ప్రకాశం

కృష్ణా పుష్కరాలు విజయవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, ఆగస్టు 11: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అధికారులకు సూచించారు. గురువారం తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓ జి మల్లికార్జున, కందుకూరు ఉప విద్యాశాఖాధికారి బి లక్ష్మయ్య, కందుకూరు, వివిపాలెం ఎంఇఓలు ఎం శ్రీనివాసరావు, ప్రసాదరావు, మున్సిపల్ కమిషనర్ అన్నం వెంకటేశ్వర్లుతో పాటు వివిధ శాఖల ఆధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కృష్ణా పుష్కరాలను విజయవంతం చేసేందుకు అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. ముఖ్యంగా కృష్ణా పుష్కరాల విజయవంతానికై ఈనెల 17, 18 తేదీల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో పాఠశాల విద్యార్థులతో ఉపాధ్యాయులు ర్యాలీలు నిర్వహించి కృష్ణా పుష్కరాల ప్రాముఖ్యతను తెలియజేయాలన్నారు. అదేవిధంగా గ్రామసభలు నిర్వహించి గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. శాఖలవారీగా అధికారులు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.