ప్రకాశం

అర్జీలను యుద్ధ ప్రాతిపదికపై పరిష్కరించాలి: జెసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 22: జిల్లాలో మీకోసం ప్రజాసమస్యల పరిష్కార వేదికల్లో ప్రజల నుండి వచ్చిన అర్జీలను యుద్దప్రాతిపదికపై పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని సిపిఒ సమావేశమందిరంలో ఆయన అధ్యక్షతన మీకోసం గ్రీవెన్స్ ప్రజాసమస్యల పరిష్కారవేదికను నిర్వహించారు. ఈసందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో మీకోసం గ్రీవెన్స్, మీసేవా కేంద్రాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ప్రజా ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించేదిశగా అధికారులు పనిచేయాలన్నారు. ఈ సమావేశంలో వివిధశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరాను పగటి వేళల్లో అందించాలి
* వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శికి రైతుల వినతి
పంగులూరు, ఆగస్టు 22: ఎండుతున్న పంటల రక్షణకు రెయిన్‌గన్లు, స్ప్రింక్లర్లు సమకూర్చారు, అవి పని చేయాలంటే విద్యుత్ అవసరముంది. మూడు ఫేజ్‌ల విద్యుత్ సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పలువురు రైతులు వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి టి విజయ్‌కుమార్, కలెక్టర్ సుజాతశర్మలకు విజ్ఞప్తి చేశారు. అలవలపాడులోని పొలాలను పరిశీలించేందుకు సోమవారం అధికారులు విచ్చేశారు. రాత్రి వేళల్లో విద్యుత్ సరఫరా వల్ల పొలాలకు వెళ్లాలంటే ప్రాణాలు చేతిలో పట్టుకుని వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధను అర్థం చేసుకుని వ్యవసాయానికి 8 గంటలు మూడు ఫేజ్‌ల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. అందుకు స్పందించిన ప్రత్యేక కార్యదర్శి విజయ్‌కుమార్ ఈ విషయమై సంబంధిత అధికారులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 70 శాతం, ఇతరులు 50 శాతం రాయితీపై రెయిన్‌గన్లు అందిస్తున్నామని, వాటిని ఉపయోగించి పంటలను రక్షించుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో జనరేటర్లు అవసరమని పలువురు రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. ఈ ప్రాంతంలో వ్యవసాయ సీజన్‌లో పడిన వర్షపాతం వివరాలను కలెక్టర్ సుజాతశర్మ ఆయనకు వివరించారు. పంటల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను ఆయన రైతులతో చర్చించారు. వారి వెంట ఆర్డీఒ శ్రీనివాసరావు, ఎడిఒ మురళీకృష్ణ, ఎడిఎ ఎఫ్రాయిమ్, తహశీల్దార్ బి నిర్మల, ఎంపిడిఒ శ్యాంప్రసాద్, ఎఒ కుమారి తదితరులున్నారు.
మార్టూరులో...
మార్టూరు: ఆంధ్రప్రదేశ్ కరవు రహిత రాష్ట్రంగా ఉండడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని వ్యవసాయశాఖ కమిషనర్ విజయ్‌కుమార్ స్పష్టం చేశారు. మార్టూరు మండలం కోలలపూడి గ్రామంలో ఆయన సోమవారం వ్యవసాయ భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్ మాట్లాడుతూ సేంద్రీయ వ్యవసాయ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా ప్రకటించే విధంగా కృషి చేస్తామన్నారు. దానిలో భాగంగా ప్రకాశం జిల్లాను కూడా కరవు రహిత జిల్లా ప్రకటించడానికి రైతులందరూ సహకరించాలన్నారు. తద్వారా జిల్లా నుంచి కరవును తరిమికొట్టొచ్చన్నారు. వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్ప్రింకర్లు, రెయిన్‌గన్లు సరఫరా చేస్తుందని, రైతులు వాటిని ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో రెయిన్‌గన్స్‌తో రైతులకు లబ్ధి చేకూరుతుందని, అందువల్ల రైతులకు రెయిన్ గన్స్, స్ప్రింకర్లు అందజేస్తుందన్నారు. కావాల్సిన రైతులు వ్యవసాయాధికారి కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు. ఈ సందర్భంగా కొంతమంది రైతులు అడిగిన ప్రశ్నలకు తగు సమాధానాలిచ్చారు. నూగు పంట సాగు చేయడం వల్ల నాలుగు క్వింటాళ్లు పండాల్సిన పంట ఒక క్వింటా మాత్రమే దిగుబడి వచ్చి తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. ఈ సందర్భంగా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని, ప్రభుత్వం అందజేసే రాయితీ వ్యవసాయ యంత్ర పరికరాలను ఉపయోగించుకుని వాటి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలన్నారు. పై అధికారులతో మాట్లాడి మీకు కావాల్సిన రెయిన్‌గన్స్, స్ప్రింకర్లను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఒ కె శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, ఎడి ఎఫ్రాయిమ్, ఎఒ వెంకటకృష్ణ, ఉద్యానవన శాఖ ఎడి హరిప్రసాద్, దీపక్, శాస్తవ్రేత్తలు సంధ్యారాణి, ఒ శాంతి, రమేష్, తహశీల్దార్ పుల్లారావు, ఎంపిడిఒ బత్తిన సింగయ్య తదితరులు పాల్గొన్నారు.