ప్రకాశం

మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డికి అక్కడ.. ఇక్కడ భంగపాటే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జూలై 10: గిద్దలూరు నియోజకవర్గంలో దీర్ఘకాల రాజకీయ కుటుంబానికి అటు తెలుగుదేశంలో, ఇటు వైఎస్‌ఆర్‌సిపిలో భంగపాటు తప్పలేదు. మాజీ ఎమ్మెల్యే పిడతల సాయికల్పనారెడ్డి 2014 ఎన్నికల్లో టిక్కెట్టు రాకపోవడంతో మనస్థాపానికి గురై వైఎస్‌ఆర్‌సిపికి మద్దతు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ముత్తుముల అశోక్‌రెడ్డి ఆ పార్టీకి జలక్ ఇచ్చి టిడిపి తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలు తనకు కాని, తన కుమారుడు అభిషేక్‌రెడ్డికి కానీ దక్కుతుందని ఎంతగానో ఆశించారు. అయితే చివరకు టిడిపిలో క్రియాశీలకంగా ఉన్న ఐవిరెడ్డి చివరకు ఆ పదవిని తన్నుకుపోవడంతో పిడతల కుటుంబానికి అటు టిడిపిలో, ఇటు వైఎస్‌ఆర్‌సిపిలో భంగపాటు తప్పలేదు. మామ పిడతల రంగారెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉండి అనంతరం భర్త పిడతల విజయకుమార్‌రెడ్డి టిడిపి తరపున ఎన్నికై అర్థాంతరంగా మృతిచెందడంతో ఉప ఎన్నికల్లో సాయికల్పనారెడ్డి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం జరిగిన ఎన్నికల నుంచి ఆ కుటుంబానికి ఎదురుదెబ్బలు తగులుతూనే వచ్చాయి. 2009లో టిడిపి టిక్కెట్టు లభిస్తుందని ఆశించినప్పటికీ చివరి నిమిషంలో కంభంకు చెందిన చేగిరెడ్డి లింగారెడ్డిని వరించడంతో పిఆర్‌పిలో చేరి ఒంగోలు ఎంపిగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇదిలాఉంటే యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవి దక్కుతుందని సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఆశించారు. అలాగే ఆ నియోజకవర్గ కార్యకర్తలు కూడా ఆయన రాకను స్వాగతించారు. చివరి నిమిషంలో వైఎస్‌ఆర్‌సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆ ఆశలపై నీళ్ళు జల్లుతూ వైపాలెం ఎంపిపి చేదూరి విజయభాస్కర్‌ను ఇన్‌ఛార్జిగా నియమించారు. కాగా, ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సిపి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గడపగడపకు వైఎస్‌ఆర్‌సిపి కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే సురేష్ దూరంగా ఉండటం విశేషం. ఈ పరిస్థితులను గమనించిన రాజకీయ విశే్లషకులు ఆయన టిడిపి వైపు మొగ్గుచూపుతారా అన్న దానిపై చర్చించుకుంటున్నారు.