ప్రకాశం

నెరవేరిన కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మే 24:శింగరాయకొండ మండలంలోని ఊళ్ళపాలెం, బింగినపల్లె, పెద్దపాలెం గ్రామాల కల ఎట్టకేలకు నేరవేరింది. మండలంలోని ఊళ్ళపాలెం పాత రైల్వేబ్రిడ్జి స్థానంలో నూతన బ్రిడ్జిని నిర్మించేందుకు నాలుగుకోట్ల 60లక్షల రూపాయలను కేంద్ర రైల్వేశాఖమంత్రి సురేష్‌ప్రభు మంజూరు చేశారు. ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి దృష్టికి శింగరాయకొండ మండలానికి చెందిన ఆయాగ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గతంలో అనేకసార్లు తీసుకువచ్చారు. దీంతో వారి సమస్యలను విన్న ఎంపి సుబ్బారెడ్డి కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎంపి సుబ్బారెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఊళ్ళపాలెం వద్ద ఉన్న పాత రైల్వేబ్రిడ్జి వలన ఆయాగ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా పాత బ్రిడ్జిపై కేవలం పరిమితికి మించిన వాహనాలనే నడుపుతున్నారు. దీంతో ఊళ్ళపాలెం,బింగినపల్లి, పెద్దపాలెం గ్రామాల్లో ఉత్పత్తి అవుతున్న ఉప్పు ఎగుమతులకు భారీగా అడ్డంకిగా మారుతుంది. కేవలం పాతబ్రిడ్జి నిర్మాణంలో కొత్తబ్రిడ్జినిర్మాణం వలన మూడుకిలోమీటర్ల దూరం తగ్గనుంది. ఉప్పుతోపాటు, మిగిలిన వరిధాన్యం ట్రాక్టర్లు,లారీలకు కూడా నూతనంగా నిర్మించే బ్రిడ్జి ఎంతోగానో ఉపయోగపడనుంది. మొత్తంమీద బ్రిడ్జినిర్మాణం వలన శింగరాయకొండ మండలంలోని నాలుగుగ్రామాల ప్రజలకే కాకుండా ఇతర గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంది. మొత్తంమీద ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడి కృషితో నిధులు విడుదలకావటంతో ఆయాగ్రామాల ప్రజల కలనెరవేరినట్లైంది. ఇటీవల కాలంలో శింగరాయకొండలో శబరి ఎక్స్‌ప్రెస్ నిలుపుదల చేయించటంలోను సుబ్బారెడ్డి కీలకపాత్రపోషించి నిలుపుదల చేయించారు. దీంతో శింగరాయకొండ మండలానికి చెందిన ప్రజలు ఎంపి సుబ్బారెడ్డికి భారీ ఎత్తున సన్మానం కూడా చేశారు. అదేవిధంగా ఇటీవలకాలంలో ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఎస్క్‌లేటర్‌ను ఏర్పాటుచేయించారు. దీంతో ఈ ఎస్క్‌లేటర్ ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మొత్తంమీద ఊళ్ళపాలెం పాతబ్రిడ్జి స్థానంలో కొత్తబ్రిడ్జి నిర్మాణానికి 4.60కోట్లరూపాయలు మంజూరుకావటం పట్ల ఆప్రాంత ప్రజలు ఎంపి సుబ్బారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.