ప్రకాశం

‘మీసేవా కేంద్రాల ఆపరేటర్లకు గౌరవ వేతనం ఇవ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జనవరి 17: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తూ సత్వర సేవలు అందిస్తున్న తమ సమస్యలు పరిష్కరించే వరకు సేవలు అందించేది లేదని మీసేవా కేంద్రాల నిర్వాహకులు హెచ్చరించారు. పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీలు, ఇంటర్నెట్ ఛార్జీలతో అల్లాడుతున్నామని, నెలవారీ అద్దెలు చెల్లించలేక అవస్థలకు గురవుతున్నామని వాపోయారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహశీల్దార్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మీసేవా కేంద్రాల నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి పథకానికి ముఖ్యమైన ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు ఏర్పాటు చేసిన మీసేవా కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. 36 ప్రభుత్వ శాఖల ద్వారా అందించే 340 సేవలను తాత్కాలిక సర్వీస్ ఛార్జీతో అందిస్తున్నప్పటికీ తమకు కనీస గౌరవ వేతనం అందించకపోవడం దారుణమన్నారు. పెరుగుతున్న మెయింట్‌నెన్స్, అద్దె, కరెంట్, ఇంటర్నెట్ బిల్లులు చెల్లించలేక జిరాక్స్ తీస్తూ అప్పులతో కాలం వెళ్లదీస్తున్నామన్నారు. వీటితోపాటు మీసేవా కేంద్రాలను మనసేవ-గిరిజన సేవ పేరుతో మళ్లీ సేవలు పెంచి తమను దెబ్బతీస్తున్నారన్నారు. అంతేగాక మీసేవా కేంద్రాల నుంచి నామమాత్రంగా కమీషన్లు పెంచి జీఎస్టీ, టీడీఎస్‌లను పెంచడం దారుణమన్నారు. తమకు ఏపీ ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, స్టేషనరీ ఉచితంగా అందించాలని, విద్యుత్ కేటగిరీ మార్చాలని, సమస్యలను పరిష్కరించి గౌరవ వేతనం అందించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే కేంద్రాలను తెరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల పట్టణం, రూరల్ ప్రాంతాల్లో ఉన్న మీసేవా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

కొత్తపట్నంలో రాష్టస్థ్రాయి ఎడ్లపందాలు, బండలాగుడు పోటీలు
కొత్తపట్నం, జనవరి 17 : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్టస్థ్రాయి ఎడ్లపందాల బండలాగుడు పోటీలు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి ప్రారంభించారు. గురువారం కొత్తపట్నంలోని రెడ్డిపాలెం శివాలయం బజారులో వైకాపా మండల నాయకులు ఈ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రణీత్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పండగ వాతావరణం ఉండాలంటే ఇలాంటి పోటీలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి సుమారు 15 ఎడ్ల జతలు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కుప్పం ప్రసాద్, మండల నాయకులు లంకపోతు అంజిరెడ్డి, ఎంపీపీ లంకపోతు లక్ష్మి, మండల నాయకులు దాసూరి గోపాల్‌రెడ్డి, తంబి కాంతారావు, గౌరవరపు శివాజి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతి పండగకు రాజకీయ రంగు

ఒంగోలు, జనవరి 17 : హిందువులకు పరమ పవిత్రమైన సంక్రాంతి పండగకు ఈ సంవత్సరం రాజకీయరంగు పులుముకుంది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎన్నికల సీజన్ కావడంతో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన నాయకులు సంక్రాంతి పండగను జిల్లాలోని అన్ని గ్రామాల్లో నిర్వహించారు. ప్రధానంగా సంక్రాంతి పండగ సందర్భంగా ఆయా గ్రామాల్లో నిర్వాహకులు వివిధ పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేసేవారు. కాని ఈ సంవత్సరం అందుకు భిన్నంగా ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన నాయకులు సంక్రాంతి పండగ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్, ఎడ్లపందేలు, క్రికెట్ పోటీలతోపాటు పలు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల సందర్భంగా భారీ ఎత్తున తమ అభిమాన నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గతంలో మండల, గ్రామస్థాయి నాయకుల నగదుతో ఫ్లెక్సీలు కాని, బహుమతులు అందచేసేవారు. కాని మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, పోటీలో ఉండే అశావహులే భారీ మొత్తంలో సంక్రాంతి పండగ సందర్భంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామాల్లోను ఫ్లెక్సీల సంస్కృతికి తెరలేపారు.
జిల్లా కేంద్రమైన ఒంగోలులో నిర్వహించిన పారువేట ఉత్సవాల సందర్భంగా పోటాపోటీగా నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిల ఫ్లెక్సీలు ఒంగోలు నగరంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వెలిశాయి. అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డిల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని రానున్న ఎన్నికల్లో చంద్రబాబును, జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి మండల, గ్రామాల్లో జరిగిన ఉత్సవాలను రాజకీయ వేదికలుగానే నేతలు ఉపయోగించుకోవటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రధానంగా యువతను ఆకర్షించేవిధంగా నేతలు ప్రసంగాలు చేయటంతోపాటు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని వర్గాలను ఆదుకుంటామని ప్రకటించడం విశేషం. మొత్తంమీద సంక్రాంతి పండగకు ఈసారి రాజకీయ రంగు పులుముకుందనే చెప్పవచ్చు.