ప్రకాశం

నల్లమలలో మావోయిస్టుల బంద్ ప్రభావం ఉండేనా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, నవంబర్ 2: ఎఓబి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోయిస్టులు నవంబర్ 3వతేదీన ప్రకటించిన బంద్ ప్రభావం నల్లమల అటవీప్రాంతంలో ఉండేనా అన్న అనుమానం వ్యక్తం అవుతుంది. పోలీసులు మాత్రం ముందుజాగ్రత్త చర్యగా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోయిస్టుల ఉనికి లేనప్పటికీ ఇటీవల జరిగిన పరిణామాల్లో ఎవరైనా ఈప్రాంతానికి వచ్చి ఉంటారేమోనన్న అనుమానంతో పోలీసులు నల్లమలను జల్లెడ పడుతున్నారు. 1999 నుంచి 2007 వరకు నల్లమలలో పోలీసుల బూట్ల చప్పుడు, మావోయిస్టుల తూటాలు హోరాహోరీగా మోగాయి. 2005లో ప్రభుత్వం మావోయిస్టులను చర్చలకు ఆహ్వానించిన అనంతరం మావోల అలజడి నల్లమలలో తగ్గింది. అదీకాక మావోయిస్టుల రాష్టక్రార్యదర్శి మాధవ్‌తోపాటు 7మంది మావోయిస్టులు, కేంద్ర కమిటీసభ్యులు మట్టా రవికుమార్, శాఖమూరి అప్పారావు లాంటి అగ్రనేతలు మృతి చెందడంతో ఈ ప్రాంతంలో పలువురు లొంగిపోగా మరికొంతమంది అరెస్టు అయ్యారు. దీనితో నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం మావోల అలజడి లేకపోవడంతో బంద్ ప్రభావం పెద్దగా ఉండదని భావించినప్పటికీ ముందస్తు చర్యగా పోలీసులు నల్లమల అటవీప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

అన్ని రంగాల్లో దర్శిని అభివృద్ధి చేస్తా
- మంత్రి శిద్దారాఘవరావు
తాళ్ళూరు, నవంబర్ 2: మండలంలోని టిడిపి జనచైతన్యయాత్రలో భాగంగా కుంటి గంగమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేసి ర్యాలీగా బయలుదేరి మాల్కాపురం గ్రామంలోని ముస్లింకాలనీలో టిడిపి సభ్యత్వాన్ని రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు కార్యకర్తలకు అందజేశారు. అనంతరం తాళ్లూరు గ్రామానికి విచ్చేసి ఎస్‌సి కాలనీ వాసులకు 63మందికి ఇంటిస్థల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలంగా మొదటిస్థానంలో ఉందని కేంద్రం ప్రకటించటంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి ఉందని చెప్పారు. ఇప్పటివరకు దర్శి నియోజకవర్గంలో 15వందల కోట్లరూపాయల అభివృద్ధి చేశానని, ఇంకా తొమ్మిది వందలకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.రాష్ట్రంలో ఎస్‌సి,ఎస్‌టి,బిసికార్పోరేషన్లద్వారా అందరికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి యువతను ఆదుకున్నది ఒక్క చంద్రబాబునాయుడేనన్నారు. దొనకొండనుండి అన్ని పారిశ్రామిక వాడలకు రోడ్లను అనుసంధానం చేస్తానని చెప్పారు. ఈకార్యక్రమంలో పార్టీపరిశీలకులు,బిసి కార్పొరేషన్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నారపశెట్టి పాపారావు, ఎఎంసి చైర్మన్ సూరే చినసుబ్బారావు, నియోజకవర్గ ప్రత్యేకాధికారి రవి, తహశీల్దార్ సరోజిని, ఎంపిడిఒ రాజేష్‌బాబు, టిడిపి పార్టీ అధ్యక్షుడు పెదకాలేషావలి, టిడిపి జిల్లా నాయకులు మానం రమేష్‌బాబు, గ్రామపార్టీ అధ్యక్షుడు శివనాగిరెడ్డి, మాధవవరం నాయకులు ఆదినారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరో 18 కరవు మండలాలు
* ప్రకటించిన ప్రభుత్వం
* ఇప్పటివరకు 41 మండలాల ప్రకటన
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,నవంబర్ 2:జిల్లాలో రెండోవిడత మరో 18 మండలాలను కరవు మండలాలుగా ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లావ్యాప్తంగా 56మండలాలు ఉండగా తొలివిడతగా 23మండలాలను ప్రకటించగా రెండోవిడత 18మండలాలను ప్రకటించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 41మండలాలను కరవుమండలాలుగా ప్రకటించగా మిగిలిన 15 మండలాలను కరవుమండలాలుగా ప్రకటించాలని జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు డిమాండ్‌చేస్తున్నారు. రెండవవిడతగా ప్రకటించిన మండలాలజాబితా వివరాలు ఈవిధంగా ఉన్నాయి. జిల్లాలోని దొనకొండ,మార్కాపురం, పెద్దారవీడు, మద్దిపాడు, కొరిశపాడు, పర్చూరు, ఉలవపాడు, పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, దర్శి, బేస్తవారిపేట మండలాలు ఉన్నాయి. అదేవిధంగా ఒంగోలు, టంగుటూరు, కొత్తపట్నం, సంతనూతలపాడు, కొండెపి, జరుగుమల్లి మండలాలు కరువుజాబితాలో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు మంగళవారం జిల్లాపర్యటనకు వచ్చిన సందర్బంగా రైతుసంఘాలనాయకులు, వివిధసంఘాల ప్రతినిధులు కలిసి జిల్లాను కరవుజిల్లాగా ప్రకటించాలని వినతిపత్రాలను సమర్పించారు. ఇదిలా ఉండగా జిల్లామొత్తాన్ని కరవు జిల్లాగా ప్రకటిస్తే కరువునిధులు జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు ఎక్కువుగా వచ్చేఅవకాశాలున్నాయి. కాగా జిల్లాను కరవు జిల్లాగా ప్రకటించాలని ప్రధానప్రతిపక్షపార్టీ అయిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టిన దాఖలు లేవు. జిల్లాలో మొదటివిడతగా 23మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిన సమయంలోనే జిల్లావ్యాప్తంగా వైకాపానాయకులు పెద్దఎత్తున ఆందోళన చేయాల్సి ఉందని, కాని పోరుబాటను పట్టడటం లేదని ఆ పార్టీకి చెందిన నేతలే నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. చింత చచ్చినా పులుపుచావలేదన్న సామెతగా రాష్ట్రంలో అధికారంలో లేకపోయినప్పటికీ ఏమాత్రం ప్రతిపక్షంలో ఉన్నామన్న ఆలోచన లేకుండా నాయకులు రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడటంలో వైఫలం చెందుతున్నారనేది జగమెరిగిన సత్యమే.

చంద్రబాబుతో జిల్లా నేతల భేటి
-- అర్ధరాత్రి వరకు కొనసాగిన చర్చలు --
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, నవంబర్ 2: జిల్లాలోని కందుకూరు నియోజకవర్గానికి చెందిన శాసన సభ్యులు పోతుల రామారావు, ఇన్‌చార్జ్ దివి శివరాం, గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ముత్తముల అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుతో బేటి అయ్యారు. విజయవాడలోని ముఖ్యమంత్రి చాంబర్‌లో బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు వీరి మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దారాఘవరావు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రావెల కిషోర్‌బాబు, జిల్లా టిడిపి అధ్యక్షులు దామంచర్ల జనార్దన్ ఉన్నారు. ఈ భేటిలో ప్రధానంగా రెండు నియోజక వర్గాల్లో జరిగే జనచైతన్యయాత్ర కార్యక్రమాలపై చర్చ సాగింది. అందరూ కలసికట్టుగా జనచైతన్య యాత్రలను సాగించాలే తప్ప గ్రూపులు వద్దంటూ ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీచేసినట్లు సమాచారం. శాసన సభ్యులే పగ్గాలు చేపట్టినట్లు తెలుస్తోంది. మంగళవారం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఆయా నియోజక వర్గాలకు చెందిన నేతలు బుధవారం విజయవాడకు రావాలని ఆదేశించారు. ఈనేపథ్యంలో ఆయా నియోజక వర్గాల నేతలు కలిసారు. రాత్రి బాగా పొద్దుపోయన తరువాత కూడా జిల్లాకు చెందిన నేతలు అధినేత చంద్రబాబుతో చర్చల్లో పాల్గొన్నారు.

హత్యకేసులో నిందితుడు అరెస్టు
కందుకూరు, నవంబర్ 2: గత నెల 28వ తేదీన మండల పరిధిలోని విక్కిరాలపేటకు చెందిన జహంగీర్ బాషా హత్య కేసులో ముద్దాయిగా భావించబడుతున్న పి సాంబశివరావు అలియాస్ సాంబయ్యను అరెస్టు చేసినట్లు సిఐ కె నరసింహారావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసుకు సంబంధించిన పూర్తివివరాలను వెల్లడించారు. సాంబయ్యకు విక్కిరాలపేట సమీపంలో సరుగుడు తోట ఉందని, ఆ తోటలో జహంగీర్ బాషా హత్యకు ఐదు రోజులు ముందు నుంచి మేకల మేతకు కోసం చెట్లను విరిచేవాడని తెలిపారు. దీంతో సాంబయ్య, ఆయన భార్య కోటమ్మ పొలం వద్ద కాపుకాచినట్లు వివరించారు. జహంగీర్ బాషా కర్రను విరుస్తున్న సమయంలో వారిద్దరు జహంగీర్ బాషాతో వాదనకు దిగినట్లు తెలిపారు. ఇదే సమయంలో సాంబయ్య జహంగీర్ బాషాపై దాడి చేయగా తీవ్రగాయాలైనట్లు ఆయన తెలిపారు. సమీప పొల్లాలోని ఉన్న జహంగీర్‌బాషా కుమారుడు సుల్తాన్‌బాషాకు సమాచారం ఇవ్వగా, గాయపడిన జహంగీర్‌బాషాను కుమారుడు వైద్య సేవల నిమిత్తం ఒంగోలుకు తరలించారు. చికిత్స పొందుతూ జహంగీర్‌బాషా మృతి చెందినట్లు ఆయన తెలిపారు.