ప్రకాశం

కందుల పాదయాత్రకు మంచి స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, జనవరి 21: చంద్రన్న మాటే కందుల బాట నినాదంతో నియోజకవర్గ ఇన్‌చార్జి కందుల నారాయణరెడ్డి సోమవారం చేపట్టిన నియోజకవర్గ పాదయాత్రకు మంచి స్పందన లభించింది. శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆయన పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పాదయాత్రను ప్రారంభించారు. ఈసందర్భంగా కరణం బలరాం మాట్లాడుతూ క్రమశిక్షణ గల నాయకుడు కందుల నారాయణరెడ్డి అని, ఎమ్మెల్యేగా అధికారంలో లేకపోయినప్పటికీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులను తెచ్చి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉండి పదవి లేకపోయినప్పటికీ పెద్దల ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. అభివృద్ధి చేశాం, ఆదరించండి అంటూ ప్రారంభించిన నియోజకవర్గ పాదయాత్ర మార్కాపురం, తర్లుపాడు, కొనకనమిట్ల, పొదిలి నియోజకవర్గాల్లో 360 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర ద్వారా చంద్రన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, నవ్యాంధ్ర స్థాపన కోసం ఆయన చేసిన కృషి, కేంద్రప్రభుత్వం నమ్మించి మోసం చేసిన తీరు, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం ఏ కారణంగా జాప్యం అయిందన్న కారణాలను ప్రజలకు తెలియచేసి రానున్న ఎన్నికల్లో మరోమారు టీడీపీ విజయం సాధించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి పట్టణ పార్టీ అధ్యక్షులు తాళ్ళపల్లి సత్యనారాయణ, ఆదాం సాహెబ్, టిడిపి జిల్లా అధికారప్రతినిధి శాసనాల వీరబ్రహ్మం, శ్రీలక్ష్మిచెన్నకేశవస్వామి ట్రస్టుబోర్డు చైర్మన్ యక్కలి కాశీవిశ్వనాథం, ఎఎంసి చైర్మన్ కాకర్ల శ్రీను, మైనార్టీ నాయకులు బాదుల్లా, గఫూర్, అమిరుల్లాఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్లు షెక్షావలి, జక్కా ప్రకాశ్, కందుల రామిరెడ్డితో పాటు కందుల కుటుంబసభ్యులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈసందర్భంగా నాయుడువీధిలోగల ఎన్టీఆర్ విగ్రహానికి కందుల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.