ప్రకాశం

జిల్లాలో పరిశ్రమల స్థాపనకు దస్త్రాలను తక్షణమే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 29:జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సంబంధించి దస్త్రాలను తక్షణమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యదర్శి సాయిప్రసాదు జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, కమిషనర్ కార్తికేయమిశ్రా, ఎపిఐఐసి ఎండి శ్రీ్ధర్‌తో కలిసి పరిశ్రమలు నెలకొల్పే విషయంపై జిల్లాకలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలవారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా సాయిప్రసాదు మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందుకోసం అవసరమైన భూములను గుర్తించి సంబంధిత దస్త్రాలను సత్వరమే చర్యల నిమిత్తం ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ సందర్భంగా జిల్లాకలెక్టర్ సుజాతశర్మ దర్శి తహశీల్దార్ కార్యాలయం నుండి పాల్గొని మాట్లాడుతూ దొనకొండ మండలంలో 25,886 ఎకరాలు పరిశ్రమల కోసం గుర్తించామన్నారు. అందులో ప్రభుత్వ భూమితోపాటు పట్టా, అసైన్డ్ భూములన్నాయన్నారు. అందులో 12698 ఎకరాలు ప్రభుత్వ భూములన్నాయని, వాటిలో 2400 ఎకరాలను ఇప్పటికే ఎపిఐఐసికి అప్పగించామన్నారు. మరో 2800 ఎకరాలకు సంబంధించిన ప్రతిపాదనలను అనుమతికోసం భూపరిపాలన ముఖ్యకమిషనర్‌కు పంపించామన్నారు. 5200 ఎకరాల భూములను బ్లాకులుగా తయారుచేసేందుకు ఎపిఐఐసిని కోరామన్నారు. చినగంజాంలో ఐదువందల ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకోసం గుర్తించామన్నారు. మద్దిపాడు మండలం అన్నంగిలో గ్రోత్‌సెంటరు దగ్గర 87ఎకరాలు గుర్తించామని అది మైనింగ్ చట్టం కింద నోటిఫై అయిందని దానిని డీనోటిఫై చేయాల్సి ఉందన్నారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లోజిల్లానుండి ఒంగోలు, కందుకూరు ఆర్‌డిఒలు తదితరులు పాల్గొన్నారు.