ప్రకాశం

‘పొలంపిలుస్తోంది’పై విస్తృత ప్రచారం కల్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 22 : జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు అభివృద్ధి సాధించే విధంగా పొలం పిలుస్తోంది కార్యక్రమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపివో సమావేశ మందిరంలో జిల్లా స్థాయి వ్యవసాయ విస్తరణలో మాస్ మీడియా పాత్రపై , ఆహార భద్రత మిషన్, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పధకాలపై జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుజాత శర్మ మాట్లాడుతూ జిల్లాలో అపారమైన వనరులు, మత్స్య సంపద, పశు సంపదలు ఉన్నాయన్నారు. వ్యవసాయంలో ఆదునిక పద్దతులపై శిక్షణ ఇచ్చి మంది దిగుబడులు సాధించేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వ్యవసాయ విస్తరణ పై రైతులకు తెలియజేయడానికి వ్యవసాయ అనుబంధశాఖలు షెడ్యూల్ తయారు చేసుకొని తేదీలవారీగా సమగ్ర కార్యక్రమాలపై ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్‌ల ద్వారా రైతులను ప్రోత్సహించాలన్నారు. గత సమావేశంలో వ్యవసాయ శాఖ అనుబంధ రంగాల శాఖ అధికారులను ఆదేశించినప్పటికీ ఇంత వరకు శాఖలకు సంబంధించిన కార్యక్రమాలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పంటల బీమా పథకం గురించి ప్రతి మంగళ, బుధవారాల్లో జరిగే పొలం పిలుస్తోంది కార్యక్రమంలో రైతులకు తెలియజేయాలన్నారు. వ్యవసాయ రంగాలలో పంటలపై బ్యాంకు రుణాలు పొందిన వారు, పొందని వారు కూడా తప్పకుండా పంటలను ప్రధాన మంత్రి ఫసల్ బీమా తప్పకుండా చేయాలన్నారు. వ్యవసాయంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో పంటలు దెబ్బతిన్నప్పుడు ఈ బీమా పథకం ద్వారా రైతులకు నష్ట పరిహారం అందించడం జరుగుతుందన్నారు. పునర్ నిర్మించిన వాతావరణ ఆధారిత పంట బీమా పథకం ఖరీఫ్ 2016, ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వం, భారతదేశ ప్రభుత్వం ద్వారా అమలుచేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఆహార భద్రత మిషన్ 2016 ప్రణాళికలను కలెక్టర్ ఆమోదించారు. జిల్లాలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు పప్పు్ధన్యాల దిగుబడులు సాధించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్‌లో వందశాతం, రబీలో 90 శాతం లక్ష్యాలను సాధించామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ -2 ఐ ప్రకాష్‌కుమార్,జిల్లా రెవిన్యూ అధికారి నూర్‌బాషా ఖాశీం, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీ కృష్ణ, ఉద్యానవన శాఖ ఎడి హరి ప్రసాద్ , నాబార్డు ఎజియం జ్యోతి శ్రీనివాస్, సిండికేట్ బ్యాంకు ఎల్‌డియం నరసింహారావు పాల్గొన్నారు.