ప్రకాశం

పునాదిరాళ్లే టీడీపీకి సమాధి రాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలేటివారిపాలెం, జనవరి 17: గడచిన నాలుగు సంవత్సరాల 9 నెలల కాలంలో అభివృద్ధి పనులు చేపట్టకుండా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వేస్తున్న పునాది రాళ్లు తెలుగుదేశం పార్టీకి సమాధి రాళ్లు అవుతాయని మాజీ మంత్రి, కందుకూరు నియోజకవర్గ సమన్వయకర్త మానుగుంట మహీధర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని రామలింగాపురం గ్రామంలో జరిగిన సమావేశంలో మహీధర్‌రెడ్డి సమక్షంలో గ్రామానికి చెందిన పలు కుటుంబాలు టీడీపీని వీడి వైకాపా తీర్థం పుచ్చుకోగా, వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు ఒక గ్రామంతో ఆగిపోకుండా చుట్టుపక్కల గ్రామాలను కలిపేలా ఉండాలని, మండలంలో నేను వేసిన పోలినేని చెరువు రోడ్డు లాగా ఉంటే అనేక గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తన స్వగ్రామమైన మాచవరం రోడ్డును అభివృద్ధి చేస్తే చుట్టూ ఉన్న 45 గ్రామాలకు రాకపోకలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడిప్పుడే ఈగ్రామంలో అభివృద్ధిపై అవగాహన పెరుగుతోందని అన్నారు. రాబోయే రోజులు గడ్డు పరిస్థితులు అని చంద్రబాబు భావించి జగన్ నవరత్నాలలో ఒకటైన అయిన పింఛన్ పథకం రూ. 2వేలు, రైతుల ట్రాక్టర్లకు టాక్స్ రద్దు చేశారని, ఇంకా జగన్ పథకాలలో ఎన్నింటిని కాపీ కొడతారని ఎద్దేవా చేశారు. జగన్ సారధ్యంలో పార్టీలకతీతంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 45 సంవత్సరాలకే రెండువేల రూపాయల పింఛను అందజేస్తామని అన్నారు. గతంలో అనేక పార్టీలు రామాయపట్నం పోర్టు కోసం పాదయాత్రలు, ఉద్యమాలు, ధర్నాలు చేస్తే పట్టించుకోకుండా కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కందుకూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేయడానికి ఎకరం పొలంలో పునాదిరాయి వేస్తారా అని, ఆ ఎకరం పొలంలో 10 మంది పేదలకు ఇళ్లు కట్టించవచ్చు గదా అని పేదలు అడుగుతున్నారని అన్నారు. చంద్రబాబును మొన్న తెలంగాణలో కూడా నమ్మలేదని , రేపు ఆంధ్రాలో కూడా నమ్మరని ఆయన అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ, 108 సేవలు, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పెట్టి విదేశాలలో ఉద్యోగాలు చేసే స్థాయికి పెంచారని అన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌కు ప్రజలందరూ మద్దతు పలికి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తోకల కొండయ్య, మాల్యాద్రి, బచ్చు శ్రీను, గుమ్మళ్ల రమేష్, దామా ప్రవీణ్, వడ్లమూడి రామయ్య, బ్రహ్మారెడ్డి, పొడపాటి నరసింహం, అనుమోలు రాములు, చెరుకూరి వంశీ, గుత్తా గోపి, పరిటాల వీరాస్వామి, మద్దెల కృష్ణ, వడ్లమూడి శ్రీను కాపులూరి మురార్జీ తదితరులు పాల్గొన్నారు.