ప్రకాశం

పుష్కర భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం టౌన్, ఆగస్టు 9: కృష్ణా మహా పుష్కరాల సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రత్యేక ప్యాకేజిలతో వివిధ పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు మార్కాపురం డిపో మేనేజర్ ఎఎస్ నరసింహులు వెల్లడించారు. స్థానిక ఆర్టీసీ డిపోలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12 నుంచి 23వతేదీ వరకు కృష్ణా పుష్కరాలు జరుగుతున్న దృష్ట్యా ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు పుణ్యక్షేత్రాల, ప్రాచుర్యత ప్రదేశాల దర్శనార్థం మూడు ప్యాకేజిలతో డిపో నుంచి బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శ్రీశైలం, శిఖర దర్శనం, పాలధార పంచధార, సాక్షిగణపతి, పాతాళగంగ, డ్యాంసైట్, శ్రీ నీలంపాటి లక్ష్మీఅమ్మవారి దర్శనాలు ఒక ప్యాకేజిగాను, నాగార్జునప్రాజెక్టు, బ్రహ్మంగారిగుడి, సాగర్‌మాతా, నాగార్జునకొండ, బౌద్ధస్థూపం, ఎత్తిపోతల జలపాతం, మాచర్ల చెన్నకేశవస్వామి దేవాలయం, శివుని దేవాలయం, సత్రశాలలు మరో ప్యాకేజిగాను రెండురాత్రుళ్లు, ఒకపగలు 36గంటల సమయంతో అద్దంకి సింగరకొండ ఆంజనేయస్వామి, మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి, విజయవాడలోని ఇంద్రకీలాద్రి, చిన్నతిరుపతి (ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామి)లతోపాటు వివిధ ప్యాకేజిలతో కోటప్పకొండ, అమరావతి, హాయ్‌ల్యాండ్, ప్రకాశంబ్యారేజ్, వెలగపూడి నూతన సచివాలయం, కాకాని శివగుడి లాంటి సందర్శన ప్రదేశాలకు బస్సులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే మార్కాపురం డిపో నుంచి పుష్కరనగర్‌కు 20, శ్రీశైలంకు 20 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామని, ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ టిక్కెట్లతో సర్వీసులు నడపబడుతాయన్నారు. భక్తుల రద్దీనిబట్టి బస్సుల సంఖ్య పెంచుతామని, ఆంధ్రరాష్ట్రంలో జరిగే తొలి కృష్ణా పుష్కరాలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఒక్కరూ సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీలో ప్రయాణించాలని కోరారు. పూర్తివివరాలకు 7382890965, 9959225699 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.