ప్రకాశం

మంత్రివర్గ విస్తరణలో జిల్లా నేతలకు చోటుదక్కేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 21 : రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రకాశం జిల్లా నుంచి రానున్న మంత్రివర్గ విస్తరణలో మరొక శాసనసభ్యుడికి లేదా శాసనమండలి సభ్యుడికి చోటుదక్కుతుందో లేదో అనేది చర్చనీయాంశమైంది. త్వరలో మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని ముఖ్యమంత్రి స్వయానా ప్రకటించడంతో జిల్లాలోని నేతలకు ఆశలు చిగురించాయి. ఇప్పటివరకు దర్శి నియోజకవర్గ శాసనసభ్యుడిగా వ్యవహరిస్తున్న శిద్దా రాఘవరావుకు రెండు ప్రధానశాఖలైన రవాణా, ఆర్‌అండ్‌బి శాఖలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జోడుపదవులను సమర్ధవంతంగా నడుపుతూ శిద్దా ముందుకు వెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో మరో ముగ్గురికి మంత్రి పదవులు వస్తాయని ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పటంతో జిల్లాలోని మరొకరికి మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా ఒంగోలు శాసనసభ్యుడు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిలో ఒకరికి జిల్లా నుంచి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌కు కేంద్ర బిజెపి ప్రభుత్వంలో కీలకనేతగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దామచర్ల కుటుంబంతో వెంకయ్యనాయుడుకు బంధుత్వం ఉండటంతో ఆయనకు ప్లస్‌గా మారిందనే చెప్పవచ్చు. మొదటివిడతలోనే దామచర్లకు మంత్రివర్గంలో చోటుదక్కాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయినట్లు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీని తన భుజాలపై మోసి పార్టీని బలోపేతం చేసిన ఘనత దామచర్లకే దక్కుతుంది. జిల్లా పార్టీ కార్యాలయాన్ని సైతం కోట్లాది రూపాయల విలువైన తన సొంత స్థలంలోనే నిర్మించారు. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద దామచర్లకు ప్లస్‌పాయింట్లు ఎక్కువగా ఉన్నాయనే చెప్పవచ్చు. జనార్దన్ తాత దామచర్ల ఆంజనేయులు కూడా చంద్రబాబు క్యాబినెట్‌లో రాష్టమ్రంత్రిగా పనిచేశారు. కాగా రానున్న ఒంగోలు నగర కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే నగర ప్రజల సమస్యలపై దామచర్ల దృష్టి సారించి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. మునిసిపల్, రెవెన్యూ అధికారులను తనవెంట పెట్టుకుని సమస్యలను పరిష్కరిస్తుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొత్తంమీద రానున్న మంత్రివర్గ విస్తరణలో దామచర్లకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. అదేవిధంగా జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. జిల్లాలోని అన్నివర్గాలకు అందరివాడిగా పేరుగాంచిన మాగుంట పేరును కూడా ముఖ్యమంత్రి ప్రకటించే అవకాశం ఉంది. జిల్లాలోని తెలుగు తమ్ముళ్లతో ఆయన సఖ్యత కొనసాగిస్తున్నారు. మొత్తంమీద వీరిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.