ప్రకాశం

జిల్లాలో అన్ని శాఖల సమన్వయంతోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 17 : జిల్లాలో అన్ని శాఖల సమన్వయం, కృషితోనే సంపూర్ణ అక్షరాస్యత సాధ్యమవుతుందని 20 సూత్రాల అమలు పథకం కమిటీ చైర్మన్ వై శ్రీనివాస్ శేషసాయిబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో వయోజన విద్యాశాఖ, జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి, ఆర్‌ఐఓలతో జిల్లాలో అక్షరాస్యతను పెంపొందించే అంశంపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర జిల్లాలతో పోలిస్తే మహిళల్లో అక్షరాస్యత తక్కువగా ఉందన్నారు. చాలా మండలాల్లో 50 శాతం కంటే తక్కువ మహిళల్లో అక్షరాస్యత ఉందని, నిరంతరం విద్య అందించటం వల్ల అక్షరాస్యతను పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. దేశంలో 74శాతం అక్షరాస్యత ఉందని, రాష్ట్రంలో 67 శాతం ఉందని, ప్రకాశం జిల్లాలో 63 శాతం ఉందని తెలుపుతూ 2021 సెన్స్‌స్‌లోగా అక్షరాస్యతను గణనీయంగా పెంచేందుకు ఆయాశాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. నిరక్షరాస్యత వల్ల సమాజం వెనుకపడే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అధికారులు తమ వంతు కృషి చేయాలన్నారు. నిరక్షరాస్యుల్లో సామాజిక అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పథకాలన్ని విద్యతో ముడిపడి ఉన్నాయని అన్నారు. విద్య లేకపోతే మనుగడే లేదన్నారు. జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టిలు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ సాక్షరభారత్ కార్యక్రమాలను విస్తత్రంగా చేపట్టాలన్నారు. మహిళల్లో అక్షరాస్యత పెంపొందించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన మూడు మండలాలను గుర్తించి పైలెట్ ప్రాజెక్టు కింద దృష్టిపెట్టి మూడు మండలాల్లో సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా అధికారులు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. జిల్లాలో 7, 10వ తరగతగి, ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎక్కువ శాతం డ్రాపవుట్స్‌గా కనిపిస్తున్నారని, డ్రాపవుట్స్ తగ్గించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్ మాట్లాడుతూ ప్రధానంగా ఎస్‌సి, ఎస్‌టి వర్గాల ప్రజల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉందని, ఆయా ప్రాంతాలను గుర్తించి ఎక్కువ దృష్టి పెట్టి వారిని విద్యావంతులను చేయాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.