ప్రకాశం

సీఎం పర్యటన విజయవంతంతో ఊపరిపీల్చుకున్న పోలీసు యంత్రాంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 12: ఒంగోలులో బుధవారం జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ముగియటంతో జిల్లా పోలీసు యంత్రాంగం ఊపరిపీల్చుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు గుంటూరు రేంజ్ ఐజీ గోపాలరావు ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ బీ.సత్యఏసుబాబు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి పర్యటనకు సుమారు 1500మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఒంగోలు నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకున్నారు. జ్ఞానభేరి సభ కార్యక్రమం వద్దకు విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేలా పోలీసులు చర్యలు చేపట్టారు. అయితే నెల్లూరు నుంచి ఒంగోలు వైపునకు వచ్చే ఆర్టీసీ బస్సులు ఒంగోలు సమీపంలోని పెళ్లూరు నుంచి తూర్పు బైపాస్ రోడ్డు మీదుగా కిమ్స్ హాస్పిటల్ నుంచి తిరిగి మంగమ్మకాలేజి మీదుగా ఒంగోలు ఆర్టీసి బస్టాండ్‌కు చేరుకునేలా పోలీసులు మళ్లించడంతో ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ మళ్లింపుతో నెల్లూరు బస్టాండ్ వైపు, కలెక్టరేట్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుంచి వారు మళ్లీ కలెక్టరేట్, నెల్లూరు బస్టాండ్ వైపునకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. చంద్రబాబు ఒంగోలుకు రావడం ఆలస్యం కావటంతోప్రయాణికులు ఆటోలను ఆశ్రయించవలసి రావటంతో ఆటోలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదిలా ఉండగా జ్ఞానభేరి సభాప్రాంగణం సమీపంలోని బైపాస్ రోడ్డులో అడ్డంగా ఉంచిన ద్విచక్రవాహనాలను పోలీసు వాహనాలలో పోలీసులు పార్కింగ్ స్థలం వద్దకు తరలించడంతో జ్ఞానభేరి కార్యక్రమం ముగిసిన తరువాత బయటకు వచ్చిన విద్యార్థులు తాము మొదట పెట్టిన చోట తమ వాహనాలు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. చివరకు తమ ద్విచక్రవాహనాలను పోలీసులు పార్కింగ్ స్థలానికి తరలించారనే విషయాన్ని తెలుసుకుని విద్యార్థులు, యువకులు ఊపిరి పీల్చుకున్నారు.