ప్రకాశం

వైకాపా నేతల్లో సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 13:వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పేరును అధికారికంగా ఈనెల 15న పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించనున్నారు. జగన్ అధికారికంగా ఈనెల 15వతేదీన ప్రకటించినప్పటికీ అదేరోజు ఒంగోలుకు రాకుండా ఆ తరువాత వచ్చి బాలినేని బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయి. బాలినేని పదవీ బాధ్యతలు చేపట్టే రోజున భారీ ర్యాలీ నిర్వహించాలని వైకాపా శ్రేణులు భావిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. మొత్తం మీద ఎట్టకేలకు బాలినేని వౌనం వీడి జనజీవన స్రవంతిలోకి రానుండటంతో ఆయన వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లాలోని గిద్దలూరు, యర్రగొండపాలెం, కందుకూరు, అద్దంకి నియోజకవర్గాల్లో కూడా పార్టీ ఇన్‌చార్జులను త్వరలోనే నియమించనున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈపాటికే గిద్దలూరు నియోజకవర్గం నుండి ఇన్‌చార్జిగా మాజీ శాసనసభ్యురాలు పిడతల సాయికల్పనారెడ్డి లేదా ఆమె కుమారుడు అభిషేక్‌రెడ్డి బాధ్యతలు తీసుకోనున్నారు. ఆమేరకు ఇటీవల జిల్లాపార్టీ ఇన్‌చార్జి డిసి గోవిందరెడ్డి గిద్దలూరు నియోజకవర్గపరిధిలోని మండలాల్లో ఇన్‌చార్జి ఎంపికపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. వైకాపా నుండి తెలుగుదేశంపార్టీ తీర్ధం పుచ్చుకున్న ముత్తుమల అశోక్‌రెడ్డికి రాజకీయంగా చెక్ పెట్టాలంటే పిడతల కుటుంబమే రాజకీయాల్లో చురుకైన పాత్రపోషించాలన్న అభిప్రాయానికి వైకాపా రాష్టన్రాయకత్వం వచ్చినట్లు పార్టీవర్గాల సమాచారం. అదేవిధంగా అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జిగా మాజీ శాసనసభ్యుడు బాచిన చెంచుగరటయ్య పేరునే రాష్టప్రార్టీ ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇటీవల వైకాపా అధినేత జగన్‌తోను గరటయ్య మంతనాలు సాగించి వచ్చినట్లు తెలుస్తుంది. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి, కరణం వర్గీయులకు గట్టిపోటీ ఇవ్వగల సమర్థుడు గరటయ్యేనన్న అభిప్రాయానికి జగన్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల నియమాకం అధిష్టానం వద్ద క్లియర్ అయినట్లు తెలుస్తొంది. అదేవిధంగా కందుకూరు, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ఇన్‌చార్జుల నియమాకం సమస్య వైకాపాకు ఎదురైందనే చెప్పవచ్చు. కందుకూరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్‌పార్టీకి చెందిన ముఖ్యనాయకుడు తెరపైకి వచ్చి ఇన్‌చార్జి బాధ్యతలు తీసుకుంటారో లేక కొత్త వ్యక్తులు తెరపైకి వస్తారో వేచిచూడాల్సి ఉంది. అదేవిధంగా ఎస్‌సి రిజర్వుడు నియోజకవర్గమైన యర్రగొండపాలెం నియోజకవర్గం నుండి సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ఇన్‌చార్జిగా ఉంటారో లేక కొత్త నాయకుడు తెరపైకి వస్తారో అన్నచర్చ పార్టీశ్రేణుల నుండి వినిపిస్తొంది.
ఇదిఇలాఉండగా కనిగిరి నియోజకవర్గంపై చర్చ సాగుతుంది. గతంలో కనిగిరి నియోజకవర్గం నుండి బుర్రా మధుసూదన్‌యాదవ్ పోటీచేసి ఓటమిపాలయ్యారు. దీంతో బుర్రాను కనిగిరి నియోజకవర్గం నుండే మళ్లీ పోటీ చేయించాలా లేక కొత్తవారికి అవకాశం ఇవ్వాలా అన్న చర్చ పార్టీశ్రేణుల్లో నెలకొంది. మొత్తంమీద కనిగిరి నియోజకవర్గం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా కనిగిరికి చెందిన ఒక ముఖ్యనాయకుడితో జగన్ ఫోన్‌లో టచ్‌లో ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికైనా రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకులకు టిక్కెట్లు కేటాయించి పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీకి చెందిన నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు.