ప్రకాశం

జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల బదిలీల పర్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 7 : జిల్లాలో ఎన్నికల బదిలీల పర్వం ప్రారంభమైంది. అందులో భాగంగానే జిల్లాలోని 56 మంది తహశీల్దార్లు, వివిధ క్యాటగిరీలకు చెందిన 16 మంది అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో పని చేస్తున్న 72 మందిని గుంటూరు, నెల్లూరు జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల విధులు నిర్వహించిన తరువాత వారు ఆయా జిల్లాలకు తిరిగి బదిలీ కానున్నారు. ఒంగోలు కలెక్టరేట్‌లో పని చేస్తున్న ఎస్‌కె అమీర్‌బాషాను గుంటూరుకు , రాచర్ల తహశీల్దార్ కె ఏలిజిబెత్ రాణిని గుంటూరుకు, ఒంగోలు ల్యాండ్ రీఫామ్స్ తహశీల్దార్ గా పని చేస్తున్న ఇందిరను, ముండ్లమూరు తహశీల్దార్‌గా పని చేస్తున్న గంగాధర్ రావును, మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న జిఎస్‌ఎం ప్రసాద్‌ను, కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో కె ఆర్‌సీసీ తహశీల్దార్ గా పని చేస్తున్న జి సరస్వతీ దేవిని, వెలిగొండ తహశీల్దార్ కె చంద్రవతిని , మార్కాపురం తహశీల్దార్ పి ఉమారాణి ని , కొత్తపట్నం తహశీల్దార్ ఎంవి రమణారావును , కొనకనమిట్ల తహశీల్దార్ రాజ్యలక్ష్మీని, మద్దిపాడు తహశీల్దార్ ఉషారాణి లను గుంటూరు జిల్లా కు బదిలీ చేశారు. అదే విధంగా బేస్తవారిపేట తహశీల్దార్ ఎన్ వెంకటేశ్వర్లును నెల్లూరు జిల్లాకు , హనుమంతునిపాడు తహశీల్దార్ సిహెచ్ నాగభూషణంను , వలేటివారి పాలెం తహశీల్దార్ ఎస్‌వి సుబ్బారావు, పొదిలి తహశీల్దార్ పి విద్యా సాగరుడు, మార్కాపురం ఆర్డీవో కార్యాలయంలో కె ఆర్‌సీసీ తహశీల్దార్ కెవి ఆర్‌వి ప్రసాద్‌రావును, పెద్దారవీడు తహశీల్దార్ దిలీప్‌కుమార్‌ను, యద్దనపూడి తహశీల్దార్ పి మరియమ్మను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. డ్వామా ఎపిడి పద్మావతిని , సింగరాయకొండ తహశీల్దార్ ఎస్‌విఎస్ కామేశ్వరరావు, పొన్నలూరు తహశీల్దార్ హస్సేన్ ను, పుల్లల చెరువు తహశీల్దార్ జి విజయలక్ష్మీ ని, కొండేపి తహశీల్దార్ కె చిరంజీవిని, చీమకుర్తి తహశీల్దార్ యు అశోక్ వర్థన్, టంగుటూరు తహశీల్దార్ ఎం రాజ్ కుమార్ ను, వేటపాలెం తహశీల్దార్ కెయల్ మహేశ్వరరావు , ఉలవపాడు తహశీల్దార్ ఐ పద్మావతి లను నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. కందుకూరు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న
బిసి హెచ్ శివ కుమార్ ను గుంటూరుకు, పర్చూరు తహశీల్దార్ బి శ్రీనివాసరావును, త్రిపురాంతకం తహశీల్దార్ జి జయపాల్‌ను, కంభం తహశీల్దార్ ఎస్ సువర్ణరావును, మర్రిపూడి తహశీల్దార్ ఎం జ్వాలా నరసింహం, ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో పని చేస్తున్న కెయస్ ఆర్ కృష్ణారావును గుంటూరు జిల్లా కు బదిలీ చేశారు. అదే విధంగా సంతనూతలపాడు తహశీల్దార్ పి మధు సూదన్‌రావును, ఇంకొల్లు తహశీల్దార్ సిహెచ్ లక్ష్మీ కుమారి లను నెల్లూరుజిల్లాకు బదిలీ చేశారు. అద్దంకి తహశీల్దార్ బి బ్రహ్మయ్యను గుంటూరుకు , తాళ్లూరు తహశీల్దార్ ఎస్ సుబ్బారావును గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. కారంచేడు తహశీల్దార్ సిహెచ్ రమేష్‌ను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు బదిలీ చేశారు. నాగులుప్పలపాడు తహశీల్దార్ కె రాఘవయ్యను గుంటూరుకు, అర్థవీడు తహశీల్దార్ వివి నాగజ్యోతిని, దర్శి తహశీల్దార్ విజయ కుమార్, కురిచేడు తహశీల్దార్ ఎ శ్రీనివాసరావును, జరుగుమల్లి తహశీల్దార్ సిహెచ్ ఉష, పంగులూరు తహశీల్దార్ పి పార్వతిని , గుడ్లూరు తహశీల్దార్ డి సీతా రామయ్య ను, సియస్‌పురం తహశీల్దార్ వి పుల్లారావును గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. జిల్లాలోని శ్రీ శిల్ప ను నెల్లూరు జిల్లా కు బదిలీ చేశారు. మొత్తం మీద వీరి సారధ్యంలో మండలాల్లో ఎన్నికల నిర్వహణ జరగనుంది.