ప్రకాశం

జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జూలై 7: జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమని మాజీ ఎమ్మెల్యే గాదె వెంకటరెడ్డి తెలిపారు. పర్చూరు లోని కార్యాలయంలో గురువారం విలేఖరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. ఇందులో వ్యక్తిగత కారణాల వల్ల అర్హులకు అందాల్సిన సంక్షేమ పధకాలు అందడం లేదన్నారు. సంక్షేమ పధకాలు ఏవైనా జన్మభూమి కమిటీతో సంబంధం లేకుండా అధికారులే నిర్ణయం తీసుకుని అర్హులకు న్యాయం చేయాలన్నారు. రేషన్ పంపిణీ విషయంలో వేలిముద్రలు సరిగా పడడం లేదని అర్హుల పేర్లు తొలగిస్తున్నారన్నారు. ఇది సరైన పద్దతి కాదని, వేలిముద్రలు పడని వారిని ఇందులో మినహాయించి పౌర సరఫరా సరుకులు అర్హులందరికీ పంపిణీ చేయాలని కోరారు. జన్మభూమి కమిటీ అనాలోచిత నిర్ణయాల వల్ల పార్టీ అప్రతిష్ట పాలవుతుందని సూచించారు. హైకోర్టు ఏర్పాటు విషయం లోనూ, న్యాయమూర్తుల నియామకం లాంటి విషయాల్లో న్యాయవాదులు రోడ్డెక్కడం సరైన పద్ధతి కాదన్నారు. హైకోర్టు ఏర్పాటు విషయం రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశమని తెలిపారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో హైకోర్టు ఏర్పాటు కోరిక సమంజసమన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని హైకోర్టు ఏర్పాటు వివాదానికి తెరదించాలని కోరారు. ఐఎఎస్‌లు, ఐపిఎస్‌లు, ఐఆర్‌ఎస్‌లు దేశంలోని ఏ రాష్ట్రం వారైనా ఎక్కడైనా వారు పని చేసే హక్కు వారికుందని తెలిపారు. ఆర్థిక సమస్య మన రాష్ట్రానికి ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు హైకోర్టు ఏర్పాటు చేయడం కష్టమైన పని అని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో న్యాయవాది పి సురేష్ పాల్గొన్నారు.