ప్రకాశం

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియస్‌పురం, సెప్టెంబర్ 1: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మెరుగైన వసతులు కల్పించి అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని జడ్‌పి చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. గురువారం మండలంలోని అరివేముల, శీలంవారిపల్లి, నల్లమడుగుల తదితర గ్రామాల్లో ఏడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. ఈసందర్భంగా అరివేములలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాలను ప్రారంభించకపోవడానికి గల కారణాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామస్తులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సెప్టెంబర్ 5వ తేదీన ఆ గదులను ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా శీలంవారిపల్లిలోని కెవి నరసయ్య జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీచేసి విద్యార్థులతో ముచ్చటించి విద్యాప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. నల్లమడుగులలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయాన్ని, పంచాయతీరాజ్ అతిథిగృహాన్ని తనిఖీ చేశారు. పంచాయతీరాజ్ అతిథిగృహంలో పరిసరాలు అస్తవ్యస్తంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేశారు. అతిథిగృహం మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని, వాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అనంతరం ఎంపిడిఓ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి ప్రైవేటు పాఠశాలల్లో కంటే మెరుగైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలన్నారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచి ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలన్నారు. జడ్‌పి చైర్మన్ వెంట ఎంఇఓ పోలేరు, పంచాయతీరాజ్ జెఇ మస్తాన్‌వలీ, జిల్లాపరిషత్ సిసి వేణుగోపాల్‌రెడ్డి, సర్పంచ్ వెంకటయ్య, ఎస్‌ఎంసి చైర్మన్ వెంకటరెడ్డి, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కవితాప్రియ, రమేష్, ఖాదర్‌బాషా, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
మొండికుంటకు గండి కొట్టిన రైతులు
* వృథాగా పోతున్న నీరు
పెద్దారవీడు, సెప్టెంబర్ 1: వాటర్‌షెడ్ కింద మొండికుంటను నిర్మించగా ఇద్దరు రైతులు గండి కొట్టడంతో నీరు వృథాగా పోయిందని, దీంతో పశువులకు నీటి వసతి లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటుచేసిన కుంటను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వెంటనే అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి కుంటను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఎలుగుబంటి మృతి
పిసిపల్లి, సెప్టెంబర్ 1: ఎలుగుబంటి మృతిచెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. అలవలపాడు సమీపంలో పంచలింగాలకొండ వద్ద ఎలుగుబంటి మృతిచెంది ఉండడాన్ని పొలం పనులకు వెళ్లిన రైతులు గమనించారు. దీంతో వారు స్థానిక ఎస్‌ఐ, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో అధికార బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ఎలుగుబంటిని కనిగిరికి తరలించారు.
మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పమిడి వెంకట్రావు
ఒంగోలు అర్బన్, సెప్టెంబర్ 1: మద్దిపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పమిడి వెంకట్రావును నియమించారు. ఆ మేరకు గురువారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఉత్తర్వులు అందాయి. ఈ సందర్భంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆ ఉత్తర్వులను పమిడి వెంకట్రావుకు అందచేశారు. అనంతరం దామచర్లను పమిడి మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందచేసి కృతజ్ఞతలు తెలిపారు.
గ్యాస్ లీకై ఇల్లు దగ్ధం
సంతనూతలపాడు, సెప్టెంబర్ 1 : మండలంలోని గుమ్మలంపాడు గ్రామంలో షేక్ జరీనాకు చెందిన ఇంట్లో గురువారం గ్యాస్ లీకై, విద్యుత్ షార్ట్ సర్య్కూట్ కావడంతో రేకుల షెడ్‌తో పాటు లక్ష రూపాయలు విలువైన సామగ్రి ఈ సంఘటనలో దగ్ధమైంది. ఈ సంఘటనపై తహశీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. జరీనా గృహం దగ్ధమైన సంఘటన తెలుసుకున్న స్థానిక సర్పంచ్ బి చంద్రయ్య, గ్రామ నాయకులు శ్రీనివాసరావు, జి చేజర్లయ్య సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు.