ప్రకాశం

గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 6:గ్రామపంచాయతీల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ హెచ్చరించారు. గురువారం కలెక్టర్ ఒంగోలు, కందుకూరు డివిజన్లల్లో పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన సిసిరోడ్లు, తుఫాను షెల్టర్ల నిర్మాణాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను సంబంధిత అధికారులతో పర్యవేక్షించారు. ముందుగా కొత్తపట్నం మండలంలోని ఈతముక్కల పల్లెపాలెంలో పంచాయతీ శాఖ ద్వారా కోటి 75లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న తుఫాన్ షెల్టర్‌ను పరిశీలించారు. తుఫాన్‌షెల్టర్‌కు నిర్వహణ కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అదేగ్రామంలో 14లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సిసి రోడ్లను పరిశీంచారు. సిసి రోడ్ల నాణ్యతను పరిశీలించే నిమిత్తం శాంపిల్స్‌ను సేకరించి నివేదిక అందచేయాలని అధికారులను ఆదేశించారు. పల్లెపాలెంలోని గోవిందమ్మ అనే మహిళా రక్షితమంచినీటి పథకం ఉన్నప్పటికీ తాగునీటికి ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయని, మరుగుదొడ్ల నిర్మాణాలకు అనుమతులు మంజూరుచేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. నెలలోగా తాగునీటి పథకానికి సంబంధించి 15వందలమీటర్ల పైపులైను వేయించి మంచినీరు సరఫరా అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇన్‌చార్జి ఎంపిడిఒను మరుగుదొడ్ల నిర్మాణాలను చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈతముక్కల గ్రామంలో ఏడులక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అంగన్‌వాడీ భవనాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల మొక్కలను నాటాలన్నారు. ఈతముక్కలలో పారిశుద్ధ్యం సక్రమంగా లేదని, వీధులు శుభ్రంగాలేవని ప్రజలు రోగాలు బారినపడకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సర్పంచ్ పద్మను ఆదేశించారు. టంగుటూరు పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు సిసిరోడ్లను పర్యవేక్షించారు. ప్లైఓవర్ కింద చెత్త ఉందని గ్రామపంచాయతీలో డ్రైనేజిలు బ్లాక్ అయ్యాయని, డ్రైనేజి మొత్తం చెత్త, ప్లాస్టిక్ కవర్‌తో నిండి ఉండటాన్ని చూసి కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామపంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమం సక్రమంగా నిర్వహించటం లేదని వారంరోజుల్లోగా మరలా తనిఖీలకు వస్తానని ఆలోగా గ్రామం పూర్తిగా, పరిశుభ్రంగా ఉండేలా చూడాలని లేనిపక్షంలో కఠినచర్యలు తీసుకుంటానని గ్రామపంచాయతీ కార్యదర్శిని హెచ్చరించారు. పంచాయతీలో పారిశుద్ధ్య కార్యక్రమాలపై గ్రామసర్పంచ్ దృష్టిపెట్టాలన్నారు. వార్డుల వారీగా సమావేశాలను నిర్వహించి రోడ్లపై మురుగుకాల్వలపై చెత్త, ప్లాస్టిక్ కవర్లు వేయకుండా తడి,పొడి చెత్తబుట్టలను వాడేలా అవగాహన కల్పించాలని సర్పంచ్ జయంతిబాబు, ఎంపిపి చంద్రశేఖర్‌కు సూచించారు. టంగుటూరులో శాలిడ్ వెస్ట్‌మేనేజ్‌మెంటు ప్లాంట్‌నునెలలోగా ఏర్పాటుచేయాలన్నారు. పారిశుద్యకార్మికులు పదిమంది మాత్రమే ఉన్నారని పూర్తిస్దాయిలో పారిశుద్యకార్యక్రమాలనుచేపట్టలేకపోతున్నామని సర్పంచ్, ఎంపిపిలు కలెక్టర్‌కు వివరించారు. టంగుటూరు మండలంలోని రావిపాలెంలో నిర్మిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. దీనిపక్కనే ప్రభుత్వ భూమిలో గ్రామప్రజల వితరణతో నిర్మిస్తున్న ప్రాధమిక పాఠశాలను పరిశీలించారు. రావివారిపాలెంలో తుఫాన్‌షెల్టర్‌ను పాలసేకరణకు వినియోగిస్తున్నట్లు గ్రామప్రజలు తెలిపారు. తుఫాన్‌షెల్టర్‌కు మరమ్మతులు నిర్వహించాలన్నారు. తుఫాన్‌షెల్టర్‌లో గ్రామప్రజలు చిన్నచిన్నవేడుకులు నిర్వహించుకునేలా చూడాలని అందుకు అనుగుణంగా నా మినల్ అద్దె వసూలు చేయాలన్నారు. వసూలైన నిధులను తుఫాన్‌షెల్టరు నిర్వహణకు, మరమ్మతులకు, పెయింటింగ్ వేసుకునేందుకు ఖర్చుపెట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. గ్రామంలోని ప్రతి ఇంటిముందు ఇంకుడుగుంతను ఏర్పాటుచేసుకోవాలన్నారు. శింగరాయకొండ మండలం పాకల సామాజిక భవనంతోపాటు, అతిథిగృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. పాకల బీచ్‌లో పర్యాటకులు సేదతీరేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. పాకల బీచ్‌ను పరిశుభ్రంగా ఉండేలా చూడాలని సర్పంచ్‌ను ఆదేశించారు.పాకల పల్లెపాలెంలోని అంగన్‌వాడీకేంద్రాన్ని తనిఖీచేశారు. కేంద్రంలో ప్యాన్లు, విద్యుత్ సౌకర్యం, బొమ్మలను ఉంచేందుకు ర్యాక్, పిల్లలు పడుకునేందుకు అవసరమైన చాపలను ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సైక్లోన్ రిస్క్ మిటిగేషన్ ప్రాజెక్టు కింద ప్రపంచ బ్యాంకు నిధులతో చెల్లెమ్మగారి పుట్టావారిపాలెంలో కోటి 86లక్షలరూపాయలతో నిర్మిస్తున్న తుఫాన్ షెల్టర్‌ను పరిశీలించారు. అన్ని రకాల వసతులతో నిర్మాణపనులు జనవరిలోగా పూర్తిచేయాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఒంగోలు, కందుకూరు ఆర్‌డిఒలు కె శ్రీనివాసరావు, మల్లిఖార్జునరావుతోపాటు వివిధ శాఖల అధికారులుపాల్గొన్నారు.