట్రేషన్ జరిగే పరిసర ప్రాంతాలు, వాహనాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటించే రహదారులలో ఏలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ముఖ్యమంత్రి హెలీప్యాడ్ నుండి సభాస్థలికి వచ్చే వరకు ట్రాఫిక్ కు ఏలాంటి అంతరాయం జరుగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని భద్రతా పరంగా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జ్ఞానభేరి జరిగే పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి పట్టణం నుండి తిరిగి వెళ్లేంత వరకు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబును కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీవో పెంచల కిశోర్,మున్సిపల్ కమీషనర్ వెంకట క్రిష్ణ, మార్కాపురం ఆర్డీవో రామకృష్ణారెడ్డి, హౌసింగ్ పిడి సాయినాధ్, ఒంగోలు , కొండేపి మండలాల తహశీల్థార్లు బ్రహ్మయ్య, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

అలరించిన ఎడ్లపందాలు
దర్శి,డిసెంబర్ 9: ఒంగోలు జాతి పశుపోషక ప్రొత్సాహక కమిటి ఆధ్వర్యంలో ఆదివారం దర్శి మండలం శివరాజ్‌నగర్‌లో జరిగిన జిల్లా స్ధాయి ఎడ్లపందాలు పశుజాతి అభిమానులను అలరించాయి. పళ్ళు ఉడని విభాగంలో మొత్తం 11జతలు పాల్గొనగా మొదటి బహుమతి కురిచేడుమండలం కాటంవారిపల్లె గ్రామానికి చెందిన పోతిరెడ్డి నాగిరెడ్డి ఎడ్లు 3900 అడుగులు లాగి ఏనిమిదివేల నగదు బహుమతిని గెలుచుకున్నాయి. దర్శి మండలం రాజంపల్లికి చెందిన రాగిపండి అంకిరెడ్డి ఎడ్లు 3143.6అడుగులు లాగి రెండవబహుమతి ఆరువేల రూపాయలను గెలుచుకున్నాయి. పొదిలి మండలం రామలవీడుకు చెందిన పొట్టేళ్ళ శ్రీను ఎడ్లు 3020.8అడుగులు లాగి మూడవబహుమతి నాలుగువేల రూపాయలను పొందారు. చీమకుర్తికిచెందిన జంగా విజయభాస్కరరెడ్డి ఎడ్లు మూడువేల అడుగులు లాగి మూడువేల వేల రూపాయల నాల్గవబహుమతిని గెల్చుకున్నారు. శింగంరెడ్డిపల్లెకు చెందిన పి వెంకటరామిరెడ్డి ఎడ్లు 2752 అడుగులు లాగి ఐదవబహుమతి రెండువేల రూపాయలు గెలుపొందారు. రెండుపళ్ళ విభాగంలో కాటం తిరుపతిరెడ్డి ఎడ్లు 3301.5 అడుగులు దూరం లాగి పది వేల రూపాయలు మొదటి బహుమతిని గెలుపొందగా దర్శి మండలానికి చెందిన గానుగపంట రాజశేఖర్‌రెడ్డి, ఏలూరి గణేష్ చౌదరి ఎడ్లు 3 వేల అడుగులు సమానంగా లాగి రెండు, మూడు బహుమతులు , 8 వేలు, 6 వేలు సమానంగా పంచుకున్నారు. నాల్గో బహుమతిని పర్చూరు మండలం యర్రం వారిపాలెం కు చెందిన వెంకటేశ్వరెడ్డి ఎడ్లు నాలుగు వేల రూపాయల బహుమతిని గెలుపొందాయి. ఐదవ బహుమతిని పొన్నలూరు కు చెందిన నవ్వా వెంకట రమణారెడ్డి ఎడ్లు గెలుపొంది రెండు వేలు బహుమతిని గెలుచుకున్నారు. ఈ ఎడ్ల పందెలు సోమ, మంగళవారాలు కూడా కొనసాగనున్నాయి. ఆరుపళ్ళ విభాగం, సీనియర్ విభాగాలు చూపరులను ఆకట్టుకోనున్నాయి.

వామపక్ష రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కృషి
* సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య
మార్కాపురం టౌన్, డిసెంబర్ 9 : ఏపీ ప్రజల అభివృద్ధికి సమస్యల పరిష్కారానికి వామపక్ష రాజకీయ ప్రత్యామ్నాయమే పరిష్కారమని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జాలా అంజయ్య అన్నారు. మార్కాపురం డివిజన్ సీపీఎం కార్యకర్తల కోసం మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీల విధానాలన్నీ ఒక్కటేనని, ధనవంతులకు కొమ్ముకాయడం తప్ప మరొకటి లేదని అన్నారు. ఇటీవల కాలంలో అధికారంలో ఉన్న పాలకవర్గం అక్రమాలకు పాల్పడుతూ అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను అందుకోవాల్సిన పేదలు సైతం రాజకీయ నేతలకు ఊడిగం చేస్తేకాని ఆ పథకం దక్కే పరిస్థితి లేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం పని చేయడం మాని, ఆర్భాటాలతో ఎన్నికల్లో గెలిచేందుకు ఉపశమనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందుకు నిబంధనలతో కూడిన పథకాల అమలే దర్పణం పడుతున్నాయని అన్నారు. స్థానిక సమస్యలు గుర్తించడంలో పాలకులు విఫలమయ్యారని అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని, పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పుతామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించడం లేదన్నారు. కరవుతో అల్లాడిపోతున్న మండలాలను గుర్తించినప్పటికీ కరవు సాయం అందించే విషయంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. మార్కాపురం ప్రాంతంలో నిర్మితమయ్యే పూలసుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ఎన్నికల అజెండా మార్చుకొని మోసపూరిత విధానాలను అవలంబిస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల కాలంలో వెలుగొండను పట్టించుకోని ముఖ్యమంత్రి ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓట్ల కోసం నాటకీయ పరిణామాలతో ప్రాజెక్టును సందర్శిస్తున్నారని అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం వామపక్ష ప్రత్యామ్నాయ పార్టీతోనే సాధ్యం అవుతుందని అన్నారు. ఈ శిక్షణ తరగతులకు సీపీఎం పట్టణ నాయకులు డీకేఎం రఫీ అధ్యక్షత వహించగా ప్రాంతీయ కార్యదర్శి సోమయ్య, జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు పి రూబెన్, కళావతి, జవ్వాజి రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం పతాకాన్ని సీనియర్ పార్టీ నాయకులు కాశమ్మ ఆవిష్కరించారు.

రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు
సంతనూతలపాడు, డిసెంబర్ 9 : మండలంలోని పేర్నమిట్ట జడ్పి హై స్కూల్ లో ఆదివారం రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు కరాటే , బ్రూస్లీ కరాటే, మార్షల్ ఆర్ట్స్ , ఖుంఫూ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఐదవ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా తోటా శేషయ్య, హై స్కూల్ హెచ్‌యం ప్రమోదలు పాల్గొన్నారు. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి 300 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో చీమకుర్తికి చెందిన తధాగత్ బోధీ ధర్మ మార్షల్ ఆర్ట్స్ విద్యార్థులు బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. బంగారు పతకాలు సాధించిన వారిలో ఎ జితేంద్ర, ఎం పవన్, కె శ్రీకాంత్, పి మణికంట, కె లక్ష్మణ, సిహెచ్ ఖాదీరేష్, బాలాజీరాజు, ఎం సాయి, వి సాయి శరణ్, ఆర్ గిరీష్, టి గౌతమ్, సిహెచ్ నీరజ్ , సీజె వైష్ణవి, అమూల్య, ఎస్ స్నేహలత, ఎ తులసీ లు బంగారు పతకాలు సాధించారు. వీరిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ పోటీలను సీనియర్ కరాటే మాస్టర్ డి వెంకటేష్, చంద్రశేఖర్ తదితరులు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బియస్ కుమార్, వియన్‌వి సుధాకర్ , రాంబాబు, రత్నం తదితరులు పాల్గొన్నారు.