ప్రకాశం

జిల్లాలో అక్షరాస్యత పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అద్దంకి, జనవరి 31 : జిల్లాలో అక్షరాస్యతను మరింత పెంచేందుకు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ వై శ్రీనివాస శేషసాయిబాబు పేర్కొన్నారు. ఆదివారం అద్దంకి పట్టణంలోని అర్‌అండ్‌బి అతిథి గృహంలో ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహార్‌లాల్‌తో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే అక్షరాస్యత, నీటి సౌకర్యం లేకపోవడం వలన ఆర్థికంగా చాలా వెనుకబడి పోయిందన్నారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 63శాతం అక్షరాస్యులు ఉన్నారని, దేశంలో సరాసరి అక్షరాస్యత సరాసరి ఉందన్నారు. జిల్లాలో నాలుగున్నర లక్షలమంది ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారని, వారందరినీ వచ్చే సంవత్సరంలోగా అక్షరాస్యులను చేసి జిల్లా అక్షరాస్యతాశాతాన్ని పెంచేందుకు వయోజక విద్యశాఖతో పాటు మహిళా,శిశు సంక్షేమ శాఖ, డిఆర్‌డిఎ, డ్వామా, కార్మికశాఖ, ఎస్సీ, ఎస్టీ తదితర సంక్షేమ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లబ్థిదారులు సక్రమంగా పొందాలంటే తప్పనిసరిగ్గా చదువుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ -విధానం రూపంలో పలు పథకాలను ప్రజలకు చేరవేస్తుందన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలను, బాలింతలను విద్యావంతులుగా చేయాలన్నారు. వారు వారి పిల్లల విషయంలో పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలపై వచ్చే సందేహాలు అర్థం చేసుకోవాలంటే వారు చదువుకోవాలని సూచించారు. అలాగే ఉపాధిహామీ కూలీలకు చదువు ఎంత అవసరమని వారికి నైపుణ్యం పెంపుదల క్రింద చదువులో శిక్షణ ఇవ్వాలని, అందుకోసం వారికి రోజుకు 200 రూపాయలు చెల్లించవచ్చునన్నారు. చదువుకుంటే ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చునన్నారు. ఇది వరకు జిల్లాలో అక్షరాస్యత ఉద్యమం జరిగినా నిరంత విద్య లేకపోవడంతో చదువుకుంది పోతుందన్నారు. మారుమూల గ్రామాలు ముఖ్యంగా 25 శాతం కంటే తక్కువ అక్షరాస్యత ఉన్న గ్రామాలు 50 శాతం కంటే తక్కువ ఉన్న గ్రామాలు, ఎస్సీ, ఎస్టీలు నివసించే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
స్వయం సహాయక సంఘాల మహిళలు బ్యాంకుల రుణాలను మహిళా సమైక్య సమావేశాలను విద్యావ్యాప్తికి వినియోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికశాఖ పరిధిలో జాబ్‌కార్డుదారులు డ్రైవర్లుగా నమోదైన వారికి, వారి జీవితభాగస్వాములను కూడా విద్యావంతులను చేయాలన్నారు. రాష్ట్రంలో 7 వేల 800 కోట్ల రూపాయల మేరకు రైతు రుణమాఫీ కింద, 4 వేల 200 కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలు మాఫీ కింద నేరుగా లబ్ధిదారులకు ఎలాంటి మధ్యవర్తులు, రాజకీయ ప్రమేయం లేకుండా అవినీతిరహితంగా చేరవేయడం జరిగిందన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో 30 వేల కోట్ల రూపాయలను రైతులకు, డ్వాక్రా మహిళలకు అవినీతి రహితంగా ఇవ్వనున్నామన్నారు. మీ ఇంటికి - మీ భూమి పథకం కింద రెవెన్యూ రికార్డులను తాజాగా రూపొందించి పారదర్శకతకు పెద్దపీఠ వేశామని తద్వారా 60 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. బడి బయట పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో, సంక్షేమ వసతి గృహాల్లో చేర్పించాలన్నారు. ప్రతినెలా ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేయాలన్నారు. ప్రతి ఒక్క ఉద్యోగి ఒకరిని చదివించే బాధ్యత తీసుకోవాలన్నారు. వచ్చే ఫిబ్రవరి నెలలో ఒంగోలులో జిల్లాస్థాయి సమావేశం నిర్వహిస్తామని, అన్నీ ప్రభుత్వ శాఖల ప్రగతిని సమీక్షిస్తామన్నారు. రానున్న రోజుల్లో మనం ఈ - ప్రగతిలోకి వెళుతున్నామని, మన పిల్లలు అభివృద్ధి ఫలాలు అందుకోనున్నారని తెలిపారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రజలు ఆర్థికంగా ఎదగడంతో సరిపోదని, సమాజం కూడా బలోపేతం కావాలన్నారు. ఇందుకోసం వయోజనుల్లో అక్షరాస్యతను పెంచాలని, పిల్లలను బాగా చదివించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను సజావుగా వినియోగించుకుంటే అనుకున్న లక్ష్యాలను సాధించగలమన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలులో మంచినీటి కొత్త పైపులైను నిర్మాణానికి రూ. 40 కోట్లు
రాష్ట్ర పురపాలక శాఖమంత్రి నారాయణ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 31: ఒంగోలు నగర ప్రజలకు తాగునీటి ఎద్దడి నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలకశాఖమంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం ఉదయం మంత్రి ఒంగోలు పురపాలక సంఘ కార్యాలయానికి ఆకస్మికంగా విచ్చేశారు. ఈసందర్భంగా తనను కలిసిన విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఇరిగేషన్ శాఖమంత్రితో మాట్లాడి తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏడుగుండ్లపాడు నుండి ఒంగోలులోని సమ్మర్‌స్టోరేజి ట్యాంకులకు పైపులైన్ల ద్వారా తాగునీటిని తీసుకువచ్చేందుకు నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న పైపులైన్ల సామర్థ్యం తక్కువుగా ఉన్న కారణంగా కొత్త పైపులైను నిర్మాణానికి 40కోట్లరూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. వారంరోజులలోపుగా పైపులైన్ల నిర్మాణానికి టెండర్లను పిలవనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి నీరు-చెట్టు కార్యక్రమం చేపట్టడటం వలన పలు ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగాయని, ఫలితంగా ప్రస్తుతం కొన్ని జిల్లాల్లో భూగర్భజలాలు పెరగటం వలన తాగునీటి సమస్యలు, కరవు పరిస్థితులు తలెత్తడటం లేదన్నారు. 371కోట్లరతో ఒంగోలుకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం కోసం గుండ్లకమ్మ నది నుండి తాగునీటిని తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు ఇంజనీర్ ఇన్ చీఫ్‌కు పంపినట్లు చెప్పారు. ఇరిగేషన్ శాఖమంత్రితో మాట్లాడి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ప్రాజెక్టు మంజూరు అయ్యేటట్లు చూస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఒంగోలులో రెండు సమ్మర్ స్టోరేజి ట్యాంకులు ఉన్నాయని, మూడవ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పేర్నమిట్టలో నిర్మించేందుకు పరిశీలనలో ఉందన్నారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అభ్యర్థన మేరకు ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులు, డ్రైన్లు, రోడ్లు, వౌలికవసతులు ఏర్పాట్లకు ఎస్‌స్, ఎస్‌టి సబ్‌ప్లాన్ కింద 20కోట్లరూపాయలు, జనరల్ ఫండ్స్ కింద 30కోట్లరూపాయలు కలిపి మొత్తం 50కోట్లరూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎస్‌సి,ఎస్‌టి సబ్‌ప్లాన్ కింద పదికోట్లరూపాయలను విడుదల చేయటం జరిగిందన్నారు. మిగిలిన 40కోట్లరూపాయలు త్వరలో విడుదల చేస్తామన్నారు. అనంతరం ఏడుగుండ్లపాడులోని పంప్‌హౌస్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. మంత్రి వెంట జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్, రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి,ఒంగోలు మునిసిపల్ కమీషనర్ ఎస్ వెంకటకృష్ణ, పురపాలకశాఖ ఇంజనీర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఇసుక రీచ్‌లకు అనుమతులు ఇవ్వాలని మైనింగ్ అధికారులపై
తెలుగు తమ్ముళ్ల ఒత్తిడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,జనవరి 31: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తరువాత ఇసుక బంగారంగా మారటంతో ఆ ఇసుకతో కోట్లాది రూపాయలు గడించవచ్చునన్న ఉద్దేశ్యంతో తెలుగుతమ్ముళ్లు మైనింగ్ అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఇసుక ఉన్నప్రాంతాల్లోని తెలుగుతమ్ముళ్లు మైనింగ్ అధికారులపై ఒత్తిడి తెస్తూనే మరొకపక్క ఆయా నియోజకవర్గాలకు చెందిన ముఖ్యనేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో గతంలో ఇసుక రీచ్‌లు లేవంటూ రాష్ట్రప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం నివేదిక పంపించింది. ఈ నేపధ్యంలో ట్రాక్టర్లు, లారీలద్వారా ఇసుకను తవ్వితే చర్యలు తీసుకుంటామని, ఒక్క ఎండ్లబండిపై మాత్రమే ఇసుకను అనుమతి ఇస్తామని మైనింగ్ అధికారులు పేర్కొనటం జరిగింది. దీంతో ఇసుక బకాసురులకు అడ్డకట్టపడినట్లైంది. గతంలో ఇసుక క్వారీలులేవని చెప్పిన జిల్లా యంత్రాంగం తాజాగా జిల్లెలమూడి, విక్కిరాలపేటల్లో ఇసుక రిచ్‌లకు టెండర్లను పిలిచేందుకు రంగం సిద్ధమైంది. మూడుమీటర్లకు పైన ఇసుక ఉండటంతో ఈ రిచ్‌లకు టెండర్లు పిలుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిఇలా ఉండగా జిల్లావ్యాప్తంగా గుండ్లకమ్మ, మనే్నరు, పాలేరు, ముసితోపాటు, కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల తదితర ప్రాంతాల్లో ఇసుక అధికంగా ఉంది. ఈ ప్రాంతాలనుండి ప్రస్తుతం అనధికారికంగా ఇసుకను బకాసురులు అమ్ముకుంటూ జేబులను నింపుకుంటున్నారు. అనధికారికంగా ఉన్న రీచ్‌లనుండి ప్రతినిత్యం ఇసుకను తరలించుకుపోతున్నప్పటికీ స్థానిక అధికారులు కాని, జిల్లాయంత్రాంగం కానిదాడులు చేసిన దాఖలు లేవు. కాగా అనధికారికంగా కంటే అధికారికంగానే రీచ్‌లను సంపాదిస్తే కోట్లాదిరూపాయలు సంపాదన సంపాదించువచ్చుననే భావనతో కొంతమంది తెలుగుతమ్ముళ్లు మైనింగ్ అధికారులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారు. మల్లవరం వద్ద ఇసుక ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో ఇసుక రీచ్ వద్దంటూ జిల్లాకు చెందిన ఒక అధికారిణి తేల్చిచెప్పినట్లు సమాచారం. కాగా స్వంతభూముల్లోను ఇసుక రీచ్‌లను ఏర్పాటుచేసుకునే విధంగా రాష్ట్రప్రభుత్వం జివోను జారీ చేసింది. ఈనేపధ్యంలో స్వంత ఇసుకభూములు ఉన్నవారు సైతం లీజులకు అనుమతి ఇవ్వాలంటూ మైనింగ్ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ముందుగా మైనింగ్ లీజులు తీసుకున్న తరువాత స్వంతభూముల్లోని వారికి ఇసుక రీచ్‌లను ఇవ్వనున్నారు. మొత్తంమీద అధికారికంగా ఇసుక రీచ్‌లను తమప్రాంతాల్లోనే వచ్చేవిధంగా మైనింగ్ అధికారులపై తెలుగుతమ్ముళ్ళు తీవ్ర స్ధాయిలోఒత్తిళ్ళు తీసుకువస్తున్నారు. ఏమేరకు జిల్లావ్యాప్తంగా ఇసుక రీచ్‌లు వస్తాయో లేవో తేలాల్చి ఉంది.

చంద్రబాబు పాలనలో ఆర్టీసీ పరిస్థితి దారుణం
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం జగన్ వల్లే సాధ్యం
ఆర్టీసీ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో
వైఎస్‌ఆర్ మజ్దూరు యూనియన్‌ను కార్మికులు గెలిపించాలి
యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రవీంద్రారెడ్డి
ఒంగోలు,జనవరి 31: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనలో ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వైఎస్‌ఆర్ ఆర్‌టిసి మజ్ధూర్ యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం శాసనసభ్యుడు పి రవీంద్రారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైకాపా జిల్లాకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తొమ్మిది సంవత్సరాలపాటు పరిపాలించిన చంద్రబాబు పాలనలో ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితి ఏవిధంగా ఉందో ప్రస్తుతం కూడా ఆయన పాలనలో అదేవిధంగా ఉందని ఎద్దేవాచేశారు. ప్రస్తుతం ఆర్‌టిసి కార్మికులకు నెల జీతాలు ఇవ్వాలంటే ఏదో ఒకటి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఆర్‌టిసికి దాపరించిందని ఆయన విమర్శించారు. గతంలో చంద్రబాబు ఆర్‌టిసిని రిలయన్స్ సంస్థకు అమ్మాలని చూసారని అదే పరిస్థితి నేడు ఉందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్‌టిసి సంస్థ మనుగడే కష్టసాధ్యవౌతుందని దీంతో కార్మికులు, ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఆర్‌టిసిని పరిరక్షించుకోవాలంటే వైఎస్ కాంగ్రెస్‌పార్టీ అనుబంధ సంస్థ అయిన వైకాపా ఆర్‌టిసి మజ్దూర్ యూనియన్‌ను కార్మికులు బలోపేతం చేసి ఈనెల 18న జరగనున్న ఆర్‌టిసి గుర్తింపు ఎన్నికల్లో యూనియన్ గెలుపించాలని కార్మికులకు ఆయన విజ్ఞప్తిచేశారు. గతంలో గుర్తింపు పొందిన యూనియన్లు ఆర్‌టిసి కార్మికుల ప్రయోజనాలకు సరిగా పాటుపడలేదని దీంతో వైకాపా రాష్ట్ర అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఆర్‌టిసి కార్మికుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని యూనియన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆర్‌టిసిలో కార్మికులకు పనిగంటలు పెంచటం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా సింగిల్‌మెన్ విధానాన్ని పెట్టి ఆర్‌టిసి బస్సులను తిప్పటం వలన కార్మికుల ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. ఇలాంటి కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటే గుర్తింపు ఎన్నికల్లో గెలిపిస్తే 67మంది సత్తా కలిగిన తమ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని నిలదీసి ఆర్‌టిసి మనుగడను కాపాడటంతోపాటు కార్మికుల ప్రయోజనాలను కాపాడుతుందన్నారు. ప్రభుత్వంలో ఆర్‌టిసి సంస్థను విలీనం చేయాలంటే అది ఒక్క వైకాపా అధినేత జగన్ వలనే సాధ్యపడుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో వైకాపా రాష్ట్ర అధికారప్రతినిధి బత్తుల బ్రహ్మానందారెడ్డి, వైకాపా ఒంగోలు నగర అధ్యక్షుడు కుప్పం ప్రసాదు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్, వైకాపా జిల్లా మహిళా అధ్యక్షుడు గంగాడ సుజాత, వైఎస్‌ఆర్‌టిఎఫ్ నాయకులు ఓబులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.