ప్రకాశం

స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, డిసెంబర్ 12: జ్ఞానభేరి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రూపొందించిన స్టాళ్లు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. బుధవారం దక్షిణ బైపాస్ సిరి హాస్పటల్ పక్కన ఉన్న స్ధలంలో జరిగిన జ్ఞానభేరి బహిరంగ సభ సందర్బంగా వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన స్టాళ్లను ఏర్పాటుచేసారు. ఈ స్టాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. బహిరంగసభలో విద్యార్థినీ మేడికొండ మణిచందన మాట్లాడుతూ నూతన ఆవిష్కరణలతో స్టోన్‌ఫోర్డ్‌లో స్కాలర్‌షిప్ సాధించానన్నారు. నవీన్ అనే విద్యార్థి పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు ధరించే హెల్మెట్‌కు ఎయిర్ కండిషన్ సదుపాయం కల్పించే విధానం, ఉపయోగం గురించి ముఖ్యమంత్రికి వివరించారు. వారి ఆలోచనలను ముఖ్యమంత్రి మెచ్చుకుని అభినందించారు. కార్యక్రమంలో వక్తృత్వ పోటీల్లో గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులను ముఖ్యమంత్రి జ్ఞాపికలు, సర్ట్ఫికెట్లతో సత్కరించారు. అనంతరం జిల్లా గీతం ఆడియో, వీడియో ద్వారా వినిపించారు. విద్యార్థినులు చేసిన కూచిపూడి నృత్యం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను, విద్యార్థినీ, విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.