ప్రకాశం

అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 3:కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించే విధంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ అధ్యక్షుడు, ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్థానిక సిపిఒ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపి అధ్యక్షతన జరిగింది. జిల్లాలో దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామయోజన పథకం కింద ఉచిత సర్వీసు కనెక్షన్లు 60 వేల 579 ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా 64 వేల సర్వీసు కనెక్షన్లు మూడు నెలల్లోపుగా ఇవ్వడం జరిగిందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. తక్కువ వ్యవధిలో లక్ష్యాలు సాధించిన ఆ శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. కొత్తగా సబ్ ప్లాన్ కింద 97 ఎస్టీ కాలనీల్లో , 297 ఆవాస ప్రాంతాల్లో విద్యుదీకరణ చేయాల్సి ఉందని ట్రాన్స్ కో ఎస్‌ఇ భాస్కర్ ఎంపికి వివరించారు. జిల్లాలో ఎనిమిదిలక్షల 51వేల 982 ఆర్‌ఎస్‌ఆర్ ఎంట్రీలు చేయాల్సి ఉండగా ఎనిమిదిలక్షల 17వేల 592 ఎంట్రీవలు కంప్యూటరైజేషన్ చేయటం జరిగిందని, మిగిలినవి త్వరతగతిన డిజిటలైజేషన్ కార్యక్రమం పూర్తిచేయటం జరుగుతుందని జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు.
జిల్లాలో ఆరువేల 345 రైతుల వద్ద నుండి 6 వేల 92 హెక్టార్లకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన క్రింద 56 లక్షలు ప్రీమియం కింద వసూలుచేసినట్లు వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ మురళీకృష్ణ ఎంపికి వివరించారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో నాలుగువేల 500 హెక్టార్లకు రెయిన్‌గన్ల ద్వారా నీటిని అందించి పంటలను కాపాడినట్లు చెప్పారు. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజనా పథకం కింద జిల్లాలోని పదిమండలాల్లో ప్రకృతి నేస్తంతో వ్యవసాయాన్ని చేపడుతున్నామని, ప్రభుత్వం ద్వారా 25 లక్షల రూపాయల నిధులు కేటాయించారని ఎంపి దృష్టికి తీసుకొచ్చారు. పంచాయతీరాజ్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ వివిధ శాఖల భాగస్వామ్యంతో సిసి రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు పంచాయతీ నుండి తీర్మానాలు పొందాల్సిన విషయాన్ని లిఖితపూర్వకంగా తెలియజేయాలని ఎంపి వైవి సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నియోజకవర్గాల వారీగా ఖర్చు పెట్టిన వివరాలను అందజేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద చినారికట్లలో బోర్ మోటార్లకు సంబంధించి పెండింగ్‌లో ఐదు లక్షల రూపాయలు చెల్లింపులు జరగలేదని మార్కాపురం శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్పందిస్తూ వారం రోజుల్లోగా పేమెంట్ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద ఉన్న సిపిడబ్ల్యూయు స్కీములకు నీరు అందేలా చూడాలని సంతనూతలపాడు శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లాలో ఫ్లోరోసిస్ ప్రభావిత ప్రాంతాల్లో కిడ్నీ డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని ఎంపి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజావసరాల నిమిత్తం వైద్యాధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, మర్రిపూడి మండలంలో డయాలసిస్ వ్యాధిగ్రస్థులు వందమంది వరకు ఉన్నారని, కనిగిరిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖాధికారులు ఎంపి సుబ్బారెడ్డి ఆదేశించారు.

వాన్‌పిక్ భూములు వెనక్కి ఇవ్వాలి
- సిపిఐ జిల్లా కార్యదర్శి అరుణమ్మ
చీరాల, సెప్టెంబర్ 3: వాన్‌పిక్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి సేకరించిన భూములు వెనక్కి ఇవ్వాలని సిపిఐ జిల్లా కార్యదర్శి అరుణమ్మ డిమాండ్ చేశారు. చీరాల్లో పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అరుణమ్మ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాలో పర్యటించినప్పుడు వాన్‌పిక్ భూములను వెనక్కి ఇప్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. వాన్‌పిక్ కోసం రైతులు, ప్రజల నుంచి సేకరించిన భూమిలో ఎన్నో వ్యవసాయ, అనుబంధ పరిశ్రమలతో పాటు ఇతర రంగాల పరిశ్రమలు సైతం ఏర్పాటు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. అలాకాని పక్షంలో ఎవరి నుంచి భూములు సేకరించారో వారికి ఆ భూములను తిరిగి ఇప్పించాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ఉద్దేశ్యం కేంద్ర ప్రభుత్వానికి లేదన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఎత్తేస్తామని పలువురు నాయకులు మాట్లాడడం అందులో భాగమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఇసుక విధానం లోప భూయిష్టంగా ఉందన్నారు. అక్రమాస్తుల దోపిడీకి ఆయుధంగా మారిన విధానాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. మన రాష్ట్రంలో కేవలం 7 జిల్లాలనే వెనుకబడిన జిల్లాలుగా గుర్తిస్తామనడం సమంజసం కాదన్నారు. ప్రకాశం జిల్లా ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో కరువు తాండవిస్తుందన్నారు. కావున ఎనిమిదో వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను గుర్తించి తగిన నిధులిచ్చి ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. వేటపాలెంలోని జీడిపప్పు పరిశ్రమలతో పాటు చేనేత కార్మికులు కనీసం వేతనం కూడా అందక సతమతమవుతున్నారని వాపోయారు. కావున వారికి మెరుగైన జీవనభృతి కల్పించడంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కన్వీనర్ మేడా వెంకటరావు, ఎ ఐటియుసి డివిజన్ కార్యదర్శి అచ్యుతుని బాబూరావు, పార్టీ నాయకులు కపర్థి, శ్రీమన్నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.