ప్రార్థన

యేసు నామములో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యేసు పరిశుద్ధమైన నామములో స్వస్థపడెను.
పుట్టినది మొదలు కుంటివాడైన మనుష్యుడు లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడ దేవాలయము లోనికి వెళ్లెను. అతను నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరు చూచి శృంగారమను దేవాలయము ద్వారము నొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి, వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో పరవశులైరి.
ఇక్కడ చూసినట్లయితే స్వస్థపడిన వ్యక్తి లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించాడు. ప్రార్థించిన పేతురు యోహానును కాదు గానీ, స్వస్థపరచిన వాడు ప్రభువుని గుర్తించి ప్రభువును స్తుతించుట మొదలుపెట్టాడు. ఈ సంగతి మనం గ్రహించాలి. పేతురు చెప్పిన మాటను ఆ భిక్షకుడు నమ్మాడు. నా వద్ద వెండి బంగారములు లేవు గాని నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నడువుమని చెప్పెను. దీనిని బట్టి చూస్తే వెండి బంగారాలు కాదు గానీ యేసు నామములో స్వస్థత ఉందని తెలుస్తుంది. స్వస్థతకు యేసు నామము చాలు. అంతే కాదు ఆ పరిశుద్ధమైన యేసు నామములో జీవించే మనుష్యులలో ఆ నామమును బట్టి ప్రార్థించే వారి నీడ పడితే చాలని, వారు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి, వారిలో ఎవరి మీదనైనను అతని నీడయైనను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. రోగులకే కాదు అపవిత్రాత్మకల చేత పీడింపబడిన వారిని మోసికొని కూడి వచ్చిరి. వారందరు స్వస్థత పొందిరి. దేవునికి మహిమ కలుగును గాక.
ఇది చూసిన ప్రజలు కుంటి వానికి జరిగిన స్వస్థతను బట్టి విస్మయముతో పరవశులైరి. యేసు ప్రభువు - గాలిని సముద్రమును గద్దించి తుపానును నిమ్మలపరచినప్పుడు కూడా మనుష్యులు ఆశ్చర్యపడ్డారు. ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. అయితే ఆయన శిష్యులు చేసిన కార్యాలకు ఆశ్చర్యపడిన మనుష్యులతో పేతురు - ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అను వారి దేవుడు, అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమ పరచియున్నాడు. మీరాయానను అప్పగించితిరి. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి, నర హంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి యెరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి యెదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. అయితే సహోదరులారా మీరును మీ అధికారులును తెలియక చేసితిరని నాకు తెలియును.
అంతేకాదు మోషే ఇట్లనెను. ప్రభువైన దేవుడు నా వంటి యొక ప్రవక్త మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండ సర్వ నాశనమగు ననెను. మరియు సమూయేలు మొదలుకొని యెందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరు ఈ దినమును గూర్చి ప్రకటించిరి. దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. ఈ మాటలు వినిన వారనేకులు నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు. స్ర్తిలు పిల్లలు కలిసి ఇంకా ఎక్కువే ఉండొచ్చు.
అయితే యాజకులు సద్దూకయ్యులును దేవాలయపు అధిపతియు వారు బోధించుట చూచి, వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరుసటి దినము వరకు వారిని కావలిలో ఉంచిరి. మరునాడు వారి అధికారులును, పెద్దలును, శాస్త్రులును యెరూషలేములో కూడుకొనిరి. వారు పేతురు యోహాను మధ్యను నిలువబెట్టి, మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడిగిరి. వారికి తెలియక కాదు ఈ మాట అడిగింది, కాని వారిని ఎలాగైనా పట్టించాలని.
అందుకు పేతురు - మీరందరును ఇశ్రాయేలు ప్రజలందరును తెలిసికొన వలసినదేమనగా - మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసు క్రీస్తు నామము వలననే వీడు స్వస్థత పొంది మీ యెదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన తృణీకరించిన రాయి యనే. ఆ రాయి మూలకు తలరాయి అయింది. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని, ఆకాశము క్రింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. కారణము - యేసే మానవాళి రక్షణార్థము సిలువ వేయబడి చనిపోయి తిరిగి లేచాడు. మన పాపాలకు వెల చెల్లించాడు. ఈ యజ్ఞాన్నిబట్టి మన పాపాలు క్షమించబడి మనకు విమోచన దొరికింది.
అయితే వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు యేసుతో ఉన్నవారని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడ నిలిచి యుండుట చూచి యేమియు ఎదురు చెప్పకపోయిరి. అయిన వారి ప్రాబల్యం ఎక్కడ తగ్గిపోతుందోనని ఆలోచించి, ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి యే మనుష్యులతోనైనను మాటలాడకూడదని, బోధింపను కూడదని వారికాజ్ఞాపించిరి.
అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటె మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఎందుకంటే యేసు ప్రభువుతో మూడున్నర సంవత్సరములు కలిసి తిరిగి, ఆయన ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్లి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండి, ఆయన ఎక్కడ తింటే అక్కడ తిని ఉన్నవారు గనుక ఆయన శక్తిని ఎరిగిన వారు గనుక, ఆయన మన కొరకు పడిన కష్టము కన్నులారా చూసారు గనుక, అంత ధైర్యంగా ఉండగలిగారు. ప్రభువు మన రక్షణార్థము ఎన్ని దూషణ మాటలు పడ్డారో, సిలువను ఎలా సహించారో, తలకు ముళ్ల కిరీటం, చేతులలో కాళ్లలో సీలలు ఎలా ఓర్చుకున్నాడో దానిని చూసిన వారు గనుక, మరణాన్ని జయించి తిరిగి లేచిన సంగతి కళ్లారా చూసిన వారు, ఆయన మరణాన్ని జయించటమే కాదు, ఆయన మాటతో మరణించిన వారిని లేపుట చూసిన వారు గనుక ధైర్యంగా ప్రకటించగలిగారు.
అంతేకాదు ప్రజలందరు జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరచుచుండిరి గనుక సభ వారు ప్రజలకు భయపడి, వీరిని శిక్షించు విధమేమియు కనుగొనలేక వీరిని గట్టిగా బెదరించి విడుదల చేసిరి. చూడండి. ఎంత విడ్డూరమో, నలుబది ఏండ్ల కుంటివాడు గంతులు వేస్తూ ఎగిరేటట్లు చేసిన వారిని ఎలాగైనా బెదిరించి, విడుదల చేశారట. వాళ్లు చేయలేక పోయారు. చేస్తున్న వారి మీద ఈర్ష్యా ద్వేషాలు కలిగి ఉన్నారు. ఎందుకు అల్లరి చేశారో? వ్యర్థమైన ఆలోచనలు ఎందుకు పెట్టుకొన్నారో? కానీ ఇలా జరుగునని ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి.
ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులును ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మీ తండ్రియు నీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. - అపొ.కా. 4:26.
ఏవి జరుగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో, వాటి నన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్య జనులతోను ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి.
రోగులను స్వస్థపరచుటకును, పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును దేవుని హస్తము చాచి ఉన్నది గనుక పేతురు యోహానులు వాక్యమును ధైర్యముగా బోధించిరి. అనేకులు విశ్వసించి ఏక హృదయము ఏక ఆత్మ కలిగి యున్నారు.
ఫిలిప్పు కూడా తన సేవను సమరయ ప్రాంతాలలో జరిగించి అనేక అద్భుతాలు సూచక క్రియలు చేశాడు. అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాయి. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఒకప్రక్క స్వస్థతలు జరుగుచున్నవి, దయ్యాలు పారిపోతున్నాయి గాని ఇంకొక ప్రక్క వీరి మీద ఈర్ష్యాద్వేషాలు పెరిగి, అపొస్తలులను హింసించుట కూడా జరిగింది.
మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లయినను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. దయ్యములు కూడ వదలిపోయెను. అప్పుడు దేశ సంచారులును మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసు తోడు మిమ్మును ఉచ్ఛాటన చేయుచున్నానను మాట చెప్పి, దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్ఛరించుటకు పూనుకొనిరి. యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు అలాగు చేయుచుండిరి.
సంగతి చూడండి, దయ్యాలకు కూడ ప్రభువు తెలుసు. ఆయనను విశ్వసించిన వారు తెలుసు. యేసును వెంబడించే వారి మాటలే దయ్యాలు వింటాయి గాని, ఎవరుబడితే వారికి మాట వినవు. స్కెవయను ప్రధాన యాజకుని కుమారులు ఏడుగురు పౌలు లాగా దయ్యాలను వెళ్లగొట్టటానికి ప్రయత్నిస్తే, ఆ దయ్యము నేను యేసును ఎరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడిగి, వారి మీద పడి ఇద్దరిని లొంగతీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ యింట నుండి పారిపోయిరి. గమనించాలి. యేసు నామమును ఆయన యందు విశ్వాసముంచి, ఆయన ఆజ్ఞానుసారంగా నడచువారు మాత్రమే వాడగలరు.
ఈ పౌలు ముందు సౌలు అనే నామము గలవాడు, అయితే ఈ సౌలు ప్రభువు యొక్క శిష్యులను బెదరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్లి ఈ మార్గమందున్న పురుషులనైనను స్ర్తిలనైనను కనుగొనిన యెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసికొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగినవాడు. అయితే ప్రభువు అతని దర్శించి అతని మార్చిన విధానమంతా అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయములో చూడవచ్చు. సౌలా సౌలా నీవెల నన్ను హింసించుచున్నావని తనతో మాట్లాడిన ఒక స్వరము విని, ప్రభువా నీవెవరవని అడుగగా ఆయన - నేను నీవూహించుచున్న యేసును అని సెలవిచ్చెను.
గమనించాలి. యేసు సేవకులను హింసిస్తే యేసును హింసించినట్లే. సౌలుకు వచ్చిన అవకాశము అందరికి వచ్చి పౌలులాగ మారే అవకాశము ఉండకపోవచ్చు. కనుక ప్రభువు సేవకులను హేళన చేయుట, హింసించుట ప్రభువుకు చేసినట్లే.
గ్లోబల్ తెలుగు క్రైస్తవ సేవకుల సదస్సులో జయసుధ గారు తన సాక్ష్యాన్ని వివరించారు. తను మనందరికీ ఒక సినిమా నాయకి అని తెలిసిందే. తాను వివాహమైన క్రొత్తలో హనీమూన్‌కు ఆస్ట్రేలియా వెళ్లి, సముద్రములో మోటర్‌బైక్ మీద భర్త వెనుక కూర్చొని వెళ్లే సమయములో, ఆ వేగానికి, అలలు పైకి క్రిందకు రావటం వల్ల తాను జారి పడిపోయినప్పుడు, నడి సముద్రములో తాను మునిగిపోతూ ‘యేసూ’ అని గట్టిగా అరిచిందట. భర్తకు, జయసుధ గారు పడిపోయిన సంగతి తెలియక ఎంతో దూరము వెళ్లిపోయారు. మరి తాను యేసు భక్తురాలు కాదు గాని ఆ నామమునే ఉచ్చరించిందట. తనకు తెలియకుండానే యేసు అని పిలిచినప్పుడు తనకు ప్రభువు రూపము ఆ నీళ్లలో కనపడినదని చెప్పారు. తనకు ఈత వేయుట రాదట. అయితే తన భర్త ఎంతో దూరము వెళ్లి వెనుతిరిగి సముద్రములో పడి ఉన్న జయసుధ గారి దగ్గరకు వచ్చేవరకు కూడా తనను ఎవరో మునిగిపోకుండా పట్టుకున్నట్లుగా ఉండి, తాను రక్షించబడ్డ విధమును తెలియజేశారు.
యెహోవా నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును.
- సామెతలు 18:10
దేవుడు మనకు ఆశ్రయము దుర్గమునై యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు
- కీర్తనలు 46:1
యేసు - నా నామమున మీరు ననే్నమి అడిగినను నేను చేతును. - యోహాను 14:14.
అటువలె మీరును అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును. తట్టుడి మీకు తీయబడును.
- లూకా 11:9.
అడుగు ప్రతివానికియ్యబడును. వెదకు వానికి దొరకును. తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
- లూకా 11:10.
పాపాలను క్షమించి పాపిని పవిత్రపరచి, సాతాను మీద విజయాన్నిచ్చి, రోగికి స్వస్థత, మనసుకు నెమ్మది, దుఃఖితులకు ఆదరణ, దురాత్మలను వెళ్లగొట్టగలిగి, సృష్టిని శాసించగల, మృతులను సహితము లేపగల, పాతాళాన్ని తప్పించి పరలోకానికి చేర్చే యేసు పరిశుద్ధమైన ప్రశస్తమైన ఉన్నతమైన నామములో నూతన సంవత్సర శుభాకాంక్షలు.

- మద్దు పీటర్ 9490651256