ప్రకాశం

సీల్డ్ కవర్లలో పనితీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 7: సీల్ట్‌కవర్లల్లో తమ పనితీరును చూసుకుని ఎవరికి వారు కిమ్మనకుండే పరిస్థితి నెలకొంది. టిడిపి శాసనసభ్యుల పనితీరుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఎ,బి,సి,డి గ్రేడ్‌లుగా విభజించి కవర్లను అందచేశారు. ఈ కవర్లల్లోని అంశాలు పత్రికలకు లీకేజి అయినా ఎవరిద్వారానైనా బయటకు వచ్చినా చర్యలు తీసుకుంటానని ముఖ్యమంత్రి హెచ్చరించిన నేపధ్యంలో జిల్లాలోని శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జులు కిమ్మనకుండా ఉండిపోతున్నారు. ఎవరికివారే తమ గ్రేడ్ ఇంత ఉందా, అంత ఉందా అని ఇతరులతో చర్చించుకునే అవకాశమే లేకుండా పోయింది. దీంతో శాసనసభ్యులు ఎవరికివారు ఆ కవర్‌ను తెరిచి చదువుకుని సీక్రెట్‌గా పెట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ఒకవేళ ఆ సమాచారం బయటకు వస్తే ముఖ్యమంత్రి సంబంధిత నియోజకవర్గ శాసనసభ్యులు, ఇన్‌చార్జులపై వేటువేసే అవకాశాలుండటంతో వారు కవర్ విషయంపై మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాలో 12 నియోజకవర్గాల శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్‌చార్జుల పనితీరు ఎలా ఉంది, పార్టీపరంగా ముందుకు వెళ్తున్నారా, రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్‌ను ఏవిధంగా అభివృద్ధి చేయాలి, మండల, గ్రామస్థాయిల్లో పార్టీని ఏవిధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. రాష్టవ్య్రాప్తంగా నియోజకవర్గాల శాసనసభ్యులు, ముఖ్యనేతలతో ముఖ్యమంత్రి విజయవాడలో మూడురోజులపాటు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో చివరిరోజైన గురువారంనాడు శాసనసభ్యుల జాతకాలకు సంబంధించిన కవర్‌ను చేతిలో పెట్టడటం జరిగింది. కొంతమంది శాసనసభ్యులు ఆతృతగా తమకు ఏయే గ్రేడ్‌లు వచ్చాయో చూసుకోగా మరికొంతమంది మాత్రం విజయవాడ నుండి కారులో వస్తూ చూసుకోవటం జరిగినట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. ఇదిలాఉండగా పార్టీ అధికారంలో ఉన్నంతకాలం ప్రజలు మనకు అనుకూలంగానే ఉంటారని, ఎన్నికల చివరి రోజుల్లో మాత్రం వారి అసహనాన్ని బయటకు వెళ్లగక్కుతారని, అందువలన చివరిరోజుల్లోనూ ప్రజలను పార్టీవైపుతిప్పుకునే విధంగా తగిన వ్యూహరచన చేయాలని నేతలకు చంద్రన్న పిలుపునిచ్చారు. జిల్లాలోని 12 నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు, ఇన్‌చార్జుల గ్రేడ్‌లపైనే పార్టీశ్రేణుల్లో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇదిలాఉండగా జిల్లాలోని కందుకూరు, అద్దంకి, మార్కాపురం, చీరాల, గిద్దలూరు నియోజకవర్గాల్లోని నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు జోరందుకున్నాయి. ఈ నియోజకవర్గాల్లోని నేతలకు ఏగ్రేడ్ వచ్చిందోనన్న చర్చ ఆ నియోజకవర్గాల్లో సాగుతుంది. జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు పనితీరు ఏవిధంగా ఉందోనన్న చర్చకూడా పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్ధన్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మొత్తంమీద ముఖ్యమంత్రి ప్రకటించిన గ్రేడ్‌లతో జిల్లాలోని కొంతమంది శాసనసభ్యులు ఆనందంగా ఉండగా, మరికొంతమంది ఆందోళన చెందుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం.