ప్రకాశం

నామినేటెడ్ పదవుల కోసం తమ్ముళ్ల ఎదురుచూపు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 12: జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుతెన్నులు చూస్తున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో పదిసంవత్సరాల పాటు అధికారపగ్గాలు లేని సమయంలో అధికారపార్టీ నాయకులు పెట్టించిన కేసులకు వెరవకుండా, పార్టీని గ్రామాల్లో అభివృద్ధి చేశాం, కాని తీరా అధికార పగ్గాలు చేపట్టి 18 నెలలు నెలలు అయిన ఇంతవరకు తమకు నామినేటెడ్ పదవులు ఎందుకు కట్టబెట్టలేదన్న వాదనను తెలుగుతమ్ముళ్లు తెరపైకి తీసుకువస్తున్నారు. కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదేపదే సభల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ నామినేటెడ్ పదవుల పందారంలో మాత్రం తమకు అగ్రతాంబులం ఇవ్వటం లేదన్న వాదన కార్యకర్తల్లో నెలకొంది. పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన వారిని కాదని ఇతర పార్టీల నుండి తెలుగుదేశంపార్టీలోకి వలస వచ్చిన నేతలకే నామినేటెడ్ పదవులను కట్టబెడుతున్నారని తాము అదేవిధానం అవలంభిస్తే పార్టీ అధికారంలో లేనిసమయంలో ఏవిధంగా ఉంటుందన్న ప్రశ్న కార్యకర్తల్లో వినిపిస్తోంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జెండా మోస్తే సరిపోతుందని, ఆ విధానం వలన తాము ఎలాంటి కేసుల్లోను ఇరుక్కొకుండా సేఫ్‌గా ఉండవచ్చునని తెలుగుతమ్ముళ్లు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకులను గుర్తించి నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని రాష్టప్రార్టీని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా పార్టీపరంగా పదవులు, దేవాలయాల కమిటిలు, వ్యవసాయమార్కెట్ పాలకవర్గాలు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, స్ర్తి,శిశుసంక్షేమశాఖ రీజనల్ డైరెక్టర్, మైన్స్ కార్పొరేషన్ డైరెక్టర్‌తోపాటు పలు రాష్టస్థ్రాయి పదవులకు జిల్లాలోని ముఖ్యమైన నేతలతోపాటు, మరికొంతమంది నాయకులకు పదవులను కట్టబెట్టే అవకాశం ఉన్నా ఇంతవరకు పదవులను భర్తీ చేయలేదన్న వాదన పార్టీశ్రేణుల్లో వ్యక్తవౌతుంది. ఇదిలా ఉండగా జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల సారధ్యంలో జిల్లాలో తెలుగుదేశంపార్టీ పూర్తిస్థాయిలో బలోపేతం అవుతుంది. రాష్ట్రంలో అధికారపగ్గాలు లేని సమయంలోను జిల్లాలో పార్టీ బలోపేతం చేయటమేకాకుండా అధికారపార్టీకి చెందిన శాసనసభ్యులు, ఆయా నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులతో సంబంధాలు కొనసాగిస్తూ జిల్లాపార్టీనిముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండటంతో ఇతరపార్టీలకు చెందిన నేతలు కూడా పార్టీలో చేరేందుకు పరుగులు తీసే పరిస్థితి నెలకొంది. కొంతమంది ఇతర పార్టీలకు చెందిన నేతలు టిడిపిలో చేరేందుకు అధిష్టానవర్గంతో సంప్రదింపులు జరిపినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. అలాంటి వారిని పార్టీలోకి చేర్చుకుంటే ఆయా నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జుల పరిస్థితి ఏమిటన్న చర్చ కూడా పార్టీశ్రేణుల్లో వ్యక్తవౌతుంది.
జనచైతన్యయాత్రల్లో జిల్లాలోని శాసనసభ్యులతోపాటు, ఆయా నియోజకవర్గాలకు చెందిన ఇన్‌చార్జులు పాల్గొంటున్నారు. 18నెలల కాలంలో టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమకార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూనే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేస్తున్నారు. జనచైతన్యయాత్రల్లో భాగంగా జిల్లాకేంద్రమైన ఒంగోలులో జరిగే బహిరంగసభలో రాష్ట్ర తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు పాల్గొని ప్రసంగించనున్నారు. మొత్తంమీద జిల్లాలోని తెలుగుతమ్ముళ్ళు నామినేటెడ్ పదవులకోసం ఎదురుచూపులు చూడాల్సిన పరిస్ధితి నెలకొంది. కాగా ఇసుక ధరలను నియంత్రించలేకపోవటంతో ప్రభుత్వంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ఇసుక మాఫీయాను జిల్లాలో ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఏంతైనా ఉంది.