ప్రకాశం

ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 12: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠా ఆదేశించారు. మంగళవారం వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వద్ద ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పోస్టర్లు, కటౌట్లు, హోర్డింగులను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధేశించిన మార్గదర్శకాలను, ఎన్నికల ప్రవర్తనా నియమామవళిని సక్రమంగా అమలు చేయాలని కలెక్టర్లకు సూచించారు. మీడియా సర్ట్ఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ పెయిడ్ న్యూస్ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాథ్యమాల్లో వచ్చే వార్తలను నిశితంగా పరిశీలించాలన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలన్నారు. జిల్లాల్లో వేసవిలో తాగునీటి సమస్యలు అధిగమించేందుకు ముందస్తు కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాతావరణంలో మార్పులు, ఎండతీవ్రత కారణంగా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం ఉంటుందన్నారు. జిల్లాల్లో అవసరమైన చోట చలివేంద్రాలను ఏర్పాటుచేయాలని, ఈ విషయంలో స్వచ్చంధ సంస్ధల సహకారం తీసుకోవాలన్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని, వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తత్రంగా ప్రచారం చేపట్టాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న వేతన కూలీలకు పనిచేసే స్థలంలో షెల్టర్ల ఏర్పాటుతోపాటు తాగునీటి సదుపాయం కల్పించాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లోని సబ్‌సెంటర్లల్లో ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలను ఉదయం వేళ ముగించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఒవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయించి తాగునీటిని నింపాలని. రెగ్యులర్‌గా క్లోరినేషన్ చేసేలా చూడాలన్నారు. నీటిసంబంధ వ్యాధులు ప్రభలకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ జిల్లాలోని 620గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటి సరఫరా చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తాగునీటి అవసరాల కోసం విడుదల చేసిన 39కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులు ట్రెజరీలో మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ కెనాల్ నుంచి నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ వీడియో కాన్పరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ కోయ ప్రవీణ్, జాయింట్ కలెక్టర్-2 సిరి, ఆర్డీవో వెంకటసుబ్బయ్య, సీపీఒ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిణి రాజ్యలక్ష్మి, వ్యవసాయశాఖ జేడీ శ్రీరాములు, పశుసంవర్ధకశాఖ జేడీ రవీంద్రనాధ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.