ప్రకాశం

18ఏళ్లు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఫిబ్రవరి 20 : జిల్లాలోని వివిధ కళాశాల్లో 18 సంవత్సరాలు నిండిన యువతను ఓటర్లుగా నమోదు చేయాల్సిన గురుతర బాధ్యత క్యాంపస్ అంబాసిడర్లదేనని జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాలులో వివిధ కళాశాలల నుంచి ఎంపికచేసిన క్యాంపస్ అంబాసిడర్లతో బుధవారం సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వర్క్‌షాపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్యాంపస్ అంబాసిడర్లు లీడర్‌షిప్ నిర్వహించి అంకితభావంతో కళాశాల్లో ఓటర్ల నమోదు రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ఈనెల 23, 24వ తేదీల్లో పూర్తిచేయాలని సూచించారు. ఓటుహక్కు ప్రాధాన్యతను తెలుపుతూ ఏలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటుహక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ రోజున ఓటుహక్కు కలిగిన వారంతా పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓటువేసేలా ప్రోత్సహించాలన్నారు. క్యాంపస్ అంబాసిజర్లు ఎన్నికల ప్రక్రియను తెలుసుకోవాలని, ఎథికల్ ఓటింగ్ జరపాలని సూచించారు. క్యాంపస్ అంబాసిడర్లు భారత ఎన్నికల సంఘం ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుందని, పార్టీలకు అతీతంగా తమ విధులు నిర్వర్తించాలని సూచించారు. క్యాంపస్ అంబాసిడర్ల పాత్ర స్వీప్ కార్యక్రమాల్లో ప్రముఖమైనదిగా గుర్తించాలన్నారు. కళాశాలల్లో నిర్వహించే స్విప్ కార్యక్రమాల్లో క్యాంపస్ అంబాసిడర్లు చురుకుగా పాల్గొనాలని, ఎలక్ట్రో లిటరసీ క్లబ్‌ల ద్వారా యువతను చైతన్యపరచాలని సూచించారు. 2019వ సంవత్సరంలో నిర్వహించే సార్వత్రిక ఎన్నికలను భారత ఎన్నికల సంఘం యాక్సిసిబిలిటీ ఎన్నికలుగా తెలియజేసిందని, విభిన్న ప్రతిభావంతులు వందశాతం ఓటింగ్‌లో పాల్గొనేలా భాగస్వాములను చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు వీలుగా వాలెంటీర్లను, వాహనాలను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, వీవీ ప్యాడ్‌ల పనితీరు గురించి వీడియో క్లిప్పింగులు క్యాంపస్ అంబాసిడర్లకు, నోడల్ అధికారులకు వివరించారు. ఈవీఎంల ద్వారా ఓటింగ్ వేసినపుడు వీవీ ప్యాట్‌లో ఏ అభ్యర్థికి ఓటువేసారనే వివరాలు స్లిప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉందని, ఈ అంశాన్ని భారత ఎన్నికల సంఘం రూపొందించిన వీడియో క్లిప్పింగులను వర్క్‌షాపులో ప్రదర్శించారు. క్యాంపస్ అంబాసిడర్లు ఏలాంటి పరిస్థితుల్లో బహిరంగంగా రాజకీయ పార్టీలకు మద్దతు తెలపకూడాదని చెప్పారు. క్యాంపస్ అంబాసిడర్లు ఓటర్ల రిజిస్ట్రేషన్, ఓటింగ్ విధానంపై పలు సందేహాలను జాయింట్ కలెక్టర్‌ను అడిగి నివృత్తి చేసుకున్నారు. ఈ సమావేశంలో స్టెప్ సీఈవో రవి, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీసుధ, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ అధికారి మీరావలి, క్యాంపస్ అంబాసిడర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.