ప్రకాశం

దొంగతనాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాలరూరల్, సెప్టెంబర్ 27: జిల్లాలో దొంగతనాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ త్రివిక్రమవర్మ తెలిపారు. మండల పరిధిలోని ఈపూరుపాలెం, వేటపాలెం పోలీసు కార్యాలయాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నేరాలను అదుపు చేసేందుకు మరికొంత సమయం పడుతుందన్నారు. ముఖ్యంగా చీరాల సబ్‌డివిజన్ పరిధిలో జరుగుతున్న దొంగతనాలను అదుపు చేస్తామని స్పష్టం చేశారు. ఇటీవల దర్శిలో 11 దొంగతనం కేసులకు సంబంధించి ఒకేసారి అరెస్టు చేసి సొత్తు రికవరీ చేశామని గుర్తు చేశారు. చీరాలలో జరుగుతున్న దొంగతనాల్లో పోలీసుల సహకారం ఉందని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యాఖ్యానించడం ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయనకు అందిన ఫిర్యాదుల మేరకే ఆ విధంగా మాట్లాడి ఉంటారని అభిప్రాయపడ్డారు. అదే విధంగా తీరప్రాంతంలో ప్రేమ జంటలపై జరుగుతున్న లైంగిక దాడులను నివారించేందుకు ప్రత్యేక నిఘా పెట్టి అడ్డుకట్ట వేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరదలు వచ్చి రోడ్లపై రాకపోకలు నిలిచిపోయినప్పుడు జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో పని చేసి సహాయ చర్యల్లో పాల్గొని బాధితులకు అండగా నిలిచారన్నారు. రూరల్ పరిధిలో ఈ ఏడాది 80 కేసులు నమోదు కాగా వాటిలో 90 శాతం పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ డాక్టర్ ప్రేమ్‌కాజల్, సిఐ అల్త్ఫా హుస్సేన్, ఎస్సైలు రాంబాబు, షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.