ప్రకాశం

సిఎం పర్యటన విజయవంతం చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 17: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 22న జిల్లాకేంద్రమైన ఒంగోలుకు విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా తెలుగుదేశంపార్టీ నేతల సమన్వయకమిటీ సమావేశం శుక్రవారం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో జరిగింది. జిల్లాతెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ అధ్యక్షతన జరిగిన జిల్లా తెలుగుదేశంపార్టీ సమన్వయకమిటీ సమావేశంలో రాష్టమ్రంత్రులు రావెల కిశోర్‌బాబు, శిద్దారాఘవరావు, కలెక్టర్ సుజాతశర్మ, జిల్లాపోలీసు అధికారులతోపాటు, ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జులు, ముఖ్యనాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఈనెల 22వతేదీ ఒంగోలులో జరిగే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను విజయవంతం చేయాలని నేతలు తీర్మానించారు. ఒంగోలులో ఏర్పాటుచేయనున్న ట్రిపుల్ ఐటి కోసం యరజర్ల గ్రామప్రాంతంలోని భూములను త్వరితగతిన డినోటిఫై చేసేందుకు చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో ఏర్పాటుచేయనున్న జాతీయ పెట్టుబడులు, వౌలిక వసతుల జోన్‌ను త్వరితగతిన ఏర్పాటుచేయాలని, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఇటీవల పార్టీలో చేరిన శాసనసభ్యులు, ఆయా నియోజకవర్గాల్లోని నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీఅభివృద్ధికి తోడ్పడాలని, జిల్లాలోని దర్శి నియోజకవర్గంలోని దొనకొండ మండలంలో ఏర్పాటుచేయనున్న పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుపై నేతలు సుదీర్ఘంగా చర్చించారు.జిల్లాలోని పశ్చిమప్రాంత అభివృద్ధికి నిర్ధేశించిన వెలుగొండ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు కేటాయించి త్వరితగతిన పూర్తిచేయాలని, జిల్లాలోని రామాయపట్నం పోర్టును ఏర్పాటుచేయాలని, జిల్లాను కరవుప్రాంతంగా ప్రకటించి ప్రత్యేక నిధులు కేటాయించాలని, సరుకు రవాణా చేసేందుకు జిల్లాలోని బకింగ్‌హామ్‌కాల్వను అభివృద్ధి చేసేందుకు తక్షణమే చర్యలు తీసుకోవటంపై సుదీర్ఘంగా నేతలు చర్చించారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పార్టీలోని నేతలు అసమ్మతి గళం విప్పకుండా చర్యలు తీసుకోవాలని నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా ఈసమావేశానికి అద్దంకి నియోజకవర్గ ఇన్‌చార్జి కరణం బలరామకృష్ణమూర్తితోపాటు ఆయన తనయుడు కరణం వెంకటేష్, పర్చూరు, చీరాల, యర్రగొండపాలెం శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్‌రాజు గైర్హాజరయ్యారు. కొన్ని అనివార్యకారణాలు, సొంతపనుల వలన వారు సమావేశానికి రాలేకపోయారని మంత్రులు శిద్దా,రావెల వెల్లడించారు. కాగా జిల్లా అభివృద్ధికి సమన్వయంతో నేతలందరూ ముందుకుసాగాలని కూడా నేతలు తీర్మానించుకున్నట్లు సమాచారం. అనంతరం వైకాపా నుండి తెలుగుదేశంపార్టీలో చేరిన కందుకూరు, గిద్దలూరు, అద్దంకి శాసనసభ్యులు పోతుల రామారావు, ముత్తుమల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌కు మంత్రులు, శాసనసభ్యులు బోకేలు అందచేసి అభినందనలు తెలిపారు.