ప్రకాశం

అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జూన్ 14: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను రాష్ట్రప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో లక్షలాదిగా అగ్రిగోల్డ్‌బాధితులు పాల్గొనాలని ఆ సంఘం నాయకులు మోజేస్,జడ్సన్, నాగేశ్వరరావు,నరసయ్య, శ్రీను, ప్రసాదు తదితరులు మంగళవారం ఒకప్రకటనలో కోరారు.నాలుగులక్షల మంది ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న సమస్య ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ఎపిసిఐడి దర్యాప్తుకు ఆదేశించి 18నెలలు గడిచినప్పటికీ ఎలాంటి పురోగతి లేదన్నారు.సిఐడి అధికారులపై నమ్మకం లేక అగ్రిగోల్డ్‌కేసును సిబిఐకి అప్పగించాలని బాధితులు ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్రప్రభుత్వం వెనకడుగు వేస్తుందన్నారు. అగ్రిగోల్డ్‌సంస్థ నుండి సిఐడి అధికారులు స్వాధీనం చేసుకున్న ఖాతాదారుల వివరాలను ఆన్‌లైన్‌లో పెట్టకుండా ఖాతాదారులను ఇబ్బందిపెడుతున్నారన్నారు. డైరక్టర్లను అరెస్టుచేసి 90రోజులుకావాస్తున్న ఇంతవరకు ఏలాంటి పురోగతి లేదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు స్పందించి సిఐడిచేత సక్రమంగా విచారణ జరిపించి సమస్య పరిష్కారం అయ్యేవిధంగా చూడాలని లేని పక్షంలో బాధితుల ఆత్మహత్యలకుప్రభుత్వమే బాధ్యత వహించాల్సిఉంటుందన్నారు. ఈనెల 16తేదీన ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో లక్షలాదిగా అగ్రిగోల్డ్‌బాధితులు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.