ప్రకాశం

భగ్గుమంటున్న ఎండలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఆగస్టు 11: వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా ప్రచంఢభానుడు తన ప్రతాపాన్ని చూపుతుండటంతో జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. మే, జూన్ నెలలను తలదనే్న రీతిలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. జిల్లావ్యాప్తంగా గత ఐదురోజులనుండి 38 డిగ్రీల సెంటీగ్రేడ్‌ల నుండి 40డిగ్రీల సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం ఎనిమిదిగంటల నుండి సాయంత్రం ఐదుగంటల వరకు ఎండతీవ్రత తగ్గకపోవటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రెండవ సమ్మర్ నడుస్తుందా అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 9వతేదీన 38డిగ్రీల సెంటీగ్రేడ్, 10వతేదీన 38.9,11వతేదీన 38.9డిగ్రీల సెంటీగ్రేడ్‌ల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. రానున్న రోజుల్లో వాతావరణంలో మార్పులు చేసుకుని వర్షాలు కురవకపోతే మాత్రం ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉదయం ఉష్ణోగ్రతలు పెరగటంతోపాటు రాత్రివేళల్లోను ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ప్రజలు వెచ్చటి వేడిగాలుల మధ్య జీవనం సాగిస్తున్నారు. ఈ కాలంలో భారీ వర్షాలు కురిసి వాతావరణం చల్లబడాల్సి ఉండగా అందుకు భిన్నంగా వాతావరణం నెలకొంది. దీంతో చల్లటిగాలుల స్ధానంలో వెచ్చటి వేడిగాలులు వీస్తుండటంతో మంచినీటికి గిరాకి ఏర్పడింది. అదేవిధంగా ఫ్యాన్లు, ఎయిర్‌కూలర్ల డిమాండ్ కూడా పెరిగింది. ప్రజలు ఫ్యాన్లు,ఎసిలను వినియోగించటం వలన విద్యుత్ బిల్లులు సైతం భారీగా పెరిగిపోనున్నాయి. ఎండవేడిమికి భూగర్భజలాలు సైతం అడుగంటిపోతున్నాయి. దీంతో పశ్చిమప్రాంతంలోని ఉద్యానవన తోటలు వాడుముఖం పడుతున్నాయి. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజలు రోగాలబారిన పడే అవకాశాలు లేకపోలేదు. మధ్యాహ్నం 12గంటల నుండి మధ్యాహ్నం మూడుగంటల వరకు జిల్లాలోని అనేకప్రాంతాల్లోని ప్రధాన రహదారులన్ని ప్రజలు లేక వెలవెలబోతున్నాయి. జిల్లాకేంద్రమైన ఒంగోలులోని కలెక్టరేట్ ప్రధానకూడిలి సైతం మధ్యాహ్నం వేళల్లో జనసంచారం లేక బోసిపోయి దర్శనమిస్తుంది. జిల్లావ్యాప్తంగా కొబ్బరినీళ్లు, మినరల్‌వాటర్, మజ్జిగ, నిమ్మకాయషోడాలు, శీతలపానీయాల విక్రయాలు భారీగా పెరిగాయి. ఎండవేడిమికి వాటి ధరలను సైతం వ్యాపారులు పెంచేశారు.