ప్రకాశం

జిల్లాకు నూతనంగా పరిశ్రమలు వచ్చే ఛానే్సలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 26: జిల్లాకు నూతనంగా పరిశ్రమలు వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించటంలేదు. జిల్లాలో ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతోపాటు, దేశానికి చెందిన పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారని ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు నుండి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శిద్దా రాఘవరావు ఊకదంపుడు ప్రచారాలు సాగిస్తున్నారు. త్వరలోనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తాం, రామాయపట్నం పోర్టును నిర్మిస్తాం, దొనకొండను పారిశ్రామిక హబ్‌గా తయారుచేస్తామని పాలకులు చెప్పే మాటలన్నీ డొల్లతనంగా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పరిశ్రమను ఇతర దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు కాని, దేశంలోని పారిశ్రామికవేత్తలు కాని వందకోట్ల రూపాయలు పెట్టి ఏర్పాటుచేయాలంటే ముందుగా ఆ పారిశ్రామికవేత్త కోరుకునేది పోర్టు, ఎయిర్‌పోర్టు, నీటివసతి, రోడ్డువసతిని కోరుకుంటారు. ఇవన్నీ ఉంటేనే జిల్లాలో వేలకోట్లరూపాయల పెట్టుబడితో పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తారు. కాని జిల్లాలో రామాయపట్నం పోర్టు ఏర్పాటు కలగానే మిగిలింది. అదేవిధంగా వెలుగొండప్రాజెక్టు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం మేరకు పూర్తిఅయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. వచ్చే ఎన్నికలనాటికి మళ్ళీ వెలుగొండప్రాజెక్టు అంశం తెరపైకి రానుంది. అదేవిధంగా ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టును కోరుకుంటారు. ఈ లక్షణాలన్ని ప్రకాశం జిల్లాలో కనిపించటం లేదు. దీంతో జిల్లాకు ఒక్క పరిశ్రమకూడా వచ్చే అవకాశాలులేవు. ఏ పరిశ్రమ అయిన స్థాపించాలంటే ముందుగా నీటివసతి చూసుకుంటారు, కాని అలాంటి నీటి వసతి జిల్లాలో లేదు. ప్రధానంగా దొనకొండ పారిశ్రామిక హాబ్‌కావాలంటే నీటి వసతి కావాల్సిఉంది. దొనకొండకు వెలుగొండప్రాజెక్టు ద్వారా నీటిని సరఫరా చేస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటిస్తుంది కాని ఆచరణలో మాత్రం ఆ కల ఇప్పటిలో నేరవేరే అవకాశాలు కనిపించటం లేదు. ఇప్పటివరకు దొనకొండ పారిశ్రామిక హాబ్‌కు సంబంధించి 25వేల ఎకరాలను భూసేకరణ చేశారు. జిల్లాలో ఏర్పాటుచేయాల్సిన పరిశ్రమలన్ని నెల్లూరు, చిత్తూరు జిల్లాలోని శ్రీసిటికి తరలిపోతున్నాయి. దీంతో జిల్లా పారిశ్రామికంగా పూర్తిస్థాయిలో వెనకంజలో ఉండటంతో నిరుద్యోగ సమస్య జఠిలంగా మారింది. జిల్లాకు చెందిన వేలాదిమంది నిరుద్యోగులు ఈపాటికే ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లి ఉద్యోగాలు చేయాల్సిన పరిస్ధితి నెలకొంది.
నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉండగా అక్కడ పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని శ్రీసిటిలోని పారిశ్రామికవేత్తలకు అనుకులంగా చెన్నై, వెన్నూరు పోర్టులు ఉన్నాయి. దీంతో ఎగుమతులు కారుచౌకగా ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మన జిల్లానుండి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టుకు సరుకులను రవాణా చేయాలంటే 120కిలోమీటర్ల దూరం ఉండటంతో సరుకుల రవాణాకు అధిక వ్యయం అవుతుంది.దీంతో పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు ముందుకు రావటం లేదు. నెల్లూరు, శ్రీసిటిలో పరిశ్రమలు స్ధాపించేవారికి తిరుపతి, చెన్నైలో అంతర్జాతీయ విమానాశ్రాలు ఉండటంతో రాకపోకలకు సైతం ఇబ్బంది లేకుండా ఉంది. ఇదిఇలాఉండగా జిల్లాలోని కందుకూరు మండలం కోవూరు గ్రామంలో 20 ఎకరాల్లో రెండువందల కోట్లరూపాయల వ్యయంతో న్యూవుడ్, ప్లైవుడ్ పరిశ్రమను ఏర్పాటుచేసేందుకు రాష్ట్రప్రభుత్వంతో ఈ సంవత్సరం జనవరి 16న విశాఖపట్నంలో జరిగిన సదస్సులో యజమాన్యం అంగీకారం కుదుర్చుకుంది. ఈ పరిశ్రమను ఏర్పాటుచేస్తే 150మందినుండి రెండువందల మంది నిరుద్యోగులకు ఉపాధి వస్తుంది. కాని రోజుకు మూడులక్షల లీటర్లు కావాలని కంపెనీ యజమాన్యం రాష్ట్రప్రభుత్వానికి నివేదించింది.
అదేవిధంగా దొనకొండలో మెషన్ సింటిక్స్ ప్యాక్టరీని ఐదువందల కోట్లరూపాయల పెట్టుబడితో ఏర్పాటుచేసేందుకు పరిశీలనలో ఉంది. అదేవిధంగా స్పిన్నింగ్, డయింగ్ టెక్స్‌టైల్‌ను తమిళనాడుచెందిన పారిశ్రామిక వేత్తలు ఏర్పాటుచేసేందుకు సిద్ధవౌతున్నారు. ఈ టెక్స్‌టైల్ వస్తే సుమారు ఐదువేలమంది నిరుద్యోగులకు ఉపాధి కలుగుగుతుంది. అదేవిధంగా చైనాకు చెందిన కన్సారిటియం కంపెనీకి చెందిన పారిశ్రామిక వేత్తలు 30వేల కోట్లరూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ఐదువేల ఎకరాలను అడుగుతున్నారు. అదేవిధంగా దొనకొండలో ప్యాబ్రికేషన్, కెమికల్ అండ్ ఫర్టిలైజర్, ప్రాసెసింగ్ యూనిట్లను స్ధాపించేందుకు ముందుకు వస్తున్నారు. కాని జిల్లాలో పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నప్పటికి ప్రభుత్వం మాత్రం వారికి తగినన్ని వౌళికసదుపాయాలను కల్పించటంలో మాత్రం వైఫలం చెందుతుండటంతో పరిశ్రమలు జిల్లాకు వచ్చే ఛాన్స్ కనిపించటం లేదు. రానున్నరోజుల్లో కూడా పారిశ్రామికంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్దిచెందుతాయి తప్ప ప్రకాశం జిల్లా మాత్రం వౌళికసదుపాయలు లేకుండా పారిశ్రామికంగా అభివృద్ది చెందే అవకాశాలే లేవు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి జిల్లాలో పరిశ్రమల స్ధాపన కోసం రామాయపట్నం పోర్టు నిర్మాణం, వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరతిగతిన పూర్తిచేయాల్సిన అవసరం ఉంది.