ప్రకాశం

సమన్వయంతో పనిచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 17 : జిల్లాలో ప్రజలు తాగునీటి అవసరాల కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి ఆదేశించారు. గురువారం సాయంత్రం స్థానిక జేసీ ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తాగునీటి కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ఏబీసీ కెనాల్ ద్వారా పంపే తాగునీరు దోపిడికి గురికాకుండా చూడాలని ప్రత్యేక అధికారులకు సూచించారు. రామతీర్ధం రిజర్వాయర్ ద్వారా కూడా సమ్మర్‌స్టోరేజి ట్యాంకులను నింపాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సమ్మర్ స్టోరేజి ట్యాంకులు శుక్రవారం నుంచి పూర్తిగా నింపాలని, రానున్నది వేసవి కాలం కనుక తాగునీటి బొట్టును కూడా వృధా కాకుండా చూడాలని ఆమె కోరారు.
ముఖ్యంగా అధికారులకు అప్పగించిన బాధ్యతలు దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక అధికార్లకు పని ఒత్తిడిని బట్టి అవసరమైతే క్రిందిస్థాయి సిబ్బందిని, పంచాయతీ కార్యదర్శులను విధులకు ఉపయోగించుకోవాలన్నారు. ఎదిఏమైనా తాగునీరు లేదని గ్రామాలు, పట్టణాల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకూడదని అధికారులను ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్‌ఎస్‌పి సీఈ గోపాల్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ కె రవి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి, కందుకూరు, మార్కాపురం ఆర్డీవోలు కెఎస్ రామారావు, జి రామకృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ జేడీ పీవీ శ్రీరామమూర్తి, ప్రత్యేకాధికారులు కొండయ్య, భాస్కరనాయుడు, ప్రభాకరరావు, ఫారెస్ట్ సెటిల్‌మెంట్ అధికారి కె కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.