ప్రకాశం

ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో రాజకీయపక్షాలు నిమగ్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,అక్టోబర్ 28:పట్ట్భద్రులు, ఉపాధ్యాయ ఎంఎల్‌సి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల ఐదవతేదీతో ముగియనున్న నేపధ్యంలో వివిధ రాజకీయపక్షాలకు చెందిన నేతలు ఓటర్ల నమోదులో మునిగితెలుతున్నారు. కేవలం ఓటర్ల నమోదుకు స్వల్పకాల వ్యవధి మాత్రమే ఉండటంతో ప్రధానంగా తెలుగుదేశం, పిడిఎఫ్‌కు చెందిన నేతలు ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశంపార్టీ అభ్యర్థిగా మునిసిపల్ శాఖమంత్రి పి నారాయణ సమీప బంధువు ప్రభాకర్‌రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి. అదేవిధంగా పిడిఎఫ్ అభ్యర్థిగా ప్రస్తుతం ఎంఎల్‌సిగా యండపల్లి శ్రీనివాసరెడ్డి తిరిగి పోటీచేయనున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ, కాంగ్రెస్‌పార్టీ, బిజెపి తరపున అభ్యర్థులను రంగంలోకి దించుతారో లేక పోటీనుండి తప్పుకుంటారో ఆ దేవుడికే తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఇప్పటివరకైతే తెలుగుదేశం, పిడిఎఫ్‌ల తరపున ఓటర్లగా నమోదు చేయించుకునేందుకు నేతలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈపాటికే జిల్లావ్యాప్తంగా 35వేలమంది వరకు ఓటర్లుగా నమోదైనట్లు పార్టీవర్గాల సమాచారం. తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల్లో ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేల వరకు ఓటర్లుగా నమోదుగా కాగా మరో 15వేలమంది ఓటర్లు ఆన్‌లైన్‌లో నమోదుచేసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మాకంగా తీసుకోవటంతో గ్రామస్థాయిలోని తెలుగుదేశంపార్టీ కార్తకర్తనుండి నియోజకవర్గంలోనిశాసనసభ్యుడి వరకు ఎంఎల్‌సి ఎన్నికలపై దృష్టిసారించి ఓటర్లను నమోదు పార్టీశ్రేణులకు పిలుపునిస్తున్నారు. ప్రతి సమావేశంలోను ఎంఎల్‌సి ఎన్నికలపైనే తెలుగుతమ్ముళ్లు పార్టీశ్రేణులకు నూరిపోస్తున్నారు. దీన్నిబట్టిచూస్తే ఈ ఎన్నికలను రాష్టప్రార్టీ ఏవిధంగా ప్రతిష్టాత్మకంగాతీసుకుందో అర్ధమైపోతుంది. ఇదిఇలాఉండగా పిడిఎఫ్ తరుపున ఓటర్ల నమోదులో సిపిఎం పార్టీకి చెందిన పార్టీముఖ్యనాయకులనుండి కార్యకర్తల వరకు నిరంతరం శ్రమిస్తునే ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో యండపల్లిశ్రీనివాసరెడ్డి పోటీచేసి గెలుపొందగా ఈసారి కూడా తమగెలుపు ఖాయమన్న ధీమాలో పిడిఎఫ్ నేతలు ఉన్నారు. కాగా తమ గెలుపు ఖాయమంటూ తెలుగుతమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా జిల్లావ్యాప్తంగా ఓటర్లుగా నమోదుచేసుకునేందుకు పట్ట్భద్రులు తహశీల్దార్, ఎంపిడిఒ కార్యాలయాల వద్దకు వెళ్తే అధికారులు కార్యాలయాల్లో సక్రమంగా ఉండకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. కొంతమంది తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్తే ఎంపిడిఒ కార్యాలయం వద్దకు వెళ్లాలని, కాదు ఎంపిడిఒ కార్యాలయం వద్దకు వెళ్తే తహశీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లాలని ఓటర్లను అధికారులు తిప్పుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంమీద ఓటర్ల నమోదు ప్రక్రియకు రోజులు దగ్గర పడుతుండటంతో తెలుగుతమ్ముళ్లు, పిడిఎఫ్ నాయకులు గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ ముమ్మరంగా ఓటర్లను చేర్పించే పనిలో నిమగ్నమయ్యారు.