ప్రకాశం

ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు : ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో డిమాండ్ చేయనున్నట్లు ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన తరువాత రాష్ట్రంలోని ఏడు జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కాగా గుంటూరు, నెల్లూరు, కర్నూలు జిల్లాలనుండి విడిపోయి ప్రధానంగా వెనుకబడిన ప్రకాశం జిల్లాను మాత్రం వెనుకబడిన జిల్లాగా ప్రకటించకపోవటాన్ని ఆయన ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. జిల్లా ఆవిర్భావించి 47సంవత్సరాలు అవుతున్నప్పటికీ జిల్లా మాత్రం ఏమా త్రం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రకాశం జిల్లాలో ఎస్‌సి,ఎస్‌టి జనాభా ఎక్కువుగా ఉండటంతోపాటు వ్యవసా యకూలీలు కూడా అత్యధింగా ఉన్నారని అటువంటి వెనుకబడిన జిల్లాను 8వ వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేయను న్నట్లు ఆయన తెలిపారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నాయ కత్వంలో ఈవిషయంపై ప్రధానితో కలిసి చర్చించనున్నట్లు ఎంపి తెలిపారు. జిల్లాలో ప్రధానంగా తాగునీటి సమస్య జఠిలంగా ఉందని ఆ సమస్య శాశ్వతంగా తీరాలంటే వెలుగొండప్రాజెక్టు నిర్మాణ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి నెలలోనే ఒంగోలునగరంతోపాటు పశ్చిమ ప్రాంతాలైన కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు లాంటి ప్రాంతాల్లో తాగు నీటి నీటి కష్టాలను ఎదుర్కొం టున్నారన్నారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా వచ్చిన నీటితో దాహర్తిని పశ్చిమప్రాంతప్రజలు తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. 3.2టిఎంసిల సాగర్‌నీటిని వెంటనే జిల్లాకు విడుదల చేసి రామతీర్థం రిజర్వాయరుకు నింపి ఆ తరువాత ఒంగోలులోని ఎస్‌ఎస్ ట్యాంకులను నింపి నగర ప్రజలకు దాహర్తిని తీర్చాలని జిల్లా యంత్రాంగాన్ని ఆయన కోరారు. జిల్లాలోని 260 చెరువులు ఎండి పోయాయని ఈ చెరువులను కూడా నింపి గ్రామీణ ప్రజలకు నీటి సమస్యలేకుండా చూడాలన్నారు. పశ్చిమప్రాంతంలోని ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫ్లోరోసిస్ వ్యాధితో పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు కిడ్నీవ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. పొదిలిలో కిడ్ని డయాలసిస్ సెంటరును ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య తీర్చేందుకు త్వరలో ఒంగోలులో జాబ్‌మేళాను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు శిక్షణ ఇప్పించేందుకు ఒంగోలులో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఆ తరువాత మార్కా పురంలో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కాగా కాపునేత ముద్రగడ పద్మనాభం చేస్తున్న నిరాహరదీక్షపై ఆయన స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తన ఎన్నికల మ్యానిపెస్టోలో అనేక హామీలను గుప్పించారన్నారు. ఈమ్యానిఫెస్టోలో కాపులను బిసిల్లో చేరుస్తామని ఉందని, ఆహామీని నెరవేర్చకపోవటం వలనే పద్మనాభం నిరాహర దీక్ష చేస్తున్నారన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి నేరవెర్చలేదని భవిష్యత్‌లోఅంగన్‌వాడీలు, నిరుద్యోగ యువత, రుణమాఫీపై రైతులు ఆందోళన చేసే అవకాశాలున్నాయన్నారు. హైదరాబాదులో టిడిపికి ఒక్కసీటురావటంపై ఆయన స్పందిస్తూ భవిష్యత్తులో హైదరాబాదులోను ఆంధ్రాలోను ఇదే పరిస్థితి టిడిపికి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. విలేఖర్ల సమావేశంలో వైకాపా నాయకులు బత్తుల బ్రహ్మానందారెడ్డి, కెవి రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, గంగాడ సుజాత,క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రథసారధి కృష్ణారెడ్డి
జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక
ఒంగోలు అర్బన్,్ఫబ్రవరి 7: జిల్లా భారతీయ జనతాపార్టీ రథసారధిగా పులి వెంకటకృష్ణారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం స్థానిక స్వాతికల్యాణ మండపంలో జిల్లాబిజెపి అధ్యక్ష పదవికి సంబంధించి ఎన్నికల పక్రియ జరిగింది. కాగా ముందుగా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేసేందుకు 11మందితో కోర్‌కమిటీ సభ్యులు, త్రిసభ్యకమిటీ సభ్యులు మూడుగంటలకు పైగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల చీఫ్ కపిలేశ్వరయ్య, రాష్టప్రార్టీ ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, రాష్టప్రార్టీనాయకులు శ్రీనివాసరాజు, బత్తిన నరసింహరావు,దారా సాంబయ్య,జిల్లా ఇన్‌చార్జీ కందుకూరి సత్యనారాయణలు పోటీలో ఉన్న అభ్యర్ధులతో సమావేశమయ్యారు. అధ్యక్షపదవీ రేసులో ప్రధానంగా రాష్టప్రార్టీ కార్యవర్గసభ్యుడు పివి కృష్ణారెడ్డి, జిల్లాపార్టీప్రధానకార్యదర్శి రేగుల రామాంజనేయులు, ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి బొద్దులూరి ఆంజనేయులు, ఎస్‌సి మోర్చా రాష్ట్ర నాయకులు మండవ వాసుదేవ, రాష్టమ్రహిళా నాయకురాలు ఏనుగుల పద్మావతిలు ఉన్నారు. ఈసమావేశంలో ఎన్నికలు జరగకుండా అభ్యర్ధిని ఏకగ్రీవంగా చేసేందుకు రాష్ట్ర,జిల్లానాయకులు ముమ్మర కసరత్తులు చేశారు. ఒకదశలో సీనియర్ నాయకుడు మండవ వాసుదేవకు అవకాశం కల్పిద్దామని కొంతమంది నాయకులు చర్చకు తీసుకురాగా మరికొంతమంది నాయకులు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. కాని రేసులో ఉన్న కృష్ణారెడ్డిమాత్రం తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తిచేయగా పట్టించుకోకుండా నాయకులు వేరే పేరును సూచించేసమయంలో ఎన్నికలకు వెళ్తామని కృష్ణారెడ్డి పూర్తిస్ధాయిలో హెచ్చరించటంతో కొద్దిసేపు ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. 108 మంది ఓటర్లు ఉండగా అందులో 80మందికి పైగా ఓటర్లు తనకే ఓటువేస్తారని కృష్ణారెడ్డి బహిర్గతంగా చెప్పటంతో ఒక్కసారి పార్టీనేతలందరూ ఖంగుతిన్నారు. పొరపాటున ఎన్నికలకువెళ్తే మూడుగంటలపాటు జరిగిన చర్చల సారాంశం కూడా వృథా అయ్యే అవకాశాలు ఉండటంతో ఏమిలేని నిస్సహాస్ధితిలో కోర్‌కమిటి సభ్యులు కృష్ణారెడ్డి పేరును ఏకగ్రీవంగా ప్రకటించారు. ముందుగా జిల్లాలోని 56మండలాలనుండి ఓటర్లతోపాటు పార్టీనాయకులు వందల సంఖ్యలో స్వాతి కల్యాణమండపానికి చేరుకోగా ఎన్నికలు ఉత్కంఠగా జరిగే పరిస్థితి నెలకొంది. తీరా ఎన్నికలు జరగకుండా కృష్ణారెడ్డి ఏకగ్రీవం కావటంతో బిజెపినేతలు ఊపిరీపీల్చుకున్నారు. ఈసందర్భంగా పెద్దఎత్తున బాణాసంచాను పేల్చి కృష్ణారెడ్డి వర్గీయులు మిఠాయిలను పంచుకున్నారు. అనంతరం కృష్ణారెడ్డికి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామనాయకులు అభినందనలు తెలియచేశారు. ఈసందర్భంగా నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నికైన పి కృష్ణారెడ్డి విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో పార్టీని పూర్తిస్ధాయిలో బలోపేతం చేసి రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో మిత్రపక్షం తెలుగుదేశంపార్టీతోకలిసి పోటీ చేస్తామన్నారు. గతంలో ఎన్నడూ ఈవిధంగా అధ్యక్ష పదవీకి పోటీపడినదాఖలాలు లేవన్నారు. తన గెలుపుకు సహకరించిన ప్రతిఒక్కరికి ఆయన పేరుపేరున కృతజ్ఞతలు తెలియచేశారు. జిల్లాపార్టీ మాజీ అధ్యక్షుడు మువ్వల వెంకటకృష్ణారావు, జిల్లానాయకులు, యాదవసంక్షేమ సంఘం జిల్లాప్రధానకార్యదర్శి చల్లా రాజధనవర్మ, జిల్లాపార్టీనాయకులు ఈదా సుధాకరరెడ్డి, ఖలీఫ్‌తుల్లాబాషా, జయరాజ్ తదితరులు కృష్ణారెడ్డికి అభినందనలు తెలిపారు.

కేంద్ర బృందం పర్యటన
పంగులూరు, ఫిబ్రవరి 7: పంగులూరు మండలం రామకూరు గ్రామంలో ఆదివారం నేషనల్ లెవల్ మానిటింగ్ టీమ్ పర్యటించింది. ఆ గ్రామాన్ని ఎంపి శ్రీరాం మాల్యాద్రి దత్తత తీసుకున్న సందర్భంగా గ్రామంలో వివిధ ప్రభుత్వ పధకాల అమలుపై పరిశీలన చేశారు. రేషను కార్డులు, గృహనిర్మాణం, ఉపాధి హామీ పనులు, వ్యక్తిగత మరుగుదొడ్లు, తాగునీటి పధకం, రోడ్ల నిర్మాణం, విద్యుత్, వెలుగు తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించి పధకాల అమలుపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎస్టీ కాలనీలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుని వారికి ప్రభుత్వం అందిస్తున్న పధకాలు అందుతున్నాయా లేదా అంటూ వివరాల సేకరించారు. పధకాల అమలుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బృందం సభ్యులు రాజేందర్, నర్వాట్కర్, జయంత్, కునార్‌లతో మండల అధికారులు డిటి రవి, హౌసింగ్ డిఇ శ్రీహరిగోపాల్, ఇఒఆర్‌డి చిన్నయ్య, హౌసింగ్ ఎఇ సుబ్బారావు, పిఆర్ జెఇ రామకుమార్, ఆర్‌డబ్ల్యూ జెఇ బ్రహ్మయ్య, సర్పంచి త్రివేణి, ఎంపిటిసి దానయ్య, మాజీ సర్పంచ్ మానం సుబ్బారావు, నీటి సంఘం ఛైర్మన్ చెరుకూరి హరిబాబు తదితరులున్నారు.

దళితుల అభ్యున్నతే చంద్రబాబు లక్ష్యం
* ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితుల అభివృద్ధికి కృషి * జూపూడి స్పష్టం
కందుకూరు, ఫిబ్రవరి 7: నవ్యాంధ్రప్రదేశ్‌లో దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషిచేస్తున్నారని, దళితుల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించి వారి ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలను కార్యాచరణలో పెట్టడానికి ముఖ్యమంత్రే తనను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించా రని, వారి ఆశయాలకు అనుగుణంగా దళితుల అభివృద్ధికి పాటుపడతానని జూపూడి ప్రభాకర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వెంగమాంబ ఫంక్షన్ హాల్‌లో జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో దళితుల సంక్షేమం - అభివృద్ధిపై అవగాహన సదస్సు కందుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జూపూడి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్ర బాబు దళితుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారని, ప్రతి దళిత కుటుం బానికి రెండు ఎకరాల భూమిని డ్వాక్రా మహిళలకు పంపిణీ చేసే దిశగా అడు గులు వేస్తున్నారని, అంతే కాకుండా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కుల వృత్తులతోపాటు చిరు వ్యాపారం చేసే దళితులకు రుణాల మంజూరులో మధ్యవర్తులు, దళారుల ప్రమేయం, సిఫార్సులు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. తద్వారా దళితులు ఆర్ధికాభివృద్ధి పొంది తిరిగి రుణాలను బ్యాంకులకు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ కార్పొ రేషన్ ద్వారా రాష్ట్రంలో ఉన్న కోటిమంది నిరుద్యోగ దళిత యువతకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీచేసి, శిక్షణ ఇప్పించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 120 మైక్రోసాఫ్ట్ కంపెనీలను రాష్ట్రానికి పిలిపించి శిక్షణ పొందిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించి, తమ కాళ్లపై తాము నిలబడేలా కృషి చేస్తామన్నారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకుని తద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సమ ప్రాధాన్యత కల్పిస్తూ ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయాలని జూపూడిని కోరారు. టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కరణం బలరాం మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడి, వాటి ద్వారా దళితుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. మాజీ ఎమ్మెల్యే దివి శివరాం మాట్లాడుతూ వెనుకబడిన కందుకూరు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని జూపూడిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కె యానాది, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రవిచంద్ర, జిల్లా టిడిపి ఎస్సీ సెల్ అధ్యక్షులు డి సుందరరావు, కందుకూరు ఎఎంసి చైర్మన్ తల్లపనేని వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ దివి లింగయ్య నాయుడు, జడ్‌పిటిసి కంచర్ల శ్రీకాంత్, కందుకూరు టిడిపి పట్టణ అధ్యక్షులు పి వెంకటేశ్వర్లు, టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌వి సుబ్బారావు, టిడిపి మండల అధ్యక్షులు పి వంశీ, ఎంపిపి సలహాదారు జి శ్రీనివాసరావు, జిల్లా టిడిపి ఎస్సీ సెల్ కార్యదర్శి కె రత్నంరాజు, ఉలవపాడు, వివిపాలెం, లింగసముద్రం, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు ఎం నారాయణ, భాస్కర్‌రావు, డాక్టర్ చింతా సదానందం, జె నాగరాజు, ఉలవపాడు జడ్‌పిటిసి ఎం పద్మావతి, వివిపాలెం, లింగసముద్రం ఎంపిపిలు జి కల్పన, డి రమాదేవి, కందుకూరు మండల, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు టి ఆంజనేయులు, సిహెచ్ మధు, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు ఎం శ్రీని వాసరావు, కందుకూరు పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు సిహెచ్ కొం డయ్య, కందుకూరు మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు జి మోషే, ఎఎంసి డైరెక్టర్ ఆర్ మాల్యాద్రి, ఎస్సీ సెల్ ఉలవపాడు మండల అధ్యక్షులు ఆర్ రమేష్, సంజీవరావు, చిన ముసలయ్య, దారా వెంకటరావు, ఎన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొ న్నారు.

రేషను బియ్యం పట్టివేత
పర్చూరు, ఫిబ్రవరి 7: మండల పరిధిలోని అడుసుమల్లి గ్రామశివారులో విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పక్కా సమాచారంతో అక్రమంగా తరలిస్తున్న 341 బస్తాల రేషనుబియ్యాన్ని అధికారులు ఆదివారం వేకువజామున దాడిచేసి పట్టుకున్నారు. అడిషనల్ ఎస్‌పి బాల వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు అక్రమంగా తరలిస్తున్న బియ్యపు లారీని దాడి నిర్వహించి పట్టుకున్నట్లు డిఎస్‌పి ఉమామహేశ్వరరావు తెలిపారు. ఎస్సై సాంబయ్య తన సిబ్బందితో నూతలపాడు నుంచి కొత్తగూడెం మండపేటకు వెళ్తున్న టర్బోలారీలో అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పట్టుకున్నట్లు వారు తెలిపారు. లారీలో ఖాళీ గ్రోమోర్ ఎరువుల ప్లాస్టిక్ గోతాముల్లో రేషను బియ్యాన్ని నింపి ఎవరికీ అనుమానం రాకుండా టర్బో లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. లారీ డ్రైవర్ కడప జిల్లా కోరుమామిళ్లకు చెందిన రాళ్ల నవీన్‌ను విచారించగా ఈ బియ్యం నూతలపాడుకు చెందిన విన్నకోట కృష్ణారావు, చీరాలకు చెందిన షేక్ అమీన్ నుంచి బియ్యాన్ని తరలిస్తున్నట్లు అధికారులకు తెలిపాడు. పట్టుబడిన రేషను బియ్యాన్ని అధికారులు ఇంకొల్లులోని పౌరసరఫరాల శాఖ గోదాముకు తరలించినట్లు చెప్పారు. లారీ డ్రైవర్‌ను, లారీని స్థానిక స్టేషన్‌లో అప్పగించామని, పంచనామా నిర్వహించిన ఆర్‌ఐ నాగార్జున తెలిపారు.
ఇంకొల్లులో...
ఇంకొల్లు : మండలంలోని సూదివారిపాలెం గ్రామం వద్ద ఆదివారం 250 రేషను బియ్యం బస్తాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఇడుపులపాడు నుంచి సూదివారిపాలెం వైపు లారీలో వెళ్తున్న బియ్యాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డి ఎస్‌పి తన సిబ్బందితో వలపన్ని పట్టుకున్నారు. పట్టుకున్న రేషను బియ్యాన్ని ఇంకొల్లు ఆర్ ఐ శ్రీనివాసరావు గోడౌన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను, లారీని ఇంకొల్లు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై సాంబయ్య, హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.

కార్మిక పరిషత్ విజయం ఖాయం
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 7: ఈనెల 18వ తేదీన రాష్టవ్య్రాప్తంగా నిర్వహించనున్న ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో కార్మిక పరిషత్ విజయం ఖాయమని పరిషత్ రాష్ట్ర కార్యదర్శి బిఎల్‌పి రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన జోనల్ కార్యదర్శి పప్పల రాథాకృష్ణతో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. గతంలో గుర్తింపు యూనియన్‌గా పనిచేసిన ఎన్‌యంయు, ఈయులు తమలో తాము కొట్లాడుకుంటూ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని, ఆయా నేతలతో కార్మికులు 30 ఏళ్లుగా విసిగిపోయారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అండతో ఆర్టీసీ కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్‌తో పాటు విశ్రాంత కార్మికుల కుటుంబాలకు చరిత్రలో లేని రీతిలో ఉచిత బస్‌పాస్ సదుపాయాన్ని కల్పించగలిగామన్నారు. ఇదంతా తాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి కార్మికుల పక్షాన ప్రభుత్వం పనిచేయాలని కోరగా ఆయన అందుకు అనుగుణంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు వచ్చారన్నారు. అయితే ఈ ఘనకార్యం తామే చేశామంటూ ఈయు చెప్పుకోవడం వింతగా ఉందని, మూడేళ్లుగా లేని డిమాండ్ నేడు నెరవేర్చామనడం కార్మికులను మోసం చేయడమే అన్నారు. తాము విజయం సాధిస్తే ఎన్నికల హక్కులను కాపాడే విధంగా కృషిచేయడమే కాకుండా కార్మికులకు ఇళ్ల సమస్య పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు. కార్మికులు తమ పక్షానే ఉన్నారని, గుర్తింపు ఎన్నికల్లో తమకు విజయం సాధించే దిశగా వారు ఓట్లేస్తారన్నా ధీమాను వ్యక్తం చేశారు. సమావేశంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి జి.ఆర్.బాబు, ప్రతినిధులు ఎం.గుణ, చిట్టి కృష్ణారావు పాల్గొన్నారు.
గని కొండ యాత్ర గోడ పత్రిక విడుదల
గార, ఫిబ్రవరి 7: మండలం సాలిహుండాం శే్వతగిరిపై వెలసియున్న కాళీయ మర్ధన వేణుగోపాలుని తిరు కల్యాణం సందర్భంగా ఏటా జరిగే జాతర(గనికొండ జాతర) సందర్భంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సుగ్గు మధురెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జాతర గోడ పత్రిక విడుదల చేశారు. మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు గుండ భాస్కరరావు, స్థానిక సర్పంచు కొంక్యాణ ఆదినారాయణ, బోరవానిపేట సర్పంచు ప్రతినిధి బోర వెంకటరమణ మూర్తి, ధర్మకర్త మధురెడ్డి సతీమణి, వమరవల్లి ఎం.పి.టి.సి. సుగ్గు లక్ష్మీనృసింహదేవి తదితరులు చేతులు మీదుగా స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ గోడ పత్రికను విడుదల చేశారు. స్వామి వారి పరిక్రమ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్భంగా మండల పరిషత్ ప్రత్యేక ఆహ్వానితుడు భాస్కరరావు మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ధర్మకర్తగా మధురెడ్డి చేస్తున్న ప్రయత్నాన్ని కొనియాడారు. ఆలయ అభివృద్ధికి మధురెడ్డి దంపతులు ఎంతో అంకిత భావంతో కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకుడు కిషోర్, గొల్లంగి అచ్యుతరావు తదితరులు ఉన్నారు.

స్కూళ్ళు, హాస్టళ్ళు మూసివేయొద్దు
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 7: రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను, హాస్టల్స్‌ను మూసివేసే చర్యలను విరమించుకోవాలని భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్‌ఎఫ్‌ఐ) తీర్మానించింది.
ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో నిర్వహించిన జిల్లా 35వ మహాసభల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు వై.రాము మాట్లాడుతూ హాస్టల్స్‌లో విద్యార్థులకు మెస్ కాస్మొటిక్ చార్జీలను పెంచాలని విద్యార్థి లోకం డిమాండ్ చేస్తుండగా, ఉన్న హాస్టల్స్‌ను మూసివేసే చర్యలకు ప్రభుత్వం పూనుకోవడం సబబుగా లేదన్నారు. స్కాలర్ షిప్పు పెంపుదల జీవో విడుదల, డాక్టర్ అంబేద్కర్ యూనివర్శిటీకి అధిక నిధులు కేటాయించి సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. విద్యా సంస్థల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తే ప్రభుత్వ పాఠశాలలు, హాస్టల్స్ మూసివేసే పరిస్థితి రాదని ఆయన పేర్కొన్నారు. వీటినే తీర్మానం రూపంలో ప్రవేశపెట్టి అందరి సభ్యుల ఆమోదంతో తీర్మానాలను ఆమోదించినట్టు ఆయన ప్రకటించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. మహాసభ ప్రారంభానికి ముందు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్ తన సందేశాన్ని వినిపించారు. కార్యక్రమంలో ఎం.సుందరయ్య, కార్యదర్శిగా యం.కనకారావు, ఉపాధ్యక్షులుగా ఎం.సాయికుమార్, సహాయ కార్యదర్శులుగా పి.అనిల్ వర్మ, ఎల్.మోహన్‌లతో నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించారు.

హనుమ శక్తితో ధర్మప్రతిష్ఠాపన
పాతశ్రీకాకుళం, ఫిబ్రవరి 7: రామకార్యానికే హనుమంతుడు తన శక్తిని ఉపయోగించాడని, రామకార్యమంటే ధర్మప్రతిష్ఠాపనే అని రుషిపీఠం వ్యవస్థాపకుడు సామవేదం షణ్ముఖశర్మ పేర్కొన్నారు. ఉపనిషన్మందిరం 63వ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక వైఎస్‌ఆర్ కల్యాణ మండపంలో నిర్వహిస్తున్న హనుమాన్‌చాలీసా మహిమవైభవ ప్రవచనాల కార్యక్రమం ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా హనుమంతుని మహిమా వైభవంపై ప్రసంగించారు. రామకార్యమంటే ధర్మప్రతిష్ఠాపనే అని హనుమంతుడు తన శక్తిని ధర్మానికే వినియోగిస్తాడని కాబట్టి ధర్మబద్ధంగా ఉండే కోరికలను మాత్రమే హనుమంతుడు తీరుస్తాడన్నారు. భగవత్‌కథ అంటే భగవంతుని
రూపమని, దృఢమైన చిత్తంతో భగవంతుని ధ్యానిస్తే సాక్షాత్కారం అవుతాడని చెప్పడానికి హనమంతుడే నిదర్శనమన్నారు. హనుమంతుడు అంటే అభయం, ఆనందమని ఆయన చెప్పారు. హనుమాన్ చాలీసాను శ్రవణానందంతో పారాయణ చేస్తే తప్పక శ్రీరామసహిత హనుమంతుని దర్శనం సాధ్యవౌతుందని ఆయన వివరించారు. అనంతరం ఉపనిషన్మందిరం ఆధ్వర్యంలో ఆయనను దుస్సాలతో సత్కరించారు. ఛిం దత్తాత్రేయం ప్రతినిధి పేర్లబాలాజీ సువర్ణ అంగుళీకం, బంగారు ఆంజనేయ విగ్రహాన్ని షణ్ముఖశర్మకు బహూకరించారు. ప్రభుత్వ కళాశాల విశ్రాంతి ప్రిన్సిపల్ బంగార్రాజు రుషిపీఠంకు రూ.10వేలు, ఉపనిషన్మందిరానికి రూ.5వేలు విరాళంగా ప్రకటించారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, తెనే్నటి విక్రమశర్మ, విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు, దేవీ ఆశ్రమం వ్యవస్థాపక అధ్యక్షుడు తేజోమూర్తుల బాలభాస్కరశర్మ ఆయనను సత్కరించారు. ఈ కార్యక్రమంలో హనుమాస్ చాలీసాను
‘మహోదయం’ ప్రారంభం
సోంపేట, ఫిబ్రవరి 7: బారువ తీరంలో మహేంద్రనది సంగమం వద్ద మహోదయ పుణ్యకాలం ప్రకారం రాత్రి 10.17 నిముషాలకు భక్తులు భక్తిశ్రద్ధలతో సాన్నాలు ఆచరించారు. ఇటువంటి ఘడియాలు వందేళ్ళ తర్వాత రావడం వస్తుంటాయని, ఈ మహోదయంలో సాగరసంగమం వద్ద స్నానాలు చేస్తే గంగాస్నానం చేసిన ఫలితం పొందవచ్చునని వేదపండితులు చెబుతున్నారు. జ్యోతిషం ప్రకారం ఆదివారం రాత్రి 10.17 నిముషాలకు వేదపండితులు వేదమంత్రోచ్ఛారణల మధ్య సంగమం వద్ద విశేష పూజలు నిర్వహించి పుణ్యస్నానాలు ప్రారంభించారు. మహోదయం కాలంలో పితృకర్మలు, పితృతర్పణలు, దశదానాలు, షోడోషమహాదానాలు చేయడం చేస్తే స్వర్గలోకాల్లో వున్న పెద్దలకు ఆత్మశాంతి కలుగుతుందని విశ్వాసం.
ఈ మహోదయం కోటి సూర్యగ్రహాణాలతో సమానమైనదిగా జ్యోతిషులు చెబుతున్న తరుణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒడిశా బరంపురం, ఛత్రపూర్ తదితర ప్రాంతాలకు చెందిన భక్తులు సాయంత్రం 7 గంటల నుంచి తీరానికి చేరుకున్నారు. బారువ సంగమం వద్ద కోటిలింగేశ్వరాలయం, జనార్దన దేవాలయాలు వంటి ప్రాచీన ఆలయాలు ఉండడంతో ఈ సంగమం వద్ద స్నానానికి భక్తులు మక్కువ చూపారు. సోమవారం రాత్రి 9.07 నిముషాలకు మహోదయం ఉండడంతో ఈ మధ్యకాలంలో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్, టెక్కలి ఆర్డీవో వెంకటేశ్వరరావు, డిఎస్పీ దేవప్రసాద్‌లతోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ మహోదయం పుణ్యస్నానాల్లో పాల్గొని భక్తులకు ఏర్పాట్లును పర్యవేక్షించారు.
పాతదిబ్బలపాలెం వద్ద...
ఎచ్చెర్ల: మండలంలోని నాగావళి నదీ సముద్రంలో కలిసిన సంగమం ప్రదేశంలో మహోదయ పవిత్ర స్నానాలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధంచేశారు. బొంతలకోడూరు గ్రామపంచాయతీ పాతదిబ్బలపాలెం సమీపాన పవిత్ర స్నానాలు భక్తులు ఆచరించేందుకు తాత్కాలిక వసతులు సమకూర్చారు. మహిళలు దుస్తులు మార్చుకునేందుకు నాగార్జున్ ఆగ్రికమ్ పరిశ్రమ తాత్కాలిక గదులను నిర్మించింది. అలాగే మంచినీరు, పులిహార పొట్లాలు అందించేందుకు అందించేందుకు స్వచ్ఛందసంస్థలకు బాధ్యతలు అప్పగించారు. ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకటరావు, జెడ్పి చైర్ పర్సన్ చౌదరి ధనలక్ష్మి దంపతులు ఈ మహోదయాన్ని ఉదయం 6గంటలకు ప్రారంభించనున్నారు. స్నానాలకు విచ్చేసిన భక్తులకు 10 బస్సులు సమకూర్చినట్టు అధికారులు స్పష్టంచేశారు. అలాగే ప్రమాదాలు సంభవింకుండా నాలుగు బోటులు, 24మంది గజ ఈతగాళ్లను సమకూర్చారు. పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను తహశీల్దార్ బందరు వెంకటరావు, ఎంపిడివో రాధ తదితర అధికారులు సమీక్షిస్తున్నారు.
ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎమ్మెల్యే
గార: సోమవారం నాటి మహోదయం పుణ్య స్నానాలకు గాను కె.మత్స్యలేశం ప్రాంతంలో నదీ సాగర సంగమం, శ్రీకూర్మం మత్స్యలేశం ప్రాంతంలో జరిగే సముద్ర స్నానాలకు చేపట్టే ఏర్పాట్లును కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం, స్థానిక ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిలు ఆదివారం వేర్వేరు సందర్భాల్లో పరిశీలించారు. శ్రీకూర్మం మత్స్యలేశం ప్రాంతంలో సముద్ర స్నానాలు జరిగే ప్రాంతంలో చేపట్టే ఏర్పాట్లును కలెక్టరు పరిశీలించారు. స్నానాలు ఆచరించే మహిళా భక్తులు బట్టలు మార్చుకునేందుకు వీలుగా చేపట్టే ఏర్పాట్లుతో పాటు విచారణా కేంద్రం, ఆరోగ్య శిభిరం, మంచినీరు తదితర ఏర్పాట్లును పరిశీలించారు. అలాగే కళింగపట్నం-మత్స్యలేశం ప్రాంతంలో నదీ సాగర సంగమం ప్రాంతంతో పాటు సముద్ర స్నానాలు జరిగే ప్రాంతంలో కూడా ఏర్పాట్లును పరిశీలించారు.
పకడ్బందీగా మహోదయం
మహోదయం పుణ్య స్నానాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లును పకడ్బందీగా చేపట్టాలని శ్రీకాకుళం ఆర్డీఓ. బలివాడ దయానిధి తెలిపారు. మేజర్ పంచాయతీ శ్రీకూర్మం ప్రాంతంలోని మత్స్యలేశం, కళింగపట్నం-మత్స్యలేశం ప్రాంతాల్లో భక్తులు స్నానాలు ఆచరించే ప్రాంతాలను పునఃపరిశీలన చేశారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులతో ఆర్డీఓ. దయానిధి మాట్లాడుతూ మహోదయం ఏర్పాట్లుకు సంబంధించి ఎటు వంటి తప్పిదాలకు అవకాశం ఇవ్వకుండా నిబద్ధతగా వ్యవహరించాల్సి ఉందన్నారు. స్నానాలు సందర్భంగా భక్తులు లోతట్టు ప్రాంతంలోకి వెళ్లకుండా ఉండే విధంగా హెచ్చరికలు, నీటిలో ప్రమాదాలు నివారించే దిశగా ఈతగాళ్లు చర్యలు, వాహనాలు రాకపోకలు నియంత్రణ తదితర అంశాలుతో పాటు మంచినీరు, వైద్య శిబిరాలు నిర్వహణ వంటి అంశాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈయన వెంట తహశీల్దారు సింహాచలం, ఎం.పి.డి.ఓ. స్వరూపరాణి, తహశీల్దారు కార్యాలయం సూపరింటెండెంట్ చక్రవర్తి, ఆర్.ఐ రామక్రిష్ణ, స్థానిక సర్పంచు మైలపల్లి లక్ష్మీజనార్ధన్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు యల్లాయమ్మ తదితరులు ఉన్నారు.
సారారహిత జిల్లా కోసం..
నవోదయం
ఆంధ్రభూమి బ్యూరో-శ్రీకాకుళం
అనగనగా ఓ తాగుబోతు మందు దొరక్క అలమటిస్తూ ఓ చెరువు ఒడ్డున కూలబడి ‘ఏ అమ్మోరికైనా దయవచ్చి ఈ చెరువులో నీటిని సారాగా మార్చితే కడుపునిండా తాగేసి హాయిగా అమ్మోరికి బలి అయిపోతాను కదా’ అనుకున్నాడు. ఆ మొక్కును నిజంగానే ఓ దేవత ఆలకించి, చెరవునంతా సారాతో నింపింది. అతగాడు ఆవురావుమంటూ పొట్ట పగిలేంతగా దోసిళ్లితో సారా పట్టించి తృప్తిగా త్రేన్చాక ‘్భక్తా! నీ కోరిక తీర్చానుగదా! మరి అన్నమాట ప్రకారం చచ్చిపో’ అని అమ్మోరు ఆడిగింది. మందు సారాప్రియుడు జాలిగా నవ్వి ‘తాగుబోతు మాటను ఎలా నమ్మావు తల్లీ’ అని తూలుతూ ఊగుతూ చక్కాపోయాడు!
పై కథలో తాగుబోతుమాటలాగే కొనే్నళ్ళుగా అబ్కారీశాఖ సారారహిత జిల్లాగా మార్చేస్తామని, సారా తయారీ కేంద్రాలపై ఉక్కుపాదం మోపామని, తయారు చేసినవారిని లాకప్‌లో పెట్టామని, బెల్లం అమ్మిన షావుకారి నుంచి, మంటకు కట్టెలు కొట్టిన కూలీ వరకూ అందరినీ నిందితులుగా చూపించే ఎక్సైజ్ ఉన్నతాధికారులు వందరోజుల్లో సారారహిత జిల్లాగా మార్చేందుకు నడుంబిగించారు.
అబ్కారీ డైరక్టర్ చంద్రశేఖనాయుడు ఆదివారం అరసవల్లి ఆదిత్యుని దర్శినానికి వచ్చి సారారహిత ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తామని ప్రకటించారు. అదీ.. శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. సారారహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సోమవారం ‘నవోదయం’ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని వెల్లడించారు. ఇటీవల ఒడిశా-ఆంధ్రా ప్రభుత్వాలు, అందులో ఎక్సైజ్ ఉన్నతాధికారులు కలిసి ఏర్పాటు చేసిన సమావేశం నివేదికల అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌లో ‘నవోదయం’ కార్యక్రమం ద్వారా సారారహిత ఆంధ్రాగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని విలేఖరులకు ఆయన చెప్పిన కొద్దిగంటలకే జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సురేంద్ర ప్రసాద్ ముందుగా సీతంపేట మండలంలో గల అత్యంత రిస్కూ సారా కేంద్రాలకు ముందుగా తాళాలు వేసేందుకు చర్యలు చేపడుతున్నామని ‘ఆంధ్రభూమి’కి చెప్పారు.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నవోదయం కార్యక్రమానికి సోమవారం సాయంత్రం స్థానిక మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకారం చుడతారన్నారు. మంగళవారం సీతంపేట ఐ.టి.డి.ఎ. పరిధిలో ఎక్సైజ్, పోలీసు,
రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో సారా తయారీ, అమ్మకందారులను చైతన్యపరుస్తామన్నారు. వారి ఉపాధి కోసం పునరావాసం కల్పిస్తామని, కౌన్సిలింగ్‌లతో వారిలో మార్పు తీసుకువస్తామన్న ప్రణాళికను వివరించారు. కానీ, వారంతా సారా తయారే వృత్తిగా, అక్రమార్జనే ప్రధానంగా కన్పిస్తే పి.డి.యాక్టు అమలు చేస్తూ కటకటాల వెనక్కి నెట్టేస్తామంటూ పేర్కొన్నారు. నయానోభయానో గిరిజనగూడల్లో సారా ముందుగా మాన్పించేందుకు చర్యలు పటిష్ఠంగా తీసుకుంటున్న ఎక్సైజ్‌శాఖ వందరోజుల తర్వాత సారారహిత శ్రీకాకుళం జిల్లా కోసం నవోదయం చూసేఅవకాశం ఉంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది.
వందరోజుల కార్యక్రమంగా చేపడుతున్న ‘నవోదయం’లో మద్యం మత్తులో తేలుతున్న గ్రామాల్లో వివిధ శాఖల అధికారులతో నియమితమైన బృందాలు నాటుసారపై ప్రజలకు అవగాహన కల్పించనున్నాయి. ఈ మేరకు అబ్కారీశాఖ డిప్యూటీ కమిషనర్ పి.సురేందర్‌ప్రసాద్ కార్యక్రమం గూర్చి వివరించనున్నారు. జిల్లాలో 109 గ్రామాలను మద్యం తీవ్రంగా ఉన్న గ్రామాలుగా అబ్కారీశాఖ రికార్డుల్లో ఉన్నాయి. అందులో ఏ కేటగిరిలో 18, బి కేటగిరిలో 45, సి కేటగిరిలో46 గ్రామాలు ఉన్నాయి. పోస్టర్లు, బ్యానర్లు విడుదల చేసి సారాప్రియుల్లో చైతన్యం కల్పిస్తారు. గిరిజన ప్రాంతాల్లో కొంతమేరక అధికంగా సారా తయారీకేంద్రాలు ఉండడంతో అక్కడ నుంచే నవోదయం కోసం ప్రజాచైతన్య సదస్సులు ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సారారహిత ఆంధ్రప్రదేశ్‌గా చేయుటకు కృతనిశ్చయంతో ఉండడంతో సారాప్రియులకు అవగాహన కల్పించడం.
సారా తయారీదారులపై అవసరమైతే బైండోవర్ కేసులు నమోదు చేయడం, గ్రామంలో మద్యం సంపూర్ణగా నిషేధం జరిగినట్టు గ్రామ కమిటీ నిర్థారిస్తే ఆ గ్రామాన్ని మద్యరహిత గ్రామంగా జిల్లా యంత్రాంగం ప్రకటించి నిధులు అధికంగా మంజూరు చేయడం వంటి అడుగులు యంత్రాంగం వేయనుంది. ఈ మహోత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సారారహిత జిల్లాగా చేసి ఆదర్శ జిల్లాగా నిలపాలన్నదే అబ్కారీశాఖ అత్యంత విశ్వసనీయమైన ఆశ! దశాబ్దాలుగా ఈ లక్ష్యాన్ని చేరుకోలేని అబ్కారీశాఖ వందరోజుల్లో లక్ష్యం పూర్తిచేసేందుకు పట్టుదలతో పరుగులు తీసేందుకు సంసిద్ధమయ్యింది!
రాష్ట్ర మహాసభలకు
ఉద్యోగులంతా తరలిరండి
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 7: జిల్లాలో ఈనెల 12, 13 తేదీల్లో ఎచ్చెర్ల శివానీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించే ఎన్జీవో సంఘం 19వ రాష్ట్ర మహాసభలకు జిల్లాలోని ఉద్యోగులంతా తరలిరావాలని ఎన్జీవో సంఘం కార్యవర్గం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్జీవో సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ భేటిలో సంఘం రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు సాయిరాం, ఆర్.వి.యన్.శర్మలు మాట్లాడుతూ సభా ప్రాంగణంలో పనులు జోరందుకున్నాయన్నారు. ఆయా కార్యచరణ ఏర్పాట్లలో నిర్వాహక కమిటీలు పనిచేస్తున్నాయని, వేదిక నిర్మాణం, ఖాదీ, డ్వాక్రా, గిరిజన ఉత్పత్తులకు సంబంధించి స్టాళ్ల ఏర్పాటుకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయన్నారు. అదేవిధంగా మహాసభలకు సంబంధించి పదివేల గోడపత్రికలను ముద్రించి, అన్ని మండలాలకు పంపించినట్లు తెలిపారు. సభను ఈనెల 12న మద్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని, ప్రతి ఉద్యోగి దీనిని తమ ఇంటి పండుగలా భావించి విజయవంతం చేయాలని అన్నారు. రాష్ట్ర మహాసభలు జిల్లాలో నిర్వహించడం ఆనందంగా ఉందని, వేడుకలను జిల్లా చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోయేలా సంఘసభ్యులంతా నిర్వహణకు కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సభల్లో ఉద్యోగులకు సంబంధించి ప్రధాన డిమాండ్లైన డిఎ చెల్లింపు, హెల్త్ కార్డుల జారీకి సంబంధించి ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసి సంబంధిత ఉత్తర్వులు విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. 13 ఏళ్లుగా రెగ్యులరైజేషన్ కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు వారి ఆకాంక్షకు అనుగుణంగా సిక్కోలు సభలో సియం ప్రకటిస్తారన్న నమ్మకం తమకుందని అన్నారు.

నీటి ఎద్దడిపై దృష్టిసారించండి
శ్రీకాకుళం(టౌన్), ఫిబ్రవరి 7: జిల్లాలో పలు మండలాల్లో ఇప్పటికే నీటి ఎద్దడి నెలకొందని, అది తీవ్రరూపం దాల్చకముందే అధికారులు స్పందించి ముందస్తు చర్యలపై దృష్టిసారించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి పేర్కొన్నారు. ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ సీతంపేట, భామిని, వీరఘట్టాం, మెలియాపుట్టి, సంతకవిటి, రాజాం, జి.సిగడాం, ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, నరసన్నపేట, టెక్కలి, నందిగాం, మందస, పలాస, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి తదితర మండలాల్లోని ప్రజలు చలమల ద్వారా మంచినీటిని సేకరించి వినియోగిస్తున్నారని ఆందోళన వ్యక్తం