ప్రకాశం

రానున్న సీజన్‌లో బోర్డు అనుమతి మేరకే పొగాకు పంట సాగుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 28: రానున్న 2016-17 సంవత్సరానికి పొగాకుబోర్డు అనుమతి ఇచ్చిన మేరకే రైతులు పొగాకు పంటను సాగుచేసుకుని ఆదాయాన్ని పొందాలని బోర్డు ఇడి సిఎస్ పట్నాయక్ రైతులకు సూచించారు. గురువారం ఒంగోలు రెండవ పొగాకుబోర్డు వేలం కేంద్రం ముగింపు కార్యక్రమం సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే విషయంపై పొగాకు వ్యాపార సంస్థలతో పలు దఫాలుగా చర్చించినట్లు తెలిపారు. దీంతో పొగాకుకు మంచిధరలు రావటంతోపాటు ప్రశాంతంగా వేలం కేంద్రాలు ముగిసాయని చెప్పారు. ఈ ఏడాది పొగాకు బోర్డు రాష్ట్రంలోని రైతులకు 122 మిలియన్ల కేజిల పొగాకు పంటను ఉత్పత్తిచేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 123 మిలియన్ల కేజిల వరకు ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. బోర్డు ఇచ్చిన లక్ష్యంకంటే రైతులు కేవలం ఒక్క మిలియన్ కేజిల పొగాకును మాత్రమే రాష్ట్రంలో అదనంగా ఉత్పత్తిచేసినట్లు తెలిపారు. పొగాకుబోర్డుసూచనలను రైతులు పాటించి సహకరించినందుకు ఆయన రైతులకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది కూడా బోర్డు ఇచ్చిన మేరకు పొగాకుపంటను ఉత్పత్తిచేసి రైతులు ఆదాయాన్ని పొందాలని, అదనంగా పొగాకు ఉత్పత్తిచేస్తే రైతులు నష్టపోతారని ఆయన సూచించారు. బోర్డు విస్తరణాధికారి డిఎస్ మిత్రా మాట్లాడుతూ పొగాకుపంటకు ప్రస్తుతం గడ్డుసమస్య వచ్చిందన్నారు. పొగాకు సాగు చేసేందుకు ప్రస్తుతం కూలీలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిందన్నారు. పొగాకురైతులు ఆలోచించి పంటను సాగు చేయాలని, ఆదనంగా పొగాకు పంటను సాగుచేస్తే రైతులు నష్టపోయేప్రమాదం ఉందన్నారు. మల్లె ఎక్కువుగా ఉండే పొగతోటల్లో రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ ఏడాది పొగాకు పంటలో పురుగుమందు అవశేషాలు తక్కువుగా ఉండేలా రైతులు నాణ్యమైన పొగాకుపంటను ఉత్పత్తిచేశారని, దీంతో పొగాకు ఎగుమతుల్లో వ్యాపారులు మన రాష్ట్రంలో పండించిన పొగాకును ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చారని తెలిపారు. బోర్డు వేలం నిర్వాహణాధికారి రవికుమార్ మాట్లాడుతూ పొగాకు పంటను ఈ ఏడాది రైతులు ఆదనపుఖర్చును వెచ్చించి సాగుచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే పొగాకు రైతులకు ఈ ఏడాది కొంతమేరకు గిట్టుబాటు ధరలు వచ్చినప్పటికి రైతులు ఆశించిన మేర ధరలు రాలేదన్నారు. పొగాకు పంటను బోర్డు ఇచ్చే లక్ష్యంమేరకు ఉత్పత్తిచేయాలన్నారు. రైతులు శనగ, మిర్చి పంటలను కూడా పొగాకుకు ప్రత్యామ్నాయ పంటగా సాగుచేస్తున్నారని, ఇది కొంతమేరకు మంచి పద్ధతి అయినప్పటికి పొగాకు పంటలాగా అనుమతి లేని పంటలు అయినందున రైతులునష్టపోయే ప్రమాదం ఉందని, ఆలోచించి పంటలను సాగుచేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రెండవపొగాకుబోర్డు వేలంకేంద్రంలో వనం-మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించటంతోపాటు పొగాకు బోర్డు ఇడి పట్నాయక్‌తోపాటు పలువురు పొగాకు వేలంకేంద్రం వద్ద ర్యాలీలో పాల్గొని అనంతరం వేలం కేంద్రంలో మొక్కలు నాటారు. ఈ సమావేశం, వనం-మనం కార్యక్రమంలో పొగాకు బోర్డు ఆర్‌ఎం రత్నసాగర్, రిటైర్డు ఆర్‌ఎం భాస్కరరెడ్డి, ఐటిసి లీఫ్ మేనేజరు సాయిరెడ్డి, జిపిఐ ప్రతినిధి ప్రభాకర్, వివిధ రైతుసంఘాల నాయకులు పమ్మిభద్రిరెడ్డి, పోతుల నరసింహరావు, వడ్డెళ్ల ప్రసాదు, యర్రంనేని వెంకటశేషయ్య, స్థానిక వేలం కేంద్రం నిర్వాహణాధికారి చంద్రశేఖరరావు పాల్గొన్నారు.