ప్రకాశం

‘డెంగ్యూ జ్వరం పట్ల అప్రమత్తంగా ఉండాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, జూలై 26 : ప్రస్తుత సీజన్‌లో డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యుడు పవన్‌కుమార్ సూచించారు. శ్రీకామాక్షి కేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గాంధీనగర్ పంచాయతీ రామకృష్ణానగర్‌లో మంగళవారం డెంగ్యూ వ్యాధిపై ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ జ్వరం వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పూల కుండీలు, పాత టైర్లు, ఖాళీ డబ్బాలు తదితర వాటిలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. 100 నుంచి 105 డిగ్రీల జ్వరం, తీవ్రమైన తలనొప్పి, నడుం కింది భాగంలో నొప్పి, కళ్ల మంటలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స తీసుకోవాలని సూచించారు. అనంతరం 115 మంది రోగులను పరీక్షించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాతా సుబ్బారావు, ఆసుపత్రి ఎండి తాడివలస దేవరాజు, వైద్యుడు వై రవితేజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.