ప్రకాశం

జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 11 : జిల్లా కేంద్రమైన ఒంగోలులో బుధవారం జరిగే జ్ఞానభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీవో కాన్ఫరెన్స్ హాలులో జ్ఞానభేరి కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఆర్థికలోటు ఉన్నప్పటికీ బడ్జెట్‌లో 25 వేల కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. భారతదేశంలో విద్యారంగం ఆంధ్రప్రదేశ్ 17వ స్థానంలో ఉన్నదాన్ని ముఖ్యమంత్రి మూడోస్థానంలోకి తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించామన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం, డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వలసలు వెళ్లేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక లక్షా 71 వేల 842 మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారన్నారు. రాష్టస్థ్రాయిలో పదో తరగతి ఫలితాల్లో షథ్రమ స్థానం వచ్చిందన్నారు. జిల్లాలో యూనివర్సీటీ ఒక్కటీ కూడా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గుర్తించి ప్రకాశం జిల్లాను విద్యారంగంలో అభివృద్ధి చేయాలని బుధవారం యూనివర్సీటీకి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు జ్ఞానభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో జ్ఞానభేరి కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం 130 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు చేపట్టే పరిశోధనలకు ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. రాష్టస్థ్రాయిలో ప్రకాశం జిల్లాలో జరిగే జ్ఞానభేరి కార్యక్రమంలో పాల్గొనేందుకు అత్యధికంగా 34 వేల 178 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలిపారు. ఒంగోలులో జరిగే జ్ఞానభేరి కార్యక్రమంలో విద్యార్థులకు అవసరమైన 45 అంశాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఇన్నోవేషన్ ఐడియాలను నేర్పించేందుకు ఈ అండ్ వై రీసెర్స్ కంపెనీతో విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ సమావేశంలో శాసనమండలిసభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాం, ఒంగోలు, కొండేపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డి స్వామి, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి దమయంతి, నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ప్రసాద్, కలెక్టర్ వి వినయ్‌చంద్, జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మీ, జిల్లా విద్యాశాఖాధికారి సుబ్బారావుతో పాటు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం పట్ల హర్షం
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 11 : మంగళవారం దేశంలోని ఐదు రాష్ట్రాలకు కౌంటింగ్ జరిగితే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారాన్ని చేపడుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈధా సుధాకర్‌రెడ్డి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకొని ఎఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవడానికి దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారనేందుకు ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. దేశంలోని పెద్ద రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీపై దేశ ప్రజలకు ఉన్న అభిమానం, నమ్మకానికి ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. ఒక్క రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి రాకపోవడం రానున్న 2019 ఎన్నికలకు నాంది పలుకుతుందన్నారు. నాలుగున్నర సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వంలోని దేశ ప్రధాని మోదీ పరిపాలనకు, నియంతృత్వ పోకడలకు ఈ ఎన్నికలు నిదర్శనమన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ, ప్రజలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు.
కొత్తపట్నం మండలం అధ్యక్షునిగా ఎల్లారెడ్డి
కొత్తపట్నం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా బద్దేలు ఎల్లారెడ్డిని నియమిస్తూ నియామకపత్రాన్ని అందించి ఈదా శుభాకాంక్షలు తెలిపారు. కొత్తపట్నం మండలంలో పార్టీని బలోపేతం చేసి రానున్న 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మండలంలో మిగిలిన పార్టీలకు ధీటుగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిని నియమించడం పట్ల పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసీసీ కార్యదర్శులు వేమా శ్రీనివాసరావు, యాదాల రాజశేఖర్, గాదె లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి డి ఆదినారాయణ రెడ్డి , అసంఘటిత కార్మిక కాంగ్రెస్ చైర్మన్ పి వెంకటేశ్వర్లు, లీగల్ సెల్ చైర్మన్ ఎస్ రవి, రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ యు మల్లికార్జున్, రూరుల్ మండల అధ్యక్షులు టి బుజ్జి, నాయకులు వెంకటేశ్వర్లు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
* అధికారులను ఆదేశించిన మంత్రి గంటా
జరుగుమల్లి, డిసెంబర్ 11: ప్రతి సంవత్సరం ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం స్వగ్రామమైన కామేపల్లిలో వచ్చే ఏడాది 2019 జనవరి నెలలో జరిగే సంక్రాంతి సంబరాలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మంత్రి గంటా కామేపల్లికి చేరుకున్నారు. తొలుత ఒక ప్రైవేటు పాఠశాల వద్ద ఉన్న స్థలాలు, పెట్రోలు బంకు వద్ద స్థలాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణను పరిశీలించి ఎక్కడపెడితే ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమం విజయవంతం అవుతుందో అధికారులే నిర్ణయించాలని ఆయన ఆదేశించారు. మంత్రి స్వగ్రామం ఇంటికి చేరుకునేసరికి అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత మంత్రికి దిష్టితీసి బొట్టుపెట్టి హారతులు ఇచ్చి ఇంటిలోకి స్వాగతం పలికారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి అధికారులు మంత్రి గంటా శ్రీనివాసులుకు పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. తొలుత పోలరమ్మ ఆలయ అభివృద్ధి పనులపై కమిటీ నిర్వహకులను పిలిపించి వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొండెపి నియోజకవర్గ అభివృద్ధి, సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామిని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని మంత్రి గంటా ఆలయ కార్యనిర్వాహకులకు భరోసా ఇచ్చారు. గ్రామంలో ఉన్న సమస్యలను మాజీ సర్పంచ్ ఏలూరు రాంబాబును అడిగి తెలుసుకున్నారు. సాయిబాబా 2019 క్యాలెండర్‌ను మంత్రి గంటా శ్రీనివాసులు, ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య, సినీనటుడు అశోక్‌కుమార్, నాయకులచే క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. వీరితోపాటు కందకూరు ఆర్డీవో రామారావు, డీఈవో సుబ్బారావు, ఎంపీడీవో విజయలక్ష్మి, తహశీల్దార్ ఉషా, ఆర్‌ఐ విజయభాస్కర్, పిఆర్‌జేఇ జి హనుమంతరావు, ఏపీవో బుల్లయ్య, టీడీపీ నాయకులు ఎన్ సోమయ్య, ఆరికట్ల రమణయ్య, సిహెచ్ బ్రహ్మేంద్రం తదితరులు పాల్గొన్నారు. అనంతరం నర్శింగోలు గ్రామంలో వెలిసి ఉన్న రామలింగరూప శనీశ్వరాలయానికి మంత్రి గంటా శ్రీనివాసులు, కొండెపి ఎమ్మెల్యే డాక్టర్ స్వామి , కొండెపి నియోజకవర్గ యువనాయకుడు దామచర్ల సత్య, సినీనటుడు అశోక్‌కుమార్ ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు జి చంద్రభాస్కర్‌శాస్ర్తీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ నిర్వహించారు.