ప్రకాశం

నాటి పరిస్థితులను తలుచుకొని వణికిపోతున్న టిడిపి నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, అక్టోబర్ 27: ఎఓబిలో జరిగిన సంఘటనతో కొంతకాలం నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టులు తలదాచుకునే అవకాశం ఉందని భావిస్తున్న తరుణంలో మార్కాపురం డివిజన్‌లోని తెలుగుదేశం పార్టీ నేతలు వణికిపోతున్నారు. మావోయిస్టు నేత శ్యాం విడుదల చేసిన ప్రకటనలో ప్రస్తుతం జరిగిన ఎన్‌కౌంటర్‌కు మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఇంటెలిజెన్సీ వర్గాలు టిడిపి నేతలకు హెచ్చరికలు జారీచేశారు. గతంలో టిడిపి నేతలు మావోయిస్టులకు భయపడి గ్రామీణ ప్రాంతాలను విడిచి పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటూ కాలం వెళ్ళబుచ్చారు. ప్రస్తుతం అదే పరిస్థితులు కొనసాగుతాయోమోనని నేతలు ఆందోళన చెందుతున్నారు. 2004 ఎన్నికల సమయంలో టిడిపి నేతలు నల్లమల అటవీ ప్రాంతంలో ప్రచారం చేసేందుకు కూడా భయపడ్డారు. అనంతరం జరిగిన పరిణామాల్లో నల్లమల అటవీప్రాంతంలో మావోయిస్టులు కొందరు లొంగిపోగా, మరికొందరు ఎన్‌కౌంటర్లలో మృతిచెందగా, ఇంకొందరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతం ప్రశాంతంగా ఉంది. ఈ పరిస్థితుల్లో సేఫ్ జోన్‌గా భావించి మావోయిస్టులు నల్లమలకు చేరితే తమ పరిస్థితి ఏమిటా అని అధికార పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.