ప్రకాశం

ప్రజాసాధికార సర్వే 25వ తేది లోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, అక్టోబర్ 15 : జిల్లాలో ప్రజాసాధికార సర్వే కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేది లోగా పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం హరి జవహర్‌లాల్ తెలిపారు. శనివారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంకా సర్వేలో మిగిలి పోయిన ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించేందుకు సర్వే బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజాసాధికార సర్వేలో2011 జనాభా లెక్కల ప్రకారం 33 లక్షల 97 వేల 448 మందిని నమోదు చేయాల్సి ఉందని ఇందులో 95 మారుమూల గ్రామాలకు సంబంధించి నెట్ వర్క్ కవరేజి లేనిప్రాంతంలో నివసిస్తున్న లక్షా 13 వేల 771 మంది ఉన్నారని, ఆఫ్ లైన్ మోడ్‌లో ఉన్నారని వివరించారు. మిగిలిన 32 లక్షల 83 వేల 677 మందిని ప్రజాసాధికార సర్వేలో నమోదు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 26 లక్షల 88 వేల 70 మందిని పూర్తి స్థాయిలో వారి వివరాలను సర్వేలో నమోదు చేశామన్నారు. ఇంకా ఐదు లక్షల 95 వేల 607 మంది వివరాలను సర్వే లో నమోదు చేయాల్సి ఉందని వివరించారు. ఇప్పటి వరకు 13 లక్షల 87 వేల 758 మందికి సంబంధించి నమోదుచేశామన్నారు. ఇంకా 13 లక్షల 312 మందిని ఈ పథకం కింద వివరాలు నమోదు చేయాల్సి ఉందని వివరించారు. జిల్లాలో చంద్రన్న బీమా పధకం క్రింద 10 లక్షల 70 వేల 843 మంది నమోదు అయి ఉన్నారన్నారు. రాష్ట్రంలో సర్వే లో ఇకె వైసి ప్రకారం ప్రగతిలో 3వ స్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వం భవిష్యత్తులో ఏలాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నా సర్వే వివరాలు ఎంతో అవసరం అని భావిస్తున్నదన్నారు. నిర్థిష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి సర్వే ఎంతో ఉపయోగపడుతుందని ప్రజలు సర్వేకు పూర్తిగా సహకరించాలని సూచించారు. పాఠశాలలో , కళాశాలలో, హాస్టల్స్‌లో , అంగన్‌వాడీ కేంద్రాలలో గల 0 నుండి ఐదు సంవత్సరాల లోపుగా పిల్లలను సర్వేలో నమోదు అయ్యేటట్లు చూడాలని , ప్రత్యేకంగా సర్వే బృందాలు ఏర్పాటు చేసి సర్వే చేపడతారన్నారు. జిల్లాలో తాత్కాలిక , శాశ్వతంగా ఉపాధి కోసం వలస వెళ్ళిన వారు ఉన్నారని, వారందరూ ఎక్కడా ఉన్న పిలిపించి సర్వేలో నమోదు అయ్యేటట్లు చూస్తామన్నారు. స్మార్ట్ డైనమిక్ ప్రాసెస్ ద్వారా ఇతర దేశాలలో ఉన్న వారిని సర్వేలో నమోదు చేసే వెసులుబాటు ఉందన్నారు. జిల్లాలో ఎక్కువ శాతం ప్రజాసాధికార సర్వేలో కవర్ చేయాల్సి ఉందన్నారు. ప్రభుత్వం పేద ప్రజలకు పెన్షన్లు , బ్యాంకు రుణాలు ఇతర సంక్షేమ పధకాలు అందించేందుకు పూర్తి స్థాయిలో సర్వే వివరాలు అవసరమని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి ఉపాధి కోసం జిల్లాకు వచ్చిన వారిని తాత్కాలిక రెసిడెన్షియల్ గా తీసుకొని సర్వేలో నమోదు చేస్తామన్నారు. ప్రజాసాధికార సర్వేలో సూపర్ వైజర్ చెక్ చేసి తప్పులు సరిదిద్దుతామన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ ప్రజాసాధికార సర్వేలో నమోదు కావాల్సి ఉందన్నారు. ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్‌తో పాటు ఎస్‌డిసి ఉదయభాస్కర్ తదితరులు ఉన్నారు.