ప్రకాశం

నేడు జిల్లా వ్యాప్తంగా సార్వత్రిక సమ్మె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 1 : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెతో శుక్రవారం జిల్లావ్యాప్తంగా అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. ఈ పాటికే అన్ని కార్మిక, బ్యాంకు, ఇతర అనుబంధ సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు సమ్మెను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని అన్నివర్గాల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెతో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఖాతాదారులు ఇబ్బందులు పడనున్నారు. అదేవిధంగా జిల్లాలోని ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు వచ్చే పరిస్థితి కనిపించటం లేదు. ఈ సమ్మెలో ఆటోవాలాలు కూడా పాల్గొననుండటంతో రవాణావ్యవస్థ స్తంభించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొననుండటంతో అన్ని కార్యాలయాలు ఉద్యోగులు లేక వెలవెలబోనున్నాయి. ఈ పాటికే ఎపి ఎన్‌జివో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు ఇటీవల ఒంగోలులో జరిగిన సభలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెకు తాము సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొననున్నారు. అదేవిధంగా కాంట్రాక్టు ఉద్యోగులు సైతం తాము సమ్మెబాట పడుతున్నట్లు ఆయా శాఖల అధిపతులకు సమ్మె నోటీసులు అందచేశారు. ఈ పాటికే ఆయా కార్మిక సంఘాలకు చెందిన నేతలు బైక్‌ర్యాలీలు, ర్యాలీలను జిల్లావ్యాప్తంగా నిర్వహించారు. ఇదిలాఉండగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె రామస్వామి, కె వీరాస్వామిరెడ్డి సమావేశం నిర్వహించారు. శుక్రవారం జరిగే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కాగా ఎపిఎస్ ఆర్టీసీకి సంబంధించి ఎంప్లాయిస్‌యూనియన్, స్ట్ఫా అండ్ వర్కర్స్ యూనియన్ నేతలు గురువారం ఒంగోలులో సమావేశం నిర్వహించి సమ్మెలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ శుక్రవారం జరిగే సమ్మెను జయప్రదం చేయాలని, ర్యాలీలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇటీవలే బ్యాంకు యూనియన్లకు చెందిన నేతలందరు సమావేశమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా సమ్మె ప్రభావం పూర్తిగా కనిపించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. సమ్మె సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేయనుంది.