ప్రార్థన

శిశువు పుట్టెను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలయనగా మనకు శిశువు పుట్టెను. మనకు కుమారుడను గ్రహించబడెను. ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును - యెషయా 9:6.
మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందుటకే ఆయన అనుగ్రహించబడ్డాడు. నశించిపోతున్న మానవాళిని దేవుడు ఎంతో ప్రేమించి, మనలను రక్షించటానికి తన ఏకైక కుమారుని ఈ లోకములోనికి పంపాడు. మానవుడు పాప వలయములో చిక్కుకొని బయటకు రావాలని స్వంత ప్రయత్నాలు చేసినా ఈ పాపము నుండి బయటపడలేనప్పుడు ప్రభఉవే నరావతారిగా ఈ లోకమునకు వచ్చాడు. మన బానిసత్వము నుండి బంధకాల నుండి విడిపించటానికే ఆయన వచ్చాడు. ఆదిలో అవ్వ ఆదాము పాపము చేసినప్పుడే, దేవుడు ఈ ప్రణాళికను సిద్ధము చేసికొన్నాడు. ఆ సంగతి ప్రవచించాడు.
ఆది 3:15 - మరియు నీకును స్ర్తికిని నీ సంతానమునకును స్ర్తి సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును. నీవు దానిని మడిమె మీద కొట్టుదువని చెప్పెను.
వాస్తవానికి దేవుడు తన ప్రణాళిక అంతటిని ఇక్కడ తెలియజేశాడు. సాతానుకు స్ర్తి సంతానానికి వైరము ఒకటి, సాతాను తలను చితకగొట్టుట, స్ర్తి సంతానాన్ని మడిమ మీద కొట్టుట. రెండవది స్ర్తి సంతానము అంటే పురుషుని సంబంధము లేకుండా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా పుట్టుట. ఈ సంగతి యెషయా ప్రవక్త ద్వారా 7:14లో చెప్పబడింది.
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఈయన పుట్టుకకు పాపముతో సంబంధము లేదు. పుట్టుకలో పాపము లేదు. తాను భూమి మీద జీవించినంత కాలములో కూడా పాపము చేయలేదు. నాలో పాపమున్నదని ఎవరైనా నిరూపించగలరా? అని సవాలు చేసిన ప్రభువు. ఈయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని యెషయా ప్రవచించాడు. ఈ ప్రవచనము తరువాత 700 సంవత్సరాలకు ప్రభువు జన్మించడం జరిగింది.
ఆయన జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యకయే ఈ మరియ.
ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ప్రభువు నీకు తోడై యున్నాడని చెప్పెను. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి, ఈ శుభ వచనము ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత - మరియా, భయపడకుము. దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును అని, ఈ సంగతులు మత్తయి సువార్తలోను, వైద్యుడైన లూకా వ్రాసిన సువార్తలోను తెలియజేయబడింది.
రెండు వేల సంవత్సరాల క్రితం ఎటువంటి అడ్వాన్స్‌డ్ మెడికల్ ఎక్విప్‌మెంట్స్ లేని రోజుల్లో గబ్రియేలు దూత తెలిపిన మాట ‘మరియ’ నీవు గర్భము ధరించి కుమారుని కంటావని. ఇది దైవ కార్యము. ఆయన సృష్టికర్త గనుక సృష్టి మీద అధికారము కలదు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? అని సవాలు చేసిన దేవుడు. కన్యకను పురుషునితో సంబంధము లేకుండ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా గర్భాన్నిచ్చిన దేవుడు, గొడ్రాలనబడిన ఎలీజబెత్ వృద్ధాప్యములో గర్భాన్ని తెరిచిన దేవుడు, సర్వశక్తిగల దేవుడు గనుక ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సర్వశక్తిగల దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడై యుండి తన్ను తాను తగ్గించుకొని ఒక సామాన్య కుటుంబములో పశువుల పాకలో పసిబాలునిగా జన్మించాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు తన్ను తాను రిక్తునిగా చేసికొని మన మధ్యకు వచ్చాడు. క్రిస్మస్ దినాలలో క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. ఆయన దేవుని స్వరూపముగల వాడై యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని యెంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని (శిష్యుల పాదాలు కడిగి తువాలుతో తుడిచాడు) తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అంతేకాదు అనంతుడైన దేవుడు ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొన్నాడు. ఆయన వెంబడింపగోరు వారిని కూడా తన మాదిరి తగ్గించుకొని తనను వెంబడించమంటే, ఏ విషయములోను తగ్గించుకోలేక పోతున్నారు. ప్రభువు చెప్పింది చేసి ఆయనను ఆరాధించాలి. ఈ క్రిస్మస్ పండుగ విషయములో కూడా ఏ మాత్రం తగ్గటంలేదు. నూతన దుస్తులు, పిండి వంటలు, డెకొరేషన్స్, ఒకరికి మించి ఒకరు. ఒకరి స్టార్ కంటె ఇంకొకటి పెద్దదిగా చేస్తున్నారు కానీ, అసలు శుభ్రపరచవలసిన హృదయాన్ని అంతగా పట్టించుకొన్నట్లు లేదు. హృదయాన్ని ప్రేమతో కనికరముతో దయతో క్షమాపణతో అలంకరించవలసినంతగా అలంకరించుకోవటము లేదేమో అనిపిస్తుంది. పైపై మెరుగులతో అలంకరించుకోవటం మేము గొప్ప అంటే మేమే గొప్ప అన్నట్టు పోటీ పండుగ లాగ ఉంది. క్రీస్తు జననము గనుక ఆయనను ఆరాధించటం, అంటే ఆయన కోరుకున్నట్టు ఆరాధించటం చాలా ముఖ్యము. ఆయన ఆత్మగనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను పూర్ణ బలముతోను ఆరాధించాలి. అంతేగాని తినటం త్రాగటం గొడవలు అల్లర్లు కొట్లాటలు పోటీలు కాదు క్రిస్మస్ పండుగ. క్రీస్తుకు కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండటమే నిజమైన క్రిస్మస్.
మరియ భర్తయైన యోసేపు నీతిమంతుడై యుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమెయొక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
యోసేపు మరియలు ఇరువురు కూడా దేవదూత తెలిపిన మాటలు హృదయపూర్వకముగా అంగీకరించారు. మరియ యవ్వన ప్రాయములోనే ప్రభువు దయ పొందుకుంది. యోసేపు నీతిమంతుడై యున్నాడు. తన సంబంధము లేకయే గర్భవతియైన మరియను అవమానపరచడానికి ఇష్టపడలేదు. ఇటువంటి విషయాలను ఎవరూ ఒప్పుకోరు ఓర్చుకోరు గనుక చాలా గొడవలు అవుతాయి. వీరిరువురికి ప్రదానము అయినది గాని వివాహము జరుగలేదు. కానీ ప్రదానమైతేనే ఆ దినాలలో వారిని భార్యాభర్తలుగా పరిగణిస్తారు. వివాహ దినమునకు ముందు స్ర్తి గర్భము ధరించినచో ఆమె హీనమైనదిగా ఎంచబడును. అంతేగాదు రాళ్లతో కొట్టి చంపేవారు. దేవుని యందు ప్రేమగల వీరిరువురు కూడా ఎటువంటి అవమానమైనా భరించటానికి సిద్ధపడ్డారు. దేవుని సంకల్పం నెరవేరటానికి అవమానాన్నైనా భరించటానికి ముందుకు వచ్చారు. దేవుని నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ కార్యము జరిగేటప్పుడు సాతానుడు అనేక రీతులుగా శోధించడానికి ప్రయత్నించి, ఆ మంచి కార్యాన్ని ఆపటానికి ప్రయత్నిస్తాడు. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కొంతమంది దేవుని కొరకు అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చినపుడు నిలువలేక పోతున్నారు. మనుష్యులు మంచివారనుకోవాలని మనుష్యులను మెప్పించేటట్లు చేస్తున్నారు. కాని మరియు యోసేపులు ఇరువురు దేవునికి లోబడి యేసు పుట్టుకకు దోహదపడ్డారు. దేవుని ఆశీర్వాదాలు పొంది, నరావతారియైన యేసుకు తల్లిదండ్రులయ్యారు. చివరకు యోసేపు దూత తన కాజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగక ఉండెను. దేవుడిచ్చిన విశ్వాసం కొనసాగించాలంటే లోక పద్ధతులు ఆచార వ్యవహారాలు పట్టించుకోకూడదు. మనము దేవుని సంతోషపెట్టేవారముగా ఉండాలి కానీ మనుష్యులను సంతోషపెట్టే వారముగా కాదు. మనుష్యులను సంతోషపెట్టే వారమైతే క్రీస్తుకు దాసులము కాలేము.
ఇంకొక సంగతి మనకు ఒక సామెత ఉంది. గోటితో పోయేదానిని గొడ్డలిదాక తేవటం ఎందుకని? జాగ్రత్త. దేవుడు మన పట్ల జరిగించే కొన్ని కార్యాలను గోటితోనే త్రుంచివేయటానికి సాతానుడు బహుగా ప్రయత్నాలు చేస్తాడు. వాళ్లేమనుకుంటారో వీళ్లేమనుకుంటారో అని దేవుని విషయాలలో ఆలోచించకూడదు. దేవుని మాటకు విధేయులమవ్వాలి. అప్పుడే సాతానుడు పారిపోతాడు. ఇంతెందుకు క్రీస్తునే పసిబాలుడుగానే చపంవేయాలని ప్రయత్నించిన హేరోదు, జ్ఞానులు చెప్పిన మాటలను బట్టి తన రాచరికాన్ని నిలువబెట్టుకోవటానికి రెండు సంవత్సరములలోపు మగబిడ్డలను చంపివేయమని ఆజ్ఞాపించాడు. కనుక బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించెను.
అందువలన రామాలో అంగలార్పు వినబడేను. ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై యేడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనొల్లక యుండెను అని ప్రవక్తయైన యిర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను.
జ్ఞానులు వారి జ్ఞానముతో ప్రభువును కనుగొన్నారు. ఎంతకాలం వెతికారో, ఎంతకాలం ప్రయాణం చేశారో తెలియదు కానీ వారు తూర్పుదేశపు జ్ఞానులని, ప్రాచీన బబులోను సమీపమునగల పార్తియ దేశము నుండి వచ్చిన వారని మరొక అభిప్రాయము కలదు. యెసోరి ఒక క్రొత్త నక్షత్రము ఉదయించగా అప్పుడు ఒక రాజు జన్మకు ఆనవాలుగా ఉన్నది. ఎట్లైనను ఒక క్రొత్త నక్షత్రము ఉదయించితే అది ఒక నూతన రాజు యొక్క ఉద్భవమును గూర్చి జ్ఞానులు పరిశోధించి తెలుసుకొనిరి. జ్ఞానులు ముగ్గురు కాదు, ఒక గుంపువారని వేద పండితుల ఉద్దేశము. ఈ జ్ఞానులు పలు దేశములకు చెందినవారని అభిప్రాయము కలదు. అది నిజమైతే ప్రపంచములోని పలు దేశముల నుండి జ్ఞానులు వచ్చి ప్రభువును ఆరాధించిరని చెప్పవచ్చును. ఇశ్రాయేలులోని ఏర్పరచబడిన ప్రజలు ప్రభువును గ్రహించలేక పోవుటయు, ఇతర దేశముల వారు ఆయనను ఎరుగుటయు మనకు ఆశ్చర్యము కలిగించవచ్చును. క్రీస్తు యూదుల రాజు మాత్రమే కాదు, లోకమంతటికి రాజుగా జన్మించెనని దీని ద్వారా మత్తయి నిరూపించెను. వేల కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి యూదుల రాజును వెదకు యూదయకు వచ్చి, ఆయనను చూచినప్పుడు వారు సంతోషించి ఆరాధించి కానుకలు సమర్పించి ఘనపరచిరి.
దళ తీజఒళఒఆ ఆ్దజశ జశ ఆ్దళ జ్యీజూ జఒ ఆ్య త్యీఒ్దజఔ ధ్యిజూ.
గొర్రెల కాపరులు: పొలములో రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు యొక్క దూతలతో ఆయన మహిమ ప్రకాశిస్తూనే ఉంటుంది. (ఇప్పుడు మన సత్క్రియలే వెలుగు వలె ప్రకాశించి తండ్రిని మహిమ పరచాలి)
అయితే ఆ దూత భయపడకుడి - ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను నీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి యున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టెలో పండుకొని యుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. ఆకాశ మహాకాశము పట్టజాలని దేవుని సముఖములో నుండి దూత వచ్చి ప్రకటించిన సువార్త ఒక నిమిషం లోపలే ఉంది. రక్షకుడు పుట్టి యున్నాడన్న వార్త విన్నవారు ఈ గొల్లలు త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టెలో పండుకొని యున్న శిశువుని చూచిరి. వారు శిశువును చూచి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి.
రక్షకుని జన్మదిన శుభవార్త ముందు దూతలు ప్రకటించారు. ఆ తరువాత గొల్లలు ప్రకటించారు. ఇంత గొప్ప ఆధిక్యత కష్టజీవులైన గొల్లలకు దొరికింది.
జ్ఞానులు వెతికి యేసును కనుగొని పూజించారు. గొల్లలు దేవదూత మాటలు విని, ఆ మాటలను ప్రచురము చేశారు. దేవుని మహిమ మరచారు. స్తోత్రము చేయ వెళ్లారు. దూతలు శుభవార్తగా తెలియజేసిన వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ ఉంది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన వారికి భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవుని స్తోత్రము చేసిరి.
మనలను ఇంతగా ప్రేమించి, మనలను కాపాడటానికి రక్షించటానికి పరలోకము నుండి భూలోకానికి నరావతారిగా వచ్చిన మన ప్రభువుకు నిత్య స్తోత్రము. ఇక వేరే ఆలోచన లేకుండా ప్రభువును స్తుతిస్తూ మహిమ పరుస్తూ ఘనపరుస్తూ ఈ సత్యసువార్తను దూతల మాదిరి గొల్లల మాదిరి జ్ఞానుల మాదిరి ప్రకటించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయును గాక.
ఏలయనగా మనకు శిశువు పుట్టెను
మనకు కుమారుడనుగ్రహించబడెను.
ఆయన భుజము మీద రాజ్యభారముండును.
ఆశ్చర్యకరుడు - మన జీవితాలను ఆశ్చర్యకరంగా తీర్చిదిద్దుతాడు.
ఆలోచన కర్త - సరియైన ఆలోచన ఇస్తాడు.
బలవంతుడైన దేవుడు - పాపభారమంతటిని తన బలముతో కొట్టివేశాడు.
నిత్యుడగు తండ్రి - నిత్యము ఉండే తండ్రి.
సమాధానకర్తయగు అధిపతి - ఆయనే మన సమాధానము.
Happy Christmas

- మద్దు పీటర్ 9490651256