ప్రకాశం

టీడీపీ గూటికి యడం బాలాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 18: జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఏ పార్టీ గూటికి చేరతారోనన్న ఉత్కంఠ పరిస్థితులు ప్రధాన రాజకీయపక్షాలను వెంటాడుతున్నాయి. ప్రధానంగా చీరాల శాసనసభ్యులు ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశంపార్టీ నుండి వైసీపీ గూటికి చేరటంతో అలక వహించిన ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి యడం బాలాజీ తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఆ మేరకు సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో యడం బాలాజీతోపాటు ఆయన సహచరులు భేటీ అయ్యారు. దీంతో ఆయన తెలుగుదేశంపార్టీ గూటికి చేరటం దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో చీరాల నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కనున్నాయి. గిద్దలూరు నియోజకవర్గ వైకాపా ఇన్‌చార్జి అన్న రాంబాబు సారధ్యంలో సుమారు 40మంది తెలుగుదేశంపార్టీకి చెందిన నాయకులు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారిని జగన్ పార్టీకండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వారిలో గిద్దలూరు ఎంపీపీ వంశీధర్‌రెడ్డి, అర్ధవీడు ఎంపీపీ రవికుమార్, అర్ధవీడీ జడ్‌పీటీసీ వెంకటలక్ష్మీ, ఎంపీటీసీ రామకృష్ణారెడ్డి, సింగిల్ విండో సొసైటీ అధ్యక్షులు కృష్ణారెడ్డి, నాయకులు ఎదురు శ్రీనివాసరెడ్డి, ఉడుమల సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డితోపాటు తదితరులు ఉన్నారు. దీంతో శాసనసభ్యులు ముత్తుమల అశోక్‌రెడ్డికి అన్నా చెక్‌పెట్టినట్లైంది.
ఇదిలా ఉండగా జిల్లాకేంద్రమైన ఒంగోలులో శాసనమండలి సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, కరణం బలరాంతోపాటు బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరాం మాల్యాద్రి సమావేశమయ్యారు. ఈ నేపధ్యంలో వారు ముగ్గురు కలయిక రాజకీయంగా చర్చనీయాంశమైందనే చెప్పవచ్చు. కాగా మాగుంట శ్రీనివాసులరెడ్డి తెలుగుదేశంపార్టీలోనే కొనసాగుతారా లేక వైసీపీ గూటికి చేరుతారా అన్న చర్చ మాత్రం అన్ని వర్గాలనుండి వినిపిస్తొంది. ఈనెలాఖరునాటికి మాగుంట ఏరాజకీయ పార్టీలో ఉండేదన్న విషయాలు బహిర్గతవౌతాయన్న చర్చ సాగుతుంది. ఈనెల 20వతేదీన వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటన టూర్ ఉండటంతో నాయకులు చేరికలు ఆయన వచ్చేవరకు నిలిచిపోయే అవకాశాలున్నాయి. ఈనేపధ్యంలో మాగుంట కూడా జగన్ విదేశీ టూర్‌నుండి వచ్చిన తరువాత వైసీపీ తీర్ధం పుచ్చుకుంటారా? లేక తెలుగుదేశంపార్టీలోనే మళ్లీ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తారా అన్నది తేలాల్సి ఉంది. మొత్తంమీద రానున్న రోజుల్లో ఇరుపార్టీల్లోనూ భారీగా నేతల వలసలు ఉండే అవకాశాలున్నట్లు ఆయా రాజకీయపార్టీల ద్వారా సమాచారం. కాగా తెలుగుదేశం, వైసీపీలు అభ్యర్థుల ఎంపికలో కసరత్తులు చేస్తుండగా జనసేన తరపున మాత్రం ఇంతవరకు ఎలాంటి రాజకీయ నిర్ణయాలు జిల్లాలో జరగటంలేదని తెలుస్తోంది. మొత్తంమీద జిల్లాలోని ప్రధాన రాజకీయపక్షాల్లో రాజకీయాలు వేడెక్కాయనే చెప్పవచ్చు.