ప్రకాశం

‘మానసిక వికాసానికి లలిత కళలు దోహదం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేటపాలెం, మార్చి 22: కళలను ప్రోత్సహించండి, సంస్కృతిని కాపాడండి నినాదంలో 1952లో ప్రారంభమైన లలిత కళా సమితి ఎందరో కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించిందని ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యనిర్వహణాధికారి కొసనం సుధాకర్ అన్నారు. దైనందిన జీవితంలో మానసిక వికాసానికి, ఆనందానికి కళలు దోహదం చేస్తున్నాయని ప్రస్తుత సామాజిక పరిస్థితులలో ఎన్నో కళా సంస్థలు వచ్చినా నిలువ లేక పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లలిత కళా సమితి 64వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం స్థానిక శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్ సత్రం మల్లేశ్వరరావు మాట్లాడుతూ వేటపాలెం ప్రాంతంలో కళాకారులను ప్రోత్సహించిన ఘనత లలిత కళా సమితిదేనన్నారు. ఈ సందర్భంగా సమితి శాశ్వత సమన్వయకర్త శ్రీరామమూర్తి వార్షిక నివేదికను వివరించారు. అనంతరం ముఖ్య అతిధి కొసనం సుధాకర్‌తో పాటు రంగస్థల కళాకారులు జూనియర్ డివి సుబ్బారావు, మన్నవ రామకృష్ణశర్మలను ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిధి సుధాకర్, లలిత కళా సమితి మూల నిధికి రూ.10వేలు విరాళాన్ని అందించారు. శ్రీ శ్రీనివాస సాయి నాట్యమండలి ఆధ్వర్యంలో జూనియర్ డివి సుబ్బారావు బృందం ప్రదర్శించిన సత్య హరిశ్చంద్ర కాటి సీను ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో నిరతాన్నదాత గొల్లపూడి సీతారాం, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షుడు పత్తి వెంకటసుబ్బారావు, ఇరిగేషన్ ఎఇ ఎంవై సత్యనారాయణ, లలిత కళాసమితి ప్రతినిధులు కోడూరి ఏకాంబరేశ్వరబాబు, ఆవుల పున్నయ్య, కొసనం నాగమాంబ, గౌరాబత్తుని రవిబాబు తదితరులు పాల్గొన్నారు.