ప్రకాశం

జిల్లాకు తప్పిన కయాంత్ తుఫాన్ ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 27: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన కయాంత్ తుఫాన్ ప్రభావం జిల్లాపై పెద్దగా ఉండదన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగంతోపాటు, ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. కయాంత్ తుఫాన్ ప్రకాశం, నెల్లూరు జిల్లాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేయటంతో జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. తుఫాన్ అల్పపీడనంగా మారుతుందని, దీనివలన జిల్లాలోని ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై జిల్లా అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశాలు జారీచేసింది. కోస్తాతీరం వెంట 45నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీచేశారు. కయాంత్ తుపాన్‌ప్రభావంతో పెనుగాలులతోపాటు, భారీ వర్షం కురిస్తే అన్ని వర్గాలకు తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉండేది. అలాంటి పరిస్థితులు లేకపోగా వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీచేయటంతో ముఖ్యంగా రైతులతోపాటు, అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా ఎండలు మండుతుండటంతో రైతులు సాగుచేసిన మిర్చి, కంది, వరి, మినుము, పెసర పంటలు వాడుముఖం పట్టాయి. అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఈ పంటలకు ఎంతగానో మేలుచేకూర్చటమేకాకుండా ఎండిపోయిన వాగులు, వంకల్లోకి నీరు చేరే అవకాశాలున్నాయి. ఈ పాటికే జిల్లాలోని రైతాంగాన్ని ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసింది. నాగార్జున్ సాగర్‌నీటితోపాటు భారీ వర్షాలు కురిస్తే అన్నివర్గాలకు మేలు చేకూరనుంది. ఇదిలాఉండగా కయాంత్ తుఫాన్ సంభవించినట్లైతే ముఖ్యంగా మత్స్యకారులకు వేట గడిచేదికాదు. అల్పపీడనంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లేందుకు సముఖత వ్యక్తంచేస్తున్నారు. తుఫాన్ హెచ్చరికల నేపధ్యంలో గత రెండురోజుల నుండి మాత్రం మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. మొత్తంమీద కయాంత్ తుఫాన్ ప్రభావం జిల్లాపై లేకపోవటంతో అన్నివర్గాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.