ప్రకాశం

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు జలకళ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, ఆగస్టు 7: శ్రీశైల జలాశయం నీటితో కళకళలాడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. గత ఏడాది తీవ్ర వర్షాభావంతో జలాశయాలకు నీరురాక, పంటలు పండక కరవును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కర్ణాటక, మహారాష్టల్రో కురిసిన వర్షాల కారణంగా 805 అడుగుల్లో ఉన్న నీరు ఆదివారం సాయంత్రానికి 860 అడుగులకు చేరుకోవడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మరో 24 అడుగులు పెరిగితే పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరనుండటంతో రైతులు నీరు సాగర్‌కాలువకు వస్తాయని ఆశించి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పైనుంచి శ్రీశైల జలాశయానికి 75వేల క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయానికి 885 అడుగులు చేరే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం సాగర్ జలాశయానికి 16వేల 470 క్యూసెక్కుల నీరు చేరుతుండటంతో ఈ ఏడాది కరవు నుంచి బయటపడతామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉంటే మెట్టప్రాంత రైతులు మాత్రం వర్షం కోసం ఆకాశంవైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల కొద్దిపాటి వర్షం కురిసినప్పటికీ భూములు పదునెక్కకపోవడంతో పంటలు సాగుచేయలేకపోయారు. గతంలో ఇదేవిధంగా ఊరించి తొలకరి జల్లులు పడినప్పటికీ అనంతరం వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.